Telugu Global
MOVIE UPDATES

టెన్త్ క్లాస్ డైరీస్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ బ్యానర్లపై రూపొందిన చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ‘గరుడవేగ’ అంజి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. జూన్ 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘రోజ్ విల్లా’, ‘ముగ్గురు మొనగాళ్లు’ చిత్రాల తర్వాత అచ్యుత రామారావు నిర్మించిన చిత్రమిది. ఇందులో శ్రీనివాసరెడ్డి, ‘వెన్నెల’ రామారావు, అర్చన (వేద), […]

టెన్త్ క్లాస్ డైరీస్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
X

అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ బ్యానర్లపై రూపొందిన చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ‘గరుడవేగ’ అంజి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. జూన్ 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘రోజ్ విల్లా’, ‘ముగ్గురు మొనగాళ్లు’ చిత్రాల తర్వాత అచ్యుత రామారావు నిర్మించిన చిత్రమిది. ఇందులో శ్రీనివాసరెడ్డి, ‘వెన్నెల’ రామారావు, అర్చన (వేద), హిమజ, శివబాలాజీ, మధుమిత, ‘సత్యం’ రాజేష్, శివాజీ రాజా, సంజయ్ స్వరూప్, దీపా సాయిరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.

ఇప్పటికే విడుదలైన కొన్ని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అవికా గోర్ పరిచయ గీతం ‘ఎగిరే ఎగిరే…’తో పాటు ‘పియా పియా…’, పాటలకు, ప్రత్యేక గీతం ‘సిలకా సిలకా’కు మంచి స్పందన వచ్చింది. సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీతం అందించాడు.

డిగ్రీలు, పీజీలు, పీహెచ్‌డీలుచేసినా… వాళ్ళందరి జీవితాల్లో టెన్త్ క్లాస్ మెమరీ అనేది మైల్ స్టోన్ లాంటిది. ఆ మెమొరీస్ మిగతా జీవితం మీద డైరెక్ట్‌గా, ఇన్ డైరెక్ట్‌గా ప్ర‌భావం చూపిస్తాయి. ఆ మెమొరీస్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. కొంత మంది జీవితాల్లోజరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ‘టెన్త్ క్లాస్ డైరీస్‘ను రూపొందించారు. పదో తరగతి చదివిన ప్రతి ఒక్కరినీ ఆ రోజుల్లోకి ఈ సినిమా తీసుకు వెళుతుందని అంటున్నాడు నిర్మాత రామారావు..

First Published:  6 Jun 2022 11:15 AM GMT
Next Story