Telugu Global
MOVIE UPDATES

9 రోజుల్లో రూ.100 కోట్లు

ఎఫ్3 సినిమా మరో అరుదైన ఫీట్ అందుకుంది. తాజాగా ఈ సినిమా వంద కోట్ల రూపాయల క్లబ్ లోకి చేరింది. విడుదలైన 9 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. “ఒక ఫ్యామిలీ సినిమా కోవిడ్ తర్వాత వంద కోట్లు టచ్ చేయడం మాకు ఎంతో ప్రత్యేకం. ఈ విజయం ప్రేక్షకుల వల్లే సాధ్యమైంది” అని పేర్కొంది ఎఫ్ 3 టీమ్. తాజా వసూళ్లతో తమ సినిమా ట్రిపుల్ […]

9 రోజుల్లో రూ.100 కోట్లు
X

ఎఫ్3 సినిమా మరో అరుదైన ఫీట్ అందుకుంది. తాజాగా ఈ సినిమా వంద కోట్ల రూపాయల క్లబ్ లోకి చేరింది. విడుదలైన 9 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. “ఒక ఫ్యామిలీ సినిమా కోవిడ్ తర్వాత వంద కోట్లు టచ్ చేయడం మాకు ఎంతో ప్రత్యేకం. ఈ విజయం ప్రేక్షకుల వల్లే సాధ్యమైంది” అని పేర్కొంది ఎఫ్ 3 టీమ్.

తాజా వసూళ్లతో తమ సినిమా ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అయిందని చెప్పుకొచ్చింది యూనిట్. ఇంతకుముందు వచ్చిన ఎఫ్2 సినిమా పెద్ద హిట్టయింది. నిర్మాత దిల్ రాజు కెరీర్ లోనే అత్యథిక లాభాలు తీసుకొచ్చిన సినిమాగా నిలిచింది. ఇప్పుడు ఎఫ్3 సినిమా ఏకంగా వంద కోట్ల రూపాయలు కొల్లగొట్టి మరో రికార్డ్ సృష్టించింది.

అయితే ఇప్పుడు ఎఫ్3కి థియేటర్ల నుంచి గట్టి పోటీ ఉంది. తాజాగా విడుదలైన మేజర్, విక్రమ్ సినిమాలు రెండూ హిట్టవ్వడంతో.. ఎఫ్ 3పై అది ప్రభావం చూపించనుంది. అయినప్పటికీ ఫ్యామిలీ సినిమా కావడంతో తమ మూవీకి ప్రేక్షకులు వస్తారని నమ్మకంగా చెబుతోంది ఎఫ్3 యూనిట్.

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత కాగా, అనీల్ రావుపూడి తెరకెక్కించాడు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించగా.. మెహ్రీన్-తమన్న హీరోయిన్లుగా నటించారు. గోల్డెన్ హ్యాండ్ పూజా హెగ్డే ఇందులో ఐటెంసాంగ్ చేసింది.

First Published:  5 Jun 2022 7:13 AM GMT
Next Story