Telugu Global
NEWS

ఉమాకు అంబటి సవాల్.. ఆ ట్వీట్ ఎందుకు డిలీట్ చేశావో చెప్పే దమ్ముందా?

పవన్ కల్యాణ్ టార్గెట్‌గా టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా ఒక ట్వీట్ చేశారు. పొత్తులపై ఇచ్చిన ఆప్షన్లను ఎద్దేవా చేస్తూ పెట్టిన ఆ ట్వీట్‌ను ఆ తర్వాత ఉమా డిలీట్ చేశారు. తాజాగా ఆ విషయంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. దేవినేని ఉమా పెట్టిన ట్వీట్ ఎందుకు తొలగించావ‌ని.. ధైర్యం ఉంటే ఆ ట్వీట్ ఎందుకు డిలీట్ చేశావో చెప్పు అంటూ సవాల్ విసిరారు. దేవినేని ఉమా సదరు ట్వీట్‌లో పవన్ టార్గెట్‌గా […]

ఉమాకు అంబటి సవాల్.. ఆ ట్వీట్ ఎందుకు డిలీట్ చేశావో చెప్పే దమ్ముందా?
X

పవన్ కల్యాణ్ టార్గెట్‌గా టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా ఒక ట్వీట్ చేశారు. పొత్తులపై ఇచ్చిన ఆప్షన్లను ఎద్దేవా చేస్తూ పెట్టిన ఆ ట్వీట్‌ను ఆ తర్వాత ఉమా డిలీట్ చేశారు. తాజాగా ఆ విషయంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. దేవినేని ఉమా పెట్టిన ట్వీట్ ఎందుకు తొలగించావ‌ని.. ధైర్యం ఉంటే ఆ ట్వీట్ ఎందుకు డిలీట్ చేశావో చెప్పు అంటూ సవాల్ విసిరారు.

దేవినేని ఉమా సదరు ట్వీట్‌లో పవన్ టార్గెట్‌గా వ్యాఖ్యలు చేశారు. ‘ఉట్టికి ఎగరలేనమ్మ.. స్వర్గానికి వెళ్తాను అన్న‌ది అంట..!! అలా ఉంది ఒక్క చోటా కూడా గెలవని సన్నాసులు మాకు ఆప్షన్లు ఇవ్వడం చూస్తుంటే..!!’ అని పేర్కొన్నారు. ఉమా డిలీట్ చేసిన ట్వీట్‌ స్క్రీన్ షాట్‌ను మంత్రి రాంబాబు పోస్టు చేసి ‘ఈ ట్వీట్ పెట్టి, డిలీట్ చేసిన మాట వాస్తవమా, కాదా? ధైర్యముంటే చెప్పు’ అని డిమాండ్ చేశారు.

అంబటి, దేవినేని ఉమా మధ్య గత కొంతకాలంగా మాటల యుద్ధం జరుగుతుంది. పోలవరం విషయంలో ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా మాటల తూటాలు పేల్చుకున్నారు. ఉమా గతంలో ఇరిగేషన్ మినిస్టర్ కాగా.. అంబటి ప్రస్తుతం అదే శాఖను చూస్తున్నారు. ఈ క్రమంలో పవన్ పొత్తుల విషయంలో ఉమా ట్వీట్ చేసి అంబటికి విమర్శలు చేసేందుకు తానే సందు ఇచ్చినట్లు అయ్యింది. మరి ఈ విషయంలో దేవినేని స్పందిస్తారో లేదో చూడాలి.

First Published:  6 Jun 2022 4:21 AM GMT
Next Story