Telugu Global
MOVIE UPDATES

అంటే.. సినిమాలో సస్పెన్స్ కూడా ఉంది

అంటే సుందరానికి ట్రయిలర్ ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చేసింది. ఇదొక బ్రాహ్మణ అబ్బాయి, క్రిస్టియన్ అమ్మాయి మధ్య జరిగే ప్రేమకథ అనే విషయం ట్రయిలర్ లో చెప్పేశారు. సినిమా కథ ఇదే అనుకుంటే మాత్రం పొరపాటే. స్టోరీలైన్ లో ఓ చిన్న సస్పెన్స్ కూడా ఉందంటున్నాడు దర్శకుడు వివేక్ ఆత్రేయ. “అవును. టీజర్, ట్రైలర్ లో కథ ఎలా ఉండబోతుందో ఒక ఐడియా మాత్రమే ఇచ్చాం. సస్పెన్స్ అలానే కొనసాగుతుంది. ట్రైలర్ లో ఎమోషన్, ఫన్ చూపించాం. ట్రైలర్ […]

Movie title Ante Sundharaniki
X

అంటే సుందరానికి ట్రయిలర్ ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చేసింది. ఇదొక బ్రాహ్మణ అబ్బాయి, క్రిస్టియన్ అమ్మాయి మధ్య జరిగే ప్రేమకథ అనే విషయం ట్రయిలర్ లో చెప్పేశారు. సినిమా కథ ఇదే అనుకుంటే మాత్రం పొరపాటే. స్టోరీలైన్ లో ఓ చిన్న సస్పెన్స్ కూడా ఉందంటున్నాడు దర్శకుడు వివేక్ ఆత్రేయ.

“అవును. టీజర్, ట్రైలర్ లో కథ ఎలా ఉండబోతుందో ఒక ఐడియా మాత్రమే ఇచ్చాం. సస్పెన్స్ అలానే కొనసాగుతుంది. ట్రైలర్ లో ఎమోషన్, ఫన్ చూపించాం. ట్రైలర్ చివర్లో నవ్వుకున్నారు. ఏం జరుగుతుందో అనే ఆసక్తి ఏర్పడింది కదా.. సినిమా అంతా కూడా ఇంతే ఆసక్తికరంగా ఉంటుంది. ఆ ‘అంటే’ ఏమిటో అనేదే ఇందులో కీలకం. అది మీకు కచ్చితంగా నచ్చుతుంది.”

ఇలా సినిమాలో సస్పెన్స్ కూడా ఉందనే విషయాన్ని బయటపెట్టాడు వివేక్. నాని పాత్ర ఎంత హిలేరియస్ గా ఉంటుందో, అంతే ఎమోషనల్ గా కూడా ఉంటుందని, అతడి క్యారెక్టర్ లో చాలా లోతు ఉంటుందని అంటున్నాడు.

“నాని ఇప్పటివరకూ ఇలాంటి పాత్ర చేయలేదు. చాలా డిఫరెంట్ పాత్ర. ఆయన పాత్రలో చాలా లేయర్స్ ఉంటాయి. ఫన్ ఉంటుంది. దాని వెనుక పెయిన్ ఉంటుంది. ప్రతి మాట వెనుక భిన్నమైన లేయర్ ఉంటుంది. అయితే అవన్నీ లోపల పెట్టుకొని బయటకి మాత్రం ఏమీ కనిపించకుండా మాట్లాడే పాత్ర చేయడం అంత సులువు కాదు. నాని ఫన్ గురించి చెప్పనక్కర్లేదు. అయితే ఇందులో కచ్చితంగా డిఫరెంట్ నానిని చూడబోతున్నారు.”

10వ తేదీన థియేటర్లలోకి వస్తోంది అంటే సుందరానికి సినిమా. నజ్రియా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కింది ఈ ఫన్ మూవీ.

First Published:  6 Jun 2022 12:19 AM GMT
Next Story