Telugu Global
National

బీజేపీ పై కేటీఆర్ ట్వీట్ జాతీయ స్థాయిలో ట్రెండింగ్

బీజేపీ పై కేటీఆర్ చేసిన ట్వీట్ జాతీయ స్థాయిలో ట్రెండింగ్ అయ్యింది. ”బీజేపీ మతోన్మాదులు చేస్తున్న విద్వేషపూరిత వ్యాఖ్యలకు అంతర్జాతీయ సమాజానికి భారత దేశం ఎందుకు సమాధానం చెప్పాలి” అని ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం ట్విట్టర్ ట్ర్ండింగ్ లో రెండవ‌ స్థానంలో ఉంది. బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్, జాతిపిత మహాత్మా గాంధీ మీద చేసిన వ్యాఖ్యలను కూడా ఈ సందర్భంగా కేటీఆర్ ఆధారాలతో సహా పోస్టు చేసి ప్రధాని మోడీని ప్రశ్నించారు. […]

బీజేపీ పై కేటీఆర్ ట్వీట్ జాతీయ స్థాయిలో ట్రెండింగ్
X

బీజేపీ పై కేటీఆర్ చేసిన ట్వీట్ జాతీయ స్థాయిలో ట్రెండింగ్ అయ్యింది. ”బీజేపీ మతోన్మాదులు చేస్తున్న విద్వేషపూరిత వ్యాఖ్యలకు అంతర్జాతీయ సమాజానికి భారత దేశం ఎందుకు సమాధానం చెప్పాలి” అని ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం ట్విట్టర్ ట్ర్ండింగ్ లో రెండవ‌ స్థానంలో ఉంది.

బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్, జాతిపిత మహాత్మా గాంధీ మీద చేసిన వ్యాఖ్యలను కూడా ఈ సందర్భంగా కేటీఆర్ ఆధారాలతో సహా పోస్టు చేసి ప్రధాని మోడీని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖలను మీరు అనుమతి ఇస్తున్నారంటే వాటిని మీరు ప్రమోట్ చేసిన విధంగా భావించాల్సి వస్తోందన్నారు. మీ నుండి వచ్చిన నిశ్శబ్ద మద్దతే మతోన్మాదాన్ని, ద్వేషాన్ని ప్రోత్సహిస్తోంది , దేశానికి ఇది కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తుంది అని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.

మంత్రి కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ లో భాగంగా వాడిన వ్యాఖ్య hate speeches of BJP bigots పేరుమీద జాతీయ స్థాయి మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. బీజేపీ నాయకులు చేస్తున్న విషప్రచారాలు, విద్వేష పూరిత ప్రసంగాలకు దేశ యువత పెడదారి పడుతోందని.. ఇదే విధానము కొనసాగితే దేశానికి కలిగే నష్టం అపారమని ఈ సందర్భంగా పలువురు నెటిజనులు పేర్కొన్నారు. మసీదులను తవ్వుతాం అంటూ ఒక వర్గాన్ని ఉద్దేశించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కూడా ఖండిస్తూ నెటిజనులు ట్వీట్లతో హోరెత్తించారు. మొత్తంమీద మంత్రి కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ భారతదేశంలో జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది.

జాతీయ స్థాయిలో పలువురు రాజకీయ నాయకులతో పాటు, సీనియర్ జర్నలిస్టులు కూడా కేటీఆర్ వ్యాఖ్యలకు తమ మద్దతు తెలుపుతూ ట్వీట్లు వేయడం గమనార్హం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ”నా తెలంగాణ ప్రశ్నిస్తోంది.. దేశం అనుసరిస్తోంది.. బీజేపీ మతోన్మాద రాజకీయాల మీద మా నాయకుడు కేటీఆర్ గొంత్తితే జాతీయ స్థాయిలో అది చర్చకు దారి తీసింది” అంటూ ట్వీట్ చేశారు.

Next Story