Telugu Global
MOVIE UPDATES

మేజర్ సక్సెస్ పై శేష్ రియాక్షన్ ఇది!

విడుదలైన మొదటి రోజు నుంచే సక్సెస్ టాక్ తెచ్చుకుంది మేజర్ సినిమా. అడివి శేష్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రతి ఒక్కర్ని ఎమోషనల్ గా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా సెకండాఫ్ కు అంతా కనెక్ట్ అవుతున్నారు. ఊహించిన దానికంటే ఎక్కువగా సినిమా హిట్టవ్వడంతో హీరో శేష్ ఆనందానికి అవధుల్లేవ్. ఈ సందర్భంగా తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నాడు ఈ నటుడు. “ఇండస్ట్రీలో ఒక అలవాటు ఉంది. మార్నింగ్ షో అయిపోగానే సినిమా గురించి మంచిగా వింటున్నాం […]

మేజర్ సక్సెస్ పై శేష్ రియాక్షన్ ఇది!
X

విడుదలైన మొదటి రోజు నుంచే సక్సెస్ టాక్ తెచ్చుకుంది మేజర్ సినిమా. అడివి శేష్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రతి ఒక్కర్ని ఎమోషనల్ గా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా సెకండాఫ్ కు అంతా కనెక్ట్ అవుతున్నారు. ఊహించిన దానికంటే ఎక్కువగా సినిమా హిట్టవ్వడంతో హీరో శేష్ ఆనందానికి అవధుల్లేవ్. ఈ సందర్భంగా తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నాడు ఈ నటుడు.

“ఇండస్ట్రీలో ఒక అలవాటు ఉంది. మార్నింగ్ షో అయిపోగానే సినిమా గురించి మంచిగా వింటున్నాం అని మెసేజ్ వస్తే.. సినిమా పోయిందని అర్ధం. ఫోన్ కంటిన్యూగా మోగుతుంటే సినిమా హిట్ అని అర్ధం. నిన్నటి నుండి కంటిన్యూ కాల్స్ తో నా ఫోన్ ఫ్రీజ్ అయిపోయింది. కొత్త ఫోన్ కొనుక్కోవాలి. ఎమోషనల్ గా, కలెక్షన్స్ పరంగా ఇప్పటివరకూ నా సినిమాలన్నింటి కంటే ‘మేజర్’ 5 రెట్లు పెద్దది. నా గత చిత్రం ‘ఎవరు’ కంటే 5 రెట్లు ఎక్కువగా మేజర్ ఓపెనింగ్స్ ఉన్నాయని బాక్సాఫీసు లెక్కలు చెబుతున్నాయి.”

ఇలా తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నాడు శేష్. మేజర్ సినిమాను ప్రేక్షకులు కేవలం ఓ సినిమాగా చూడడం లేదని, దీన్నొక ఎమోషన్ గా చూస్తున్నారని అన్నాడు.

ఈ సక్సెస్ ను తను ఊహించానని, కాకపోతే తను ఊహించిన సక్సెస్ కంటే సినిమా పెద్ద హిట్టయిందని చెప్పుకొచ్చాడు శేష్. ఈ సందర్భంగా భారతీయ బలగాల్లో చేరాలనుకున్న యువత కోసం ఓ స్పెషల్ డ్రైవ్ నిర్వహించబోతున్నట్టు శేష్ ప్రకటించాడు. సిడిఎస్, ఎన్డీఏ లో జాయిన్ అవ్వాలనుకుని సరైన వనరులు లేక కష్టపడుతున్న వారికి సపోర్ట్ చేయాలని మేజర్ టీమ్ నిర్ణయించింది. అది ఎలా అనేది రాబోయే రోజుల్లో వివరిస్తారు. ముందుగా ఓ 10 మందితో మొదలుపెట్టే ఆలోచన చేస్తున్నారు.

First Published:  6 Jun 2022 12:31 AM GMT
Next Story