Telugu Global
NEWS

జూబ్లీహిల్స్ రేప్ కేస్.. బాధితురాలికి న్యాయం కంటే.. ఆ పార్టీలకు మైలేజే ముఖ్యమా?

జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని అమ్మీషియా పబ్‌లో మే 28న ఒక మైనర్‌పై సామూహిక లైంగిక దాడి జరిగిన విషయం తెలిసిందే. సదరు బాలిక ఘటన జరిగిన రోజు తల్లిదండ్రులకు తనతో అసభ్యంగా ప్రవర్తించారనే చెప్పింది. ఆ తర్వాత కొన్ని రోజులకు గాని తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని చెప్పలేదు. అంతే కాకుండా పోలీసులు కేసు నమోదు చేసుకున్న తర్వాత షాక్‌లో ఉన్న ఆ బాలిక నుంచి విషయాలు రాబట్టలేక పోయారు. బాలికను పార్టీకి తీసుకొని వెళ్లిన […]

జూబ్లీహిల్స్ రేప్ కేస్.. బాధితురాలికి న్యాయం కంటే.. ఆ పార్టీలకు మైలేజే ముఖ్యమా?
X

జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని అమ్మీషియా పబ్‌లో మే 28న ఒక మైనర్‌పై సామూహిక లైంగిక దాడి జరిగిన విషయం తెలిసిందే. సదరు బాలిక ఘటన జరిగిన రోజు తల్లిదండ్రులకు తనతో అసభ్యంగా ప్రవర్తించారనే చెప్పింది. ఆ తర్వాత కొన్ని రోజులకు గాని తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని చెప్పలేదు. అంతే కాకుండా పోలీసులు కేసు నమోదు చేసుకున్న తర్వాత షాక్‌లో ఉన్న ఆ బాలిక నుంచి విషయాలు రాబట్టలేక పోయారు. బాలికను పార్టీకి తీసుకొని వెళ్లిన పొరుగింటి కుర్రాడిని కూడా పోలీసులు విచారించారు. కానీ బాలిక తనతో తిరిగి రాలేదని మాత్రమే చెప్పాడు.

ఈ క్రమంలో మహిళా పోలీసులు చాలా సున్నితంగా బాధితురాలితో వ్యవహరించడంతో ఒకరి పేరు మాత్రం చెప్పింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సదరు నిందితుడిని అదుపులోనికి తీసుకున్నారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి కేటీఆర్ స్పందించారు. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టవద్దని స్వయంగా హోం మంత్రి మహమూద్ అలీకి చెప్పారు. పోలీసులు ఒకవైపు తమ పని తాము చేస్తుండగానే.. ఈ ఘటనను రాజకీయంగా ఉపయోగించుకోవడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడ్డాయి.

సంఘటన మే 28న జరిగితే.. జూన్ 3 వరకు ఏం చేస్తున్నారంటూ బీజేపీ ఫైర్ అయ్యింది. నిందితులను రక్షించడానికే కేసు నమోదు చేయడంతో తాత్సరం చేసిందంటూ బీజేపీ ఆరోపించింది. అంతే కాకుండా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు శుక్రవారం రాత్రి ఆందోళనకు దిగింది. ఆ పార్టీ చీఫ్ బండి సంజయ్ అయితే ఏకంగా సీబీఐతో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ క్రిమినల్స్‌కు అడ్డాగా మారిందని అభివర్ణించారు. మొదటి నుంచి బీజేపీ పార్టీ వ్యతిరేకించే ఒక మత వర్గానికి చెందిన యువకులే నిందితులుగా ఉండటంతో బీజేపీ ఈ ఘటనలో మరింత ఆజ్యం పోసేలా వ్యాఖ్యలు చేస్తున్నది.

మరోవైపు బీజేపీ పార్టీకే మైలేజీ అంతా పోతున్నదని భావించిన కాంగ్రెస్ కూడా తామెక్కడ వెనకబడతామో అని ఆందోళనలు మొదలు పెట్టింది. అర్థరాత్రి మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేసింది. సీనియర్ నేతలు రేణుక చౌదరి సహా పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

ఈ ఆందోళనలను గమనిస్తే బాలిక లైంగిక దాడి ఘటనలో బాధితురాలికి న్యాయం జరగాలనే తపన కంటే.. తమ పార్టీకి మైలేజీ పెంచుకునే ఉద్దేశమే ఎక్కువగా ఉన్నదని పలువరు ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకుల కుమారులు ఉన్నారనే ఉద్దేశంతోనే ప్రతిపక్ష పార్టీలు తమ ఆందోళనలను తీవ్రతరం చేస్తున్నాయనే విమర్శలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ఒక వర్గం నేతలను ముప్పతిప్పలు పెట్టేందుకు బీజేపీ దీన్ని ఒక అస్త్రంగా వాడుకుంటున్నట్లు కనిపిస్తున్నది.

ప్రతిపక్షాల ఆందోళనల కంటే ముందే మంత్రి కేటీఆర్ ఈ ఘటనపై సీరియస్‌గా ఉన్నారు. నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. హోం మంత్రి మహమూద్ అలీ మనుమడు ఉన్నట్లు వార్తలు వచ్చినా.. వాటిని గచ్చిబౌలి సీపీ జోయల్ డేవిస్ మాత్రం కొట్టి పారేశారు.

Next Story