Telugu Global
MOVIE UPDATES

‘స్పై’ మూవీ గ్లింప్స్.. ఇనిస్టెంట్ హిట్

నిఖిల్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మల్టీ లాంగ్వెజ్ చిత్రం ‘స్పై‘. ఎవరు, గూఢచారి, హిట్ లాంటి సూపర్ హిట్ చిత్రాల ఎడిటర్ గా చేసిన గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో ఎడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై నిర్మాత కె. రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా నిఖిల్‌ ని ‘స్పై’ గా పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ ఒక గ్లింప్స్ వీడియోని విడుదల చేసింది. చేతిలో ట్రాన్స్‌మిటర్‌ తో మంచు పర్వతాల […]

‘స్పై’ మూవీ గ్లింప్స్.. ఇనిస్టెంట్ హిట్
X

నిఖిల్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మల్టీ లాంగ్వెజ్ చిత్రం ‘స్పై‘. ఎవరు, గూఢచారి, హిట్ లాంటి సూపర్ హిట్ చిత్రాల ఎడిటర్ గా చేసిన గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో ఎడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై నిర్మాత కె. రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

తాజాగా నిఖిల్‌ ని ‘స్పై’ గా పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ ఒక గ్లింప్స్ వీడియోని విడుదల చేసింది. చేతిలో ట్రాన్స్‌మిటర్‌ తో మంచు పర్వతాల మీద నడుస్తున్న నిఖిల్, ఆయుధాలు ఉన్న రహస్య ప్రదేశాన్ని చేరుకోవడం, గన్ పట్టుకొని బైక్ నడుపుతూ శత్రువులను వేటాడడానికి రంగంలోకి దిగడం ఈ పవర్ ఫుల్ గ్లింప్స్ లో చూపించారు.

ఇందులో నిఖిల్ స్లిక్, స్టైలిష్ , డాషింగ్‌ గా కనిపిస్తున్నాడు. తన కెరీర్ లో నిఖిల్ పోషిస్తున్న తొలి జేమ్స్ బాండ్ తరహా పాత్ర ఇదే. లార్జర్ దేన్ లైఫ్ యాక్షన్ ఎంటర్‌ టైనర్ గా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం 2022 దసరాకి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఆర్యన్ రాజేష్ కొంత గ్యాప్ తర్వాత ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. ఇది అతనికి పర్ఫెక్ట్ రీ-ఎంట్రీ మూవీ అని చెప్పొచ్చు. నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది.

First Published:  6 Jun 2022 11:12 AM GMT
Next Story