Telugu Global
NEWS

నాన్నకే ఈ ట్రోఫీ అంకితం.. ఫ్రెంచ్ ఓపెన్ లో పోలిష్ క్వీన్

విజయవంతమైన ప్రతి మహిళ వెనుక ఓ పురుషుడు ఉండటం ఎంత నిజమో.. విజేతగా నిలిచిన ప్రతికూతురు వెనుక ఓ తండ్రి ఉండి తీరుతాడన్నది అంతే నిజం. ప్రస్తుత సీజన్ రెండో గ్రాండ్ స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను 21 సంవత్సరాల చిరుప్రాయంలోనే నెగ్గడం ద్వారా రికార్డుల మోత మోగించిన పోలిష్ నయావండర్ ఇగా స్వైటెక్ తన తండ్రికే అంకితమిచ్చింది. పారిస్ లోని రోలాండ్ గారోస్ సెంటర్ కోర్టులో ముగిసిన ఫైనల్లో అమెరికన్ […]

iga-swiatek-of-poland-wins-french-open-2022-womens-singles-title
X

విజయవంతమైన ప్రతి మహిళ వెనుక ఓ పురుషుడు ఉండటం ఎంత నిజమో.. విజేతగా నిలిచిన ప్రతికూతురు వెనుక ఓ తండ్రి ఉండి తీరుతాడన్నది అంతే నిజం. ప్రస్తుత సీజన్ రెండో గ్రాండ్ స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను 21 సంవత్సరాల చిరుప్రాయంలోనే నెగ్గడం ద్వారా రికార్డుల మోత మోగించిన పోలిష్ నయావండర్ ఇగా స్వైటెక్ తన తండ్రికే అంకితమిచ్చింది.

పారిస్ లోని రోలాండ్ గారోస్ సెంటర్ కోర్టులో ముగిసిన ఫైనల్లో అమెరికన్ ప్లేయర్ కోకో గాఫ్ ను కేవలం గంట 8 నిముషాలపోరులోనే 6-1, 6-3తో చిత్తు చేయడం ద్వారా రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్ క్వీన్ గా నిలిచింది. ఈ ట్రోఫీ నాన్నకే అంకితమంటూ పొంగిపోయింది. ట్రోఫీతో పాటు 15 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ సైతం అందుకొంది. ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్ గా తాను ఎదగడం వెనుక తన తండ్రి ప్రేరణ,స్ఫూర్తి, కష్టం ఎంతో ఉందని ప్రకటించింది.

35 వరుస విజయాలతో జైత్రయాత్ర..

ప్రస్తుత ప్రపంచ మహిళా టెన్నిస్ లో అమెరికా, రష్యా భామల జోరు తగ్గి పోలిష్ థండర్ ఇగా స్వైటెక్ హోరు పెరిగింది. ఒకటి కాదు రెండుకాదు.. వరుసగా 35 విజయాలు సాధించడం ద్వారా అప్రతిహతంగా తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఫిబ్రవరిలో ఎలెనా ఓస్టాపెంకో తో జరిగిన దుబాయ్ ఓపెన్ పోరులో చివరిసారిగా పరాజయం పొందిన ఇగా..ఆ తర్వాత నుంచి ఓటమి అన్నదే లేకుండా వరుసగగా 35 విజయాలు నమోదు చేయడం ద్వారా అమెరికా దిగ్గజం వీనస్ విలియమ్స్ సరసన చోటు సంపాదించింది.

21వ శతాబ్దంలో వరుసగా 35 విజయాలతో పాటు ఐదు డబ్లుటిఏ టైటిల్స్, ఒలింపిక్స్ బంగారు పతకాలు సాధించడం ద్వారా అమెరికన్ బ్లాక్ థండర్ వీనస్ విలియమ్స్ ఓ అరుదైన రికార్డు నమోదు చేసింది. అదే రికార్డును ప్రస్తుత 2022 సీజన్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ విజయంతో ఇగా సమం చేయగలిగింది. గత ఏడాది ప్రపంచ 7వ ర్యాంకర్ గా ఉన్న ఇగా ఈ విజయపరంపరతో ఏకంగా ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ను కైవసం చేసుకోగలిగింది.


21 సంవత్సరాల వయసుకే..

ప్రస్తుత సీజన్లో ఇగా స్వైటెక్ సాధించిన టైటిల్ విజయాలలో దోహా, ఇండియన్ వెల్స్, మియామీ, రోమ్ ఉన్నాయి. అంతేకాదు..అత్యంత పిన్నవయసులోనే రెండుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన పోలిష్ ప్లేయర్ గా చరిత్ర సృష్టించింది. వింబుల్డన్ గ్రాస్ పైనా సత్తాచాటుకోడానికి ఇగా ఉరకలేస్తోంది. మహిళా టెన్నిస్ చరిత్రలో వరుసగా 74 విజయాలు సాధించిన ప్రపంచ రికార్డు మార్టీనా నవ్రతిలోవా పేరుతో ఉంది. 1984లో మార్టీనా ఓటమి అన్నదే లేకుండా 74 వరుస విజయాలతో తనకుతానే సాటిగా నిలిచింది.

ఇప్పుడు ఆ రికార్డును సమం చేయాలన్న పట్టుదల ఇగాలో కనిపిస్తోంది. ఓపెన్ శకంలో ముందుగా రెండు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన ఆరవ మహిళగా ఇగా రికార్డుల్లో చేరింది. గతంలో మార్గారెట్ కోర్ట్, స్టెఫీ గ్రాఫ్, మోనికా సెలెస్, జస్టిన్ హెనిన్, సెరెనా విలియమ్స్ మాత్రమే ఈ ఘనత సాధించగలిగారు. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను రెండుసార్లు నెగ్గిన నాలుగో అత్యంత పిన్నవయస్కురాలిగా ఇగా నిలిచింది. ప్రస్తుత సీజన్ మొదటి ఆరుమాసాలలో నెలకు ఓ టైటిల్ నెగ్గిన రెండో ప్లేయర్ గా రికార్డుల్లో చేరింది. గతంలో ఇదే రికార్డును 2013లో సెరెనా విలియమ్స్ సాధించింది. అంతేకాదు.. వరుసగా తొమ్మిది డబ్లుటిఏ టైటిల్స్ నెగ్గిన తొలి మహిళగా కూడా ఇగా స్వైటెక్ ప్రపంచ రికార్డు నమోదు చేసింది.

First Published:  4 Jun 2022 9:23 PM GMT
Next Story