Telugu Global
MOVIE UPDATES

మేజర్ సినిమా మహేష్ బాబు చేసుంటే..?

ఓ సినిమా హిట్టయినప్పుడు అందులో తమ హీరో నటించి ఉంటే రిజల్ట్ నెక్ట్స్ లెవెల్లో ఉండేదనే చర్చ చాలా కామన్. ఓ పెద్ద సినిమాలో ఫ్యాన్స్ అందరూ తమ అభిమాన హీరోను ఊహించుకుంటారు. పవన్ సినిమాలో మహేష్ ను.. మహేష్ సినిమాలో ప్రభాస్ ను ఊహించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు అలాంటిదే మరో చర్చ మొదలైంది. ఈసారి ఈ చర్చకు కారణమైన సినిమా మేజర్. అడివి శేష్ హీరోగా నటించిన సినిమా మేజర్. ఇందులో సందీప్ […]

మేజర్ సినిమా మహేష్ బాబు చేసుంటే..?
X

సినిమా హిట్టయినప్పుడు అందులో తమ హీరో నటించి ఉంటే రిజల్ట్ నెక్ట్స్ లెవెల్లో ఉండేదనే చర్చ చాలా కామన్. ఓ పెద్ద సినిమాలో ఫ్యాన్స్ అందరూ తమ అభిమాన హీరోను ఊహించుకుంటారు. పవన్ సినిమాలో మహేష్ ను.. మహేష్ సినిమాలో ప్రభాస్ ను ఊహించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు అలాంటిదే మరో చర్చ మొదలైంది. ఈసారి ఈ చర్చకు కారణమైన సినిమా మేజర్.

అడివి శేష్ హీరోగా నటించిన సినిమా మేజర్. ఇందులో సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో కనిపించాడు అడివి శేష్. సినిమాకు హిట్ టాక్ వచ్చింది. అన్ని ఏరియాల నుంచి, అన్ని సెక్షన్ల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇప్పుడీ సినిమాలో మహేష్ హీరోగా నటిస్తే బాగుండేదనే చర్చ మొదలైంది.

మేజర్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు మహేష్. ఈ సినిమాను నిర్మించడంతో పాటు.. సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో నటించి ఉంటే బాగుండేదని అతడి ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మహేష్ నటించి ఉంటే సినిమా రిజల్ట్ మరో రేంజ్ లో ఉండేదని చెబుతున్నారు.

ఫ్యాన్స్ వాదనలో నిజం ఉంది. అడివి శేష్ మార్కెట్ కు, మహేష్ మార్కెట్ కు చాలా తేడా ఉంది. మహేష్ వంద కోట్ల హీరో. మేజర్ సినిమా చేస్తే అది కూడా వంద కోట్ల సినిమా అయ్యేది. కానీ మహేష్ తన కంటూ కొన్ని రూల్స్ పెట్టుకున్నాడు. తను చేసే సినిమాలో యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, ఫైట్స్ అన్నీ మిక్స్ అయ్యేలా చూసుకుంటాడు.

పైగా బయోపిక్స్ చేయనని మహేష్ ఇదివరకే చెప్పేశాడు. సో.. అలా మహేష్ డ్రాప్ అయ్యాడన్నమాట. కానీ ప్రాజెక్టుపై ఇష్టంతో నిర్మాతగా వ్యవహరించాడు.

First Published:  6 Jun 2022 11:16 AM GMT
Next Story