Telugu Global
MOVIE UPDATES

‘దడదడ’లాడించిన రామ్ రెండో పాట

సత్య ఐపీఎస్ పాత్రలో ఉస్తాద్ రామ్ పోతినేని, విజిల్ మహాలక్ష్మిగా కృతి శెట్టి… వీళ్ళిద్దరూ జంటగా నటించిన సినిమా ‘ది వారియర్’. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నాడు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. జూలై 14న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రెండో పాట ‘దడ దడ…’ను ప్రముఖ దర్శకులు గౌతమ్ మీనన్ ఈ […]

the-warrior-2nd-song
X

సత్య ఐపీఎస్ పాత్రలో ఉస్తాద్ రామ్ పోతినేని, విజిల్ మహాలక్ష్మిగా కృతి శెట్టి… వీళ్ళిద్దరూ జంటగా నటించిన సినిమా ‘ది వారియర్’. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నాడు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. జూలై 14న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రెండో పాట ‘దడ దడ…’ను ప్రముఖ దర్శకులు గౌతమ్ మీనన్ ఈ రోజు విడుదల చేశారు.

‘దడదడమని హృదయం శబ్దం… ” అంటూ సాగిన ఈ గీతానికి రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్ శ్రావ్యమైన మెలోడీ బాణీ సమకూర్చగా… శ్రీమణి సాహిత్యం అందించాడు. హరిచరణ్ ఆలపించారు.

విడుదలైన కొన్ని క్షణాల్లో సాంగ్ వైరల్ అయ్యింది. హైదరాబాద్‌లోని అందమైన లొకేషన్స్‌లో ఈ పాటను చిత్రీకరించారు. అందరూ హమ్ చేసే విధంగా రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్ ఈ మెలోడీ కంపోజ్ చేశాడు. ఆల్రెడీ విడుదలైన ‘బుల్లెట్…’ సాంగ్‌కు టెర్రిఫిక్ రెస్పాన్స్ లభిస్తోంది. ఈ రెండు పాటలు వేటికవే విభిన్నంగా ఉన్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున సినిమాను విడుదల చేయబోతున్నారు. ఆది పినిశెట్టి ఇందులో విలన్ గా కనిపిస్తాడు.

First Published:  4 Jun 2022 5:37 AM GMT
Next Story