Telugu Global
MOVIE UPDATES

మేజర్ మొదటి రోజు వసూళ్లు

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా, 26/11 దాడుల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా మేజర్. రిలీజ్ కు ముందే అంచనాలు పెంచిన ఈ సినిమా మొదటి రోజు మెరిసింది. అంచనాల్ని మించి వసూళ్లు సాధించింది. తక్కువ టికెట్ రేట్లతో ఈ సినిమాకు ఓపెనింగ్స్ తక్కువగా వస్తాయని అంతా భావించారు. కానీ మేజర్ సినిమాకు మొదటి రోజు ఏకంగా 4 కోట్ల రూపాయల షేర్ రావడం విశేషం. ఏపీ, నైజాంలో టికెట్ రేట్లు తగ్గించిన తర్వాత ఈ సినిమాకు […]

మేజర్ మొదటి రోజు వసూళ్లు
X

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా, 26/11 దాడుల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా మేజర్. రిలీజ్ కు ముందే అంచనాలు పెంచిన ఈ సినిమా మొదటి రోజు మెరిసింది. అంచనాల్ని మించి వసూళ్లు సాధించింది.

తక్కువ టికెట్ రేట్లతో ఈ సినిమాకు ఓపెనింగ్స్ తక్కువగా వస్తాయని అంతా భావించారు. కానీ మేజర్ సినిమాకు మొదటి రోజు ఏకంగా 4 కోట్ల రూపాయల షేర్ రావడం విశేషం. ఏపీ, నైజాంలో టికెట్ రేట్లు తగ్గించిన తర్వాత ఈ సినిమాకు రెండున్నర కోట్లు వస్తాయని అనుకున్నారు. కానీ 4 కోట్లు వచ్చాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను 10 కోట్ల రూపాయలకు అమ్మారు. మరో 3 రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు సినిమాకు మరోసారి భారీ ప్రచారం కల్పించాలని మేకర్స్ అనుకుంటున్నారు. సోమవారం నుంచి సరికొత్త ప్రచార ప్రణాళికతో ముందుకు రాబోతోంది మేజర్ టీమ్.

ఏపీ,నైజాంలో ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి.
నైజాం – రూ. 1.75 కోట్లు
సెడెడ్ – 46 లక్షలు
ఉత్తరాంధ్ర -51 లక్షలు
ఈస్ట్ – 34 లక్షలు
వెస్ట్ – 24 లక్షలు
గుంటూరు – 30 లక్షలు
కృష్ణా – 28 లక్షలు
నెల్లూరు – 19 లక్షలు

First Published:  4 Jun 2022 3:15 AM GMT
Next Story