Telugu Global
MOVIE UPDATES

విక్రమ్ మొదటి రోజు వసూళ్లు

ఊహించని విధంగా హిట్ టాక్ తెచ్చుకుంది విక్రమ్ సినిమా. కమల్ హాసన్ హీరోగా నటించిన సినిమాలన్నీ ఈమధ్య ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నాయి. కానీ విక్రమ్ మాత్రం ఇలా వచ్చి, అలా పాతుకుపోయింది. ఓవైపు మేజర్ సినిమా హిట్టయినప్పటికీ, మరోవైపు విక్రమ్ కూడా నిలబడడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. పైగా తక్కువ థియేటర్లలో విడుదలైన ఈ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా. అలా మొదటి రోజే సక్సెస్ టాక్ తెచ్చుకున్న విక్రమ్ సినిమాకు తొలి రోజు ఓ […]

vikram-day-1-collections
X

ఊహించని విధంగా హిట్ టాక్ తెచ్చుకుంది విక్రమ్ సినిమా. కమల్ హాసన్ హీరోగా నటించిన సినిమాలన్నీ ఈమధ్య ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నాయి. కానీ విక్రమ్ మాత్రం ఇలా వచ్చి, అలా పాతుకుపోయింది. ఓవైపు మేజర్ సినిమా హిట్టయినప్పటికీ, మరోవైపు విక్రమ్ కూడా నిలబడడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. పైగా తక్కువ థియేటర్లలో విడుదలైన ఈ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా.

అలా మొదటి రోజే సక్సెస్ టాక్ తెచ్చుకున్న విక్రమ్ సినిమాకు తొలి రోజు ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ వచ్చాయి. ఏపీ, నైజాం నుంచి ఈ సినిమాకు అటుఇటుగా 2 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. గ్రాస్ రూపంలో చెప్పాలంటే ఇది 3 కోట్ల 70 లక్షల రూపాయలు రాబట్టింది.

సినిమాకు హిట్ టాక్ రావడంతో, ఇవాళ్టి నుంచి విక్రమ్ అందుకునే అవకాశాలున్నాయి. ట్రేడ్ అంచనా ప్రకారం, ప్రీ-రిలీజ్ బిజినెస్ ను దాటి 8 రెట్లు లాభాన్ని అందించే ప్రాజెక్టుగా విక్రమ్ నిలబడుతుందని అంటున్నారు. అదే కనుక జరిగితే నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి జాక్ పాట్ కొట్టినట్టే. అతడే ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేశాడు.

ఏపీ,నైజాంలో విక్రమ్ కు వచ్చిన మొదటి రోజు వసూళ్లు చూద్దాం

నైజాం – 66 లక్షలు
సీడెడ్ – 27 లక్షలు
ఉత్తరాంధ్ర – 30 లక్షలు
ఈస్ట్ – 18 లక్షలు
వెస్ట్ – 13 లక్షలు
గుంటూరు – 15 లక్షలు
కృష్ణా – 14 లక్షలు
నెల్లూరు – 10 లక్షలు

First Published:  4 Jun 2022 5:37 AM GMT
Next Story