Telugu Global
NEWS

టెన్త్‌ ఫలితాల హైలైట్స్‌, విమర్శలపై బొత్స గట్టి సమాధానం

ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. పొరునున్న తెలంగాణ, తమిళనాడు, ఒడిషా కంటే ముందుగా ఏపీలోనే ఫలితాలు విడుదల చేశామన్నారు. గతం కంటే ఉత్తీర్ణత శాతం తగ్గడానికి కారణం కరోనా వల్ల సరైన కోచింగ్‌ అందకపోవడమేనని మంత్రి అభిప్రాయపడ్డారు. పట్టణ ప్రాంతాల్లో,గ్రామీణ ప్రాంతాల్లో ఫలితాలు ఎలా ఉన్నాయి అన్న దానిపై పరిశీలన చేస్తామన్నారు. శనివారం ఫలితాల విడుదల వాయిదాపడడంపై వచ్చిన విమర్శలకు మంత్రి బొత్స తీవ్రంగా స్పందించారు. […]

టెన్త్‌ ఫలితాల హైలైట్స్‌, విమర్శలపై బొత్స గట్టి సమాధానం
X

ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. పొరునున్న తెలంగాణ, తమిళనాడు, ఒడిషా కంటే ముందుగా ఏపీలోనే ఫలితాలు విడుదల చేశామన్నారు. గతం కంటే ఉత్తీర్ణత శాతం తగ్గడానికి కారణం కరోనా వల్ల సరైన కోచింగ్‌ అందకపోవడమేనని మంత్రి అభిప్రాయపడ్డారు. పట్టణ ప్రాంతాల్లో,గ్రామీణ ప్రాంతాల్లో ఫలితాలు ఎలా ఉన్నాయి అన్న దానిపై పరిశీలన చేస్తామన్నారు. శనివారం ఫలితాల విడుదల వాయిదాపడడంపై వచ్చిన విమర్శలకు మంత్రి బొత్స తీవ్రంగా స్పందించారు.

ఫలితాల్లో కీలక అంశాలు..
మొత్తం 6 లక్షల 15వేల 908 మంది పరీక్షలకు హాజరయ్యారని.. 4 లక్షల 14వేల మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

మొత్తం ఉత్తీర్ణత శాతం 67. 26
అబ్బాయిలు 3లక్షల 16వేల 820 మంది పరీక్షలు రాయగా.. అందులో 2 లక్షల2వేల 821 మంది పాస్‌.
అమ్మాయిలు 2లక్షల 99 వేల మంది పరీక్షలు రాయగా.. 2లక్షల 11వేల మంది ఉత్తీర్ణత సాధించారు.

అబ్బాయిల ఉత్తీర్ణత శాతం- 64.02 శాతం
అమ్మాయిల ఉత్తీర్ణత శాతం- 70.7 శాతం
తొలి స్థానంలో ప్రకాశం, ఆఖరిస్థానంలో అనంతపురం జిల్లా
ప్రకాశం జిల్లా 78.3 శాతంతో ఉత్తీర్ణతలో మొదటి స్థానం
అనంతపురం జిల్లా 49.7 శాతం ఉత్తీర్ణతతో ఆఖరి స్థానం

మొత్తం స్కూళ్ల సంఖ్య 11వేల 671
వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాల సంఖ్య-797
సున్న శాతం ఉత్తీర్ణత కనబరిచిన స్కూళ్ల సంఖ్య- 71
సున్న శాతం ఉత్తీర్ణత సాధించిన ప్రైవేట్‌ స్కూళ్ల సంఖ్య-31

వచ్చే నెల 6 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
రేపటి నుంచి సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లింపుకు అవకాశం

అందుకే నేనే ఫలితాలు విడుదల చేస్తున్నా- బొత్స
శనివారం ఫలితాల విడుదల వాయిదాపడడంపై వచ్చిన విమర్శలకు మంత్రి బొత్స స్పందించారు. సాంకేతిక అంశాలను బలోపేతం చేసేందుకు కొంత సమయం కావాలనడంతో సోమవారం విడుదల చేద్దామని అధికారులకు చెప్పానని.. దానికి మీడియా ఏదేదో రాసిందన్నారు. ఫలితాలు విడుదల చేయడం ప్రభుత్వానికి చేతగాదు, మంత్రికి తెలియకుండానే అధికారులు ఫలితాలు విడుదల చేయబోయారు అంటూ రాశారని మంత్రి బొత్స విమర్శించారు.

ఫలితాలను అధికారులే విడుదల చేయాల్సిందిగా తానే సూచించానన్నారు. కానీ మీడియాలో వచ్చిన కథనాలు చూసిన తర్వాత అపోహలు ఉండకూడదనే తానే ఫలితాలు విడుదల చేస్తున్నానని వివరించారు. 2015లో ఫలితాల విడుదలకు 39 రోజులు, 2016లో 33 రోజులు, 2017లో 35రోజులు, 2018లో 31 రోజులు, 2019లో 31 రోజులు తీసుకున్నారని.. ఈసారి ఫలితాల విడుదలకు 28 రోజులు మాత్రమే తీసుకున్నామన్నారు. ఈ విషయాలను గుర్తించకుండా ఫలితాలు విడుదల చేయడం ప్రభుత్వానికి చేతకాలేదని ఎలా రాస్తారని ప్రశ్నించారు.

First Published:  6 Jun 2022 2:41 AM GMT
Next Story