Telugu Global
NEWS

చంద్ర‌బాబు వీక్‌నెస్‌తో ఆడుకుంటున్న ప‌వ‌న్‌, బీజేపీ

పవన్‌ కల్యాణ్ తొలి నుంచి జగన్‌పై ఏదో వ్యక్తిగత ద్వేషం ఉన్నట్టుగా మాట్లాడుతూ వస్తున్నారు. ఇది చూసిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో పవన్‌ తిరిగి తప్పనిసరిగా తనకే మద్దతు ఇస్తారన్న ధీమాతో ఉంటూ వచ్చారు. బీజేపీ కూడా తనవైపు వస్తుందని ఆయన ఆశించారు. రెండు పార్టీలకు కలిపి పాతిక, ముప్పై సీట్లు ఇచ్చి పండుగ చేసుకోండి అని అందామనుకున్నారు. కానీ అలా లేదు పరిస్థితి. జగన్‌ అంటే పడని పవన్‌ వీక్‌నెస్‌తో ఆడుకుందామని చంద్రబాబు అనుకుంటే.. ఇప్పుడు […]

చంద్ర‌బాబు వీక్‌నెస్‌తో ఆడుకుంటున్న ప‌వ‌న్‌, బీజేపీ
X

పవన్‌ కల్యాణ్ తొలి నుంచి జగన్‌పై ఏదో వ్యక్తిగత ద్వేషం ఉన్నట్టుగా మాట్లాడుతూ వస్తున్నారు. ఇది చూసిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో పవన్‌ తిరిగి తప్పనిసరిగా తనకే మద్దతు ఇస్తారన్న ధీమాతో ఉంటూ వచ్చారు. బీజేపీ కూడా తనవైపు వస్తుందని ఆయన ఆశించారు. రెండు పార్టీలకు కలిపి పాతిక, ముప్పై సీట్లు ఇచ్చి పండుగ చేసుకోండి అని అందామనుకున్నారు. కానీ అలా లేదు పరిస్థితి.

జగన్‌ అంటే పడని పవన్‌ వీక్‌నెస్‌తో ఆడుకుందామని చంద్రబాబు అనుకుంటే.. ఇప్పుడు పవన్, బీజేపీ కలిసి రివర్స్‌లో పవర్‌ లేనిదే బతకలేని చంద్రబాబు వీక్‌నెస్‌తో ఆడుకుంటున్నారు. పవన్‌ కల్యాణ్ తీరు ఎలా ఉందంటే.. ”నేను ఎలాగో సీఎం అయ్యేది లేదుపోయేది లేదు.. ఎన్నికల్లో ఓడినా, గెలిచినా నాకు ప్రత్యేకంగా పోయేది ఏమీ లేదు. కాబట్టి నేను అన్నిటికీ సిద్ధం. మీ టీడీపీ పరిస్థితి అలా కాదు. ఈసారి గెలవకుంటే మీ పని అవుట్‌. కాబట్టి చంద్రబాబు మీరు బాగా తగ్గి.. నా విలువను భారీగా హెచ్చించండి ” అన్నట్టుగా ఉంది. ఏరూపంలోనైనా ఈసారి జనసేన విషయంలో చంద్రబాబు భారీగా సమర్పించుకోక తప్పేలా లేదు.

బీజేపీ కూడా మరి మా సంగతేంటి అంటోంది. ఆ పార్టీ నేతలు మరీ ఓపెన్‌గా మాట్లాడేస్తున్నారు. అవును 2019 ఎన్నికల్లో మాకు ఒకశాతం ఓట్లు కూడా రాలేదు. అయినా సరే ఈసారి మా విషయంలోనూ చంద్రబాబు పూర్తిగా తగ్గితేనే పొత్తు అని బెదిరిస్తున్నారు. ఏపీ బీజేపీ నేత విష్ణువర్థన్‌ రెడ్డి చెప్పిన మాటలే అందుకు నిదర్శనం. ” పవన్‌ చాలా చక్కగా చెప్పారు. ఇటీవల కొన్ని ప్రధాన పార్టీల నేతలు చెబుతున్నారు వైసీపీని ఓడించేందుకు త్యాగాలకు సిద్ధం అని. ఇప్పుడు త్యాగాలు చేయాల్సిన వారి కోర్టులో బంతి ఉంది. బీజేపీ బలమెంత?, మరో పార్టీ శక్తి ఎంత ? అని కొందరు మాట్లాడుతున్నారు. మా దగ్గర 15 మార్కులున్నాయి. మీ దగ్గర 20 మార్కులు ఉన్నాయి. మీ 20 మార్కులకు మా 15 మార్కులు కలిస్తేనే.. మీ 20 మార్కులకు విలువ. లేకుండా ఆ 20 మార్కులు గంగలో కలిసినట్టే” అంటూ టీడీపీని ఉద్దేశించి విష్ణువర్థన్ రెడ్డి మాట్లాడారు.

అంటే టీడీపీకి ఉన్న అధికార దాహం అనే వీక్‌నెస్‌ను జనసేన, బీజేపీ కనిపెట్టేశాయి. అందుకే ఒంటరిగా వెళ్లి ఓడిపోతారా?.. మాకు కావాల్సినన్ని సీట్లు ఇచ్చి జగన్‌ను ఓడించేందుకు ప్రయత్నిస్తావా ఆలోచించుకో అని చంద్రబాబుకు వీరు ఒక విధంగా అల్టిమేటం ఇస్తున్నాయి.

First Published:  5 Jun 2022 11:34 PM GMT
Next Story