Telugu Global
MOVIE UPDATES

దొంగచాటుగా సినిమా చూసిన బన్నీ

సాధారణ ప్రేక్షకులు దర్జాగా సినిమా హాల్ లోకి వెళ్లి సినిమా చూస్తారు. మరి సెలబ్రిటీలు, స్టార్లు సినిమా చూడాలంటే ఎలా చూస్తారు. ఇంకేముంది, దొంగచాటుగా వెళ్లి చూడాల్సిందే. సినిమా స్టార్ట్ అయిన తర్వాత, లైట్లు ఆర్పేసిన తర్వాత వెళ్లి కూర్చుంటారు. అందరి కంటే ముందే థియేటర్ నుంచి బయటకొచ్చేస్తారు. వాళ్లకు అది తప్పదు. తాజాగా బన్నీ కూడా అలానే సినిమా చూశాడు. రీసెంట్ గా విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చిన అల్లు అర్జున్, ఎఫ్3 సినిమాను […]

దొంగచాటుగా సినిమా చూసిన బన్నీ
X

సాధారణ ప్రేక్షకులు దర్జాగా సినిమా హాల్ లోకి వెళ్లి సినిమా చూస్తారు. మరి సెలబ్రిటీలు, స్టార్లు సినిమా చూడాలంటే ఎలా చూస్తారు. ఇంకేముంది, దొంగచాటుగా వెళ్లి చూడాల్సిందే. సినిమా స్టార్ట్ అయిన తర్వాత, లైట్లు ఆర్పేసిన తర్వాత వెళ్లి కూర్చుంటారు. అందరి కంటే ముందే థియేటర్ నుంచి బయటకొచ్చేస్తారు. వాళ్లకు అది తప్పదు. తాజాగా బన్నీ కూడా అలానే సినిమా చూశాడు.

రీసెంట్ గా విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చిన అల్లు అర్జున్, ఎఫ్3 సినిమాను థియేటర్లలో చూశాడంట. హైదరాబాద్ లోని కూకట్ పల్లి ప్రాంతంలో ఉన్న ఓ థియేటర్ లో ఎవ్వరికీ కనిపించకుండా మాస్క్ వేసుకొని, ముసుగు ధరించి సినిమా చూసి వచ్చాడంట.

ఈ విషయాన్ని స్వయంగా అల్లు అరవింద్ బయటపెట్టారు. క్యూబ్ కోడ్ తెప్పించుకొని ఇంట్లో సినిమా చూడ్డానికి బన్నీ ప్రయత్నించగా.. అల్లు అరవింద్ వారించారట. థియేటర్లలోనే చూడాలని చెప్పారట. అందుకే దొంగచాటుగా థియేటర్ కు వెళ్లి ఎఫ్3 చూసొచ్చాడు బన్నీ.

First Published:  4 Jun 2022 5:34 AM GMT
Next Story