Telugu Global
National

రేప్ కల్చర్ పెంచేలా ఉన్న ఆ యాడ్ తీసేయండి.. కేంద్ర ప్రభుత్వం ఆదేశం

ఏ వస్తువు అయినా వినియోగదారుడిని ఆకర్షించాలంటే మంచి ప్రచారం ఉండాలి. అందుకే చాలా కంపెనీలు యాడ్స్‌పై భారీగా ఖర్చు చేస్తుంటాయి. అయితే ఒక్కోసారి అత్యుత్సాహంతో తాము ఎలాంటి యాడ్ తీశామన్న సోయి ఉండదు. ముఖ్యంగా డియోడరెంట్స్, స్ప్రేల యాడ్స్‌లో మహిళలను కించపరిచేలా సీన్లు, మాటలు ఉంటాయి. ఫలానా స్ప్రే కొట్టుకుంటే అమ్మాయిలు వెంట పడుతుంటారని.. మా డియోడరెంట్ వాడితే అమ్మాయిలు నేరుగా డేటింగ్‌కి వచ్చేస్తారన్నట్లు ఉంటాయి. తాజాగా అలాంటి ఒక యాడ్‌పై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. […]

remove-that-ad-that-promotes-rape-culture-central-government-order
X

ఏ వస్తువు అయినా వినియోగదారుడిని ఆకర్షించాలంటే మంచి ప్రచారం ఉండాలి. అందుకే చాలా కంపెనీలు యాడ్స్‌పై భారీగా ఖర్చు చేస్తుంటాయి. అయితే ఒక్కోసారి అత్యుత్సాహంతో తాము ఎలాంటి యాడ్ తీశామన్న సోయి ఉండదు. ముఖ్యంగా డియోడరెంట్స్, స్ప్రేల యాడ్స్‌లో మహిళలను కించపరిచేలా సీన్లు, మాటలు ఉంటాయి. ఫలానా స్ప్రే కొట్టుకుంటే అమ్మాయిలు వెంట పడుతుంటారని.. మా డియోడరెంట్ వాడితే అమ్మాయిలు నేరుగా డేటింగ్‌కి వచ్చేస్తారన్నట్లు ఉంటాయి.

తాజాగా అలాంటి ఒక యాడ్‌పై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ప్రముఖ పెర్ఫ్యూమ్ కంపెనీ ‘లేయర్’ నుంచి వచ్చిన ‘షాట్’ అనే బాడీ స్ప్రే ప్రకటనలను తొలగించాలని ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మినిస్ట్రీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వీడియో ప్రకటన మహిళల గౌరవానికి భంగం కలిగించేదిగా, వారికి హాని తలపెట్టేలా ఉన్నదని పేర్కొన్నది. టీవీల నుంచే కాకుండా యూట్యూబ్ సహా సోషల్ మీడియా నుంచి యాడ్‌ను తొలగించాలని ఆదేశించింది.

‘షాట్’ బాడీ స్ప్రే ప్రకటనలో ఒక అమ్మాయి గ్రోసరీ స్టోర్‌లో షాపింగ్ చేస్తుంటుంది. ఆ వెనుకే నలుగురు అబ్బాయిలు మాట్లాడుకుంటుంటారు.. ‘మనం నలుగురం ఉన్నా.. అక్కడ ఒకటే ఉన్నది.. షాట్ ఎవరు తీసుకుంటారు’ అని అంటారు. భయంతో ఆ అమ్మాయి వెనక్కు చూస్తుంది. అయితే అక్కడ రాక్‌లో ఒకటే ఒక ‘షాట్’ బాడీ స్ప్రే ఉంటుంది. ఈ యాడ్‌లో తమ బ్రాండ్ పేరును డబుల్ మీనింగ్‌లో వాడారని.. పబ్లిక్‌గా ఒక ఒంటరి అమ్మాయిని టీజ్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేసేలా ఉన్న ఈ యాడ్‌ను వెంటనే తొలగించాలని సోషల్ మీడియాలో డిమాండ్లు పెరిగాయి.

ఐపీఎల్ సీజన్‌లో మ్యాచ్ మధ్యలో పదే పదే ఈ యాడ్ ప్రసారం చేయడం వల్ల ఇళ్లలో ఫ్యామిలీతో కూర్చొని చూస్తున్న వాళ్లు కూడా ఇబ్బంది పడ్డారని పలువురు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఇది ఆస్కీ (ASCI) కోడ్‌ను ఉల్లంఘించిందని, ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఉన్నదని అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలిపింది. వెంటనే ఈ యాడ్‌ను తొలగించాలని మినిస్ట్రీకి సిఫార్సు చేసింది.

ఇక ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ కూడా ఈ యాడ్‌పై స్పందించారు. ఈ బాడీ స్ప్రే యాడ్ దేశంలో రేప్ కల్చర్‌ను పెంచేలా ఉన్నది. ఇప్పటికే ఢిల్లీ పోలీసులకు కేసులు బుక్ చేయాలని నోటీసులు జారీ చేశామని స్వాతి చెప్పారు. జూన్ 9 కల్లా ఈ యాడ్‌పై సమగ్ర నివేదిక అందించాలని కూడా ఢిల్లీ పోలీసులకు మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

First Published:  4 Jun 2022 6:58 AM GMT
Next Story