Telugu Global
MOVIE UPDATES

కరోనా బారిన పడిన కింగ్ ఖాన్

బాలీవుడ్ ను కరోనా మరోసారి వణికిస్తోంది. తాజాగా కింగ్ ఖాన్ షారూక్ ఈ మహమ్మారి బారిన పడ్డాడు. తనకు కరోనా సోకిన విషయాన్ని షారూక్ ప్రకటించాడు. వెంటనే ఆయన ఐసొలేషన్ లోకి వెళ్లిపోయారు. షారూక్ కు కరోనా సోకడంతో ఆయన చేయాల్సిన జవాన్ సినిమా షూటింగ్ వాయిదా పడింది. వారం రోజుల కిందట దర్శక-నిర్మాత కరణ్ జోహార్ తన బర్త్ డే పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీకి వచ్చిన చాలామందికి కరోనా సోకింది. దాదాపు 50 మంది […]

కరోనా బారిన పడిన కింగ్ ఖాన్
X

బాలీవుడ్ ను కరోనా మరోసారి వణికిస్తోంది. తాజాగా కింగ్ ఖాన్ షారూక్ ఈ మహమ్మారి బారిన పడ్డాడు. తనకు కరోనా సోకిన విషయాన్ని షారూక్ ప్రకటించాడు. వెంటనే ఆయన ఐసొలేషన్ లోకి వెళ్లిపోయారు. షారూక్ కు కరోనా సోకడంతో ఆయన చేయాల్సిన జవాన్ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

వారం రోజుల కిందట దర్శక-నిర్మాత కరణ్ జోహార్ తన బర్త్ డే పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీకి వచ్చిన చాలామందికి కరోనా సోకింది. దాదాపు 50 మంది కరోనా బారిన పడినట్టు సమాచారం. ఆ పార్టీకి షారూక్ కూడా హాజరయ్యాడు. అతడికి కూడా అక్కడే కరోనా సోకి ఉంటుందని చాలామంది భావిస్తున్నారు.

రీసెంట్ గా అట్లీ దర్శకత్వంలో సినిమా లాంఛ్ చేశాడు షారూక్. దానికి జవాన్ అనే పేరు పెట్టారు. ఫస్ట్ లుక్ లో భాగంగా ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ వెంటనే షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు. కానీ అంతలోనే కరోనా బారిన పడ్డాడు ఈ సీనియర్ హీరో. జవాన్ ఫస్ట్ లుక్ సూపర్ హిట్టయిందనే ఆనందం 24 గంటలు కూడా నిలవలేదు ఈ హీరోకి.

షారూక్ తో పాటు అతడి భార్య గౌరీఖాన్ కూడా బర్త్ డే పార్టీకి హాజరైంది. ఆమె పరిస్థితేంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. 2 వారాల తర్వాత జవాన్ షూటింగ్ తిరిగి మొదలయ్యే అవకాశం ఉంది.

First Published:  6 Jun 2022 12:13 AM GMT
Next Story