Telugu Global
National

ఫ్రెంచ్ ఫైనల్లో స్పానిష్ బుల్ ఊరిస్తున్న 22వ గ్రాండ్ స్లామ్ టైటిల్

స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్ కు రికార్డుస్థాయిలో 14వసారి చేరుకొన్నాడు. తన కెరియర్ లో ఇప్పటికే 13సార్లు ఫ్రైంచ్ టైటిల్ నెగ్గిన నడాల్ 14వ ట్రోఫీకి గెలుపు దూరంలో నిలిచాడు. రోలాండ్ గారోస్ సెంటర్ కోర్టులో జరిగిన తొలి సెమీఫైనల్లో జర్మన్ ఆటగాడు, 3వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరేవ్ రెండోసెట్ ఆడుతూ గాయపడడంతో నడాల్ పూర్తిస్థాయిలో కష్టపడకుండానే ఫైనల్స్ కు చేరుకోగలిగాడు. పాపం! జ్వెరేవ్…. తన కెరియర్ లో తొలి ఫ్రెంచ్ ఓపెన్ […]

ఫ్రెంచ్ ఫైనల్లో స్పానిష్ బుల్ ఊరిస్తున్న 22వ గ్రాండ్ స్లామ్ టైటిల్
X

స్పానిష్ బుల్ రాఫెల్ నడాల్ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్ కు రికార్డుస్థాయిలో 14వసారి చేరుకొన్నాడు. తన కెరియర్ లో ఇప్పటికే 13సార్లు ఫ్రైంచ్ టైటిల్ నెగ్గిన నడాల్

14వ ట్రోఫీకి గెలుపు దూరంలో నిలిచాడు.

రోలాండ్ గారోస్ సెంటర్ కోర్టులో జరిగిన తొలి సెమీఫైనల్లో జర్మన్ ఆటగాడు, 3వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరేవ్ రెండోసెట్ ఆడుతూ గాయపడడంతో నడాల్ పూర్తిస్థాయిలో కష్టపడకుండానే ఫైనల్స్ కు చేరుకోగలిగాడు.

పాపం! జ్వెరేవ్….

తన కెరియర్ లో తొలి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గాలన్న కసితో బరిలోకి దిగిన జ్వెరేవ్ సుదీర్ఘంగా సాగిన తొలిసెట్ ను టైబ్రేక్ లో 6-7 ( 8-10)తో చేజార్చుకొన్నాడు. ఆ తర్వాత జరిగిన రెండోసెట్ లో ఇద్దరూ చెరో ఆరుగేమ్ లు నెగ్గి 6-6 తో సమఉజ్జీలుగా నిలిచిన సమయంలో జ్వెరేవ్ కాలు మెలికపడి కోర్టులోనే కుప్పకూలిపోయాడు.

అప్పటికే మూడుగంటలపాటు నడాల్ తో పోరాడి అలసిపోయిన జ్వెరేవ్ కాలినరం పట్టేడయంతో బాధతో విలవిలలాడిపోయాడు. ఆ తర్వాత నుంచి మ్యాచ్ ను కొనసాగించలేకపోడంతో నడాల్ ను విజేతగా ప్రకటించారు.
ప్రత్యర్థిగాయంతో మ్యాచ్ పూర్తి చేయలేకపోయిన తరుణంలో ఫైనల్స్ చేరడం బాధాకరమని, జ్వెరేవ్ గొప్పఆటగాడని, అతనికి గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గే సత్తా ఉందని,ఆటమధ్యలో గాయం కావడం దురదృష్టకరమని నడాల్ వాపోయాడు.

22వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కు నడాల్ గురి…

గత ఏడాదిగా కాలిమడమ గాయంతో బాధపడుతూ ఐదోర్యాంక్ కు పడిపోయిన నడాల్..ప్రస్తుత ఫ్రెంచ్ ఓపెన్లో ఐదోసీడ్ ఆటగాడిగా పోరుకు సిద్ధమయ్యాడు. క్వార్టర్ ఫైనల్ దశలోనే ప్రపంచ నంబర్ వన్ ,టాప్ సీడ్ జోకోవిచ్ తో తలపడాల్సి వచ్చినా నాలుగుసెట్ల పోరులో విజేతగా నిలవడం ద్వారా సెమీస్ లో అడుగుపెట్టాడు. ఇప్పటికే 13సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ అందుకొనడం ద్వారా మట్టికోర్టులో మహాబలుడుగా చరిత్ర సృష్టించిన నడాల్ ..21 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

36 సంవత్సరాల నడాల్ ఆదివారం జరిగే టైటిల్ సమరంలో కాస్పర్ రూడ్ తో తలపడనున్నాడు.

First Published:  3 Jun 2022 11:06 PM GMT
Next Story