Telugu Global
MOVIE UPDATES

మరో సినిమాకు టికెట్ రేట్లు తగ్గాయి

ఎఫ్3 సినిమాకు సాధారణ టికెట్ రేట్లు ఉంచారు. మేజర్ సినిమాకు ఇంకాస్త టికెట్ రేట్లు తగ్గించారు. ఇప్పుడు పక్కా కమర్షియల్ సినిమాకు మరింత భారీగా టికెట్ రేట్లు తగ్గించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు మేకర్స్. గోపీచంద్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో “పక్కా కమర్షియల్” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జూలై 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా ఈ మూవీ టీం ప్రెస్ మీట్ ను నిర్వహించింది. ఈ […]

మరో సినిమాకు టికెట్ రేట్లు తగ్గాయి
X

ఎఫ్3 సినిమాకు సాధారణ టికెట్ రేట్లు ఉంచారు. మేజర్ సినిమాకు ఇంకాస్త టికెట్ రేట్లు తగ్గించారు. ఇప్పుడు పక్కా కమర్షియల్ సినిమాకు మరింత భారీగా టికెట్ రేట్లు తగ్గించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు మేకర్స్.

గోపీచంద్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో “పక్కా కమర్షియల్” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జూలై 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా ఈ మూవీ టీం ప్రెస్ మీట్ ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో గోపిచంద్, హీరోయిన్ రాశీఖన్నా, దర్శకుడు మారుతి, అగ్ర నిర్మాత అల్లు అరవింద్, నిర్మాత బన్నీ వాసు తో పాటు చాలామంది ప్రముఖులు హాజరయ్యారు.

టికెట్ ధరల గురించి ప్రస్తావిస్తూ నిర్మాత బన్నీ వాసు రేట్స్ అందుబాటులో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో అరవింద్ గారు, తాను మొదటి వ్యక్తులమని.. నైజాంలో 160+జీఎస్టీ, ఆంధ్ర మల్టిఫ్లెక్స్ లో 150+జీఎస్టీ, సింగిల్ స్క్రీన్ లో 100+జీఎస్టీ అని చెప్పుకొచ్చారు. అందరు టికెట్ కోసం పెట్టిన డబ్బులకి హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్తారు అని చెప్పుకొచ్చారు.

“పక్కా కమర్షియల్” సినిమా ఓటిటిలో అంత త్వరగా రాదని.. తాజాగా హిట్టయిన ఎఫ్3 కి ఏ మాత్రం తగ్గకుండా తమ సినిమా కూడా ఉంటుందని అంటున్నారు మేకర్స్.

First Published:  4 Jun 2022 2:59 AM GMT
Next Story