Telugu Global
NEWS

దివ్యవాణి ఎపిసోడ్ పై వైసీపీ నేతల పంచ్ లు..

టీడీపీలో దివ్యవాణి ఎపిసోడ్ దుమారాన్ని రేపింది. ఆమె రాజీనామా చేసిందా, చేయలేదా, వెనక్కి తీసుకుందా, మళ్లీ చేసిందా అనే గందరగోళాన్ని పక్కనపెడితే.. టీడీపీలో జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపింది. చంద్రబాబు దగ్గరకు వెళ్లాలంటే ఎన్ని గేట్లు అడ్డుగా ఉంటాయో వివరించి చెప్పింది, తనలాంటి సినిమా నటులు టీడీపీలో ఎందుకు ఇమడలేకపోతున్నారో ఉదాహరణలతో సహా వివరించింది. పార్టీ పరిస్థితి అధిష్టానానికి తెలియడంలేదని, వారు భ్రమల్లో ఉన్నారని, ఇంకా భ్రమల్లోనే బతుకుతున్నారని చురకలంటించింది. ఈ క్రమంలో వైసీపీ నేతలు కూడా […]

దివ్యవాణి ఎపిసోడ్ పై వైసీపీ నేతల పంచ్ లు..
X

టీడీపీలో దివ్యవాణి ఎపిసోడ్ దుమారాన్ని రేపింది. ఆమె రాజీనామా చేసిందా, చేయలేదా, వెనక్కి తీసుకుందా, మళ్లీ చేసిందా అనే గందరగోళాన్ని పక్కనపెడితే.. టీడీపీలో జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపింది. చంద్రబాబు దగ్గరకు వెళ్లాలంటే ఎన్ని గేట్లు అడ్డుగా ఉంటాయో వివరించి చెప్పింది, తనలాంటి సినిమా నటులు టీడీపీలో ఎందుకు ఇమడలేకపోతున్నారో ఉదాహరణలతో సహా వివరించింది. పార్టీ పరిస్థితి అధిష్టానానికి తెలియడంలేదని, వారు భ్రమల్లో ఉన్నారని, ఇంకా భ్రమల్లోనే బతుకుతున్నారని చురకలంటించింది. ఈ క్రమంలో వైసీపీ నేతలు కూడా దివ్యవాణి ఎపిసోడ్ తో చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.

తొడకొట్టేవారికే రోజులు..
“తొడకొట్టే వాణులకు తప్ప.. దివ్య వాణులకు తావులేదక్కడ!” అంటూ మంత్రి అంబటి రాంబాబు సెటైర్ పేల్చారు. ఇటీవల మహానాడులో మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె స్టేజ్ పై తొడకొట్టిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అలా తొడకొట్టేవారికే టీడీపీలో చోటు ఉంటుందని మంచి చెప్పాలనుకునేవారికి స్థానం లేదని అన్నారు.

టీడీపీలో మహిళలకు గౌరవం లేదు..
టీడీపీలో మహిళలకే కాదు, ఎవరికీ గౌరవం లేదని అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. వెన్నుపోటు కుట్రలో కత్తి అందించిన వారు, నెత్తుటి మరకలు తుడిచిన వారంతా ‘బారాహ్ ఖూన్ మాఫ్’ అన్నట్టు పునీతులయ్యారని చెప్పారు. బాబు నీడలో దోచుకుని బాగుపడింది వాళ్లేనని విమర్శించారు. ప్యాకేజి కోసం పనిచేసే పాలేర్లు తప్ప పచ్చ పార్టీలో బడుగువర్గాల వారు ఇంకా అంటరానివారుగానే ఉన్నారని అన్నారు విజయసాయిరెడ్డి.

జయప్రదంగా..
“చంద్రబాబు, లోకేశ్ లకు మహిళలంటే ఎంత చిన్నచూపో అనేక సందర్బాల్లో బయటపడింది. స్త్రీలంటే బానిసలు, నాయకత్వానికి పనికిరారు అనే భావన వీళ్లది. ఆరోజుల్లోనే జయప్రదంగా నలుపును తెలుపు చేసుకున్నారు. ఆ ప్రయోగాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వలంటీర్లు తలుపులు కొడుతున్నారని నిందించింది అందుకే.” అంటూ దివ్యవాణి ఎపిసోడ్ పై పరోక్షంగా ట్వీట్ చేశారు ఎంపీ విజయసాయి.

ALSO READ: త్వరలో మాతృభాషలో సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్.. ఎన్ఈపీ విధానంలో ప్రయోగం

First Published:  2 Jun 2022 9:18 PM GMT
Next Story