Telugu Global
National

రైల్వేలో డిటొనేటర్ల వాడకానికి త్వరలో స్వస్తి..

డిటొనేటర్లు అంటే పేలుడు పదార్థాలు. వాటిని వాడాలంటే కచ్చితంగా అనుమతి ఉండాలి. గనుల తవ్వకాలకు, ఇతరత్రా పేలుడులకు వీటిని వాడతారు. అయితే భారతీయ రైల్వేలో ఎప్పటినుంచో డిటొనేటర్లు వాడుతున్నారు. రైల్వే డ్రైవర్లు(లోకో పైలట్లు) డ్యూటీకి వెళ్తూ తీసుకెళ్లే టూల్ కిట్ లో డిటొనేటర్లు కూడా కచ్చితంగా ఉంటాయి. ఎందుకీ డిటొనేటర్లు..? ఎక్కడైనా ప్రమాదం జరిగి రైలు పట్టాలు తప్పినప్పుడు, లేదా వరదలతో ట్రాక్ కొట్టుకుపోయినప్పుడు డ్రైవర్లు, గార్డులు ఈ డిటొనేటర్లు వినియోగిస్తారు. రైలుకి ముందుద వెనక దాదాపుగా […]

Indian Railways
X

డిటొనేటర్లు అంటే పేలుడు పదార్థాలు. వాటిని వాడాలంటే కచ్చితంగా అనుమతి ఉండాలి. గనుల తవ్వకాలకు, ఇతరత్రా పేలుడులకు వీటిని వాడతారు. అయితే భారతీయ రైల్వేలో ఎప్పటినుంచో డిటొనేటర్లు వాడుతున్నారు. రైల్వే డ్రైవర్లు(లోకో పైలట్లు) డ్యూటీకి వెళ్తూ తీసుకెళ్లే టూల్ కిట్ లో డిటొనేటర్లు కూడా కచ్చితంగా ఉంటాయి.

ఎందుకీ డిటొనేటర్లు..?

ఎక్కడైనా ప్రమాదం జరిగి రైలు పట్టాలు తప్పినప్పుడు, లేదా వరదలతో ట్రాక్ కొట్టుకుపోయినప్పుడు డ్రైవర్లు, గార్డులు ఈ డిటొనేటర్లు వినియోగిస్తారు. రైలుకి ముందుద వెనక దాదాపుగా అర కిలోమీటర్ దూరం వెళ్లి డిటొనేటర్లను ట్రాక్ పై అమరుస్తారు.

పొరపాటున ఏదైనా ట్రైన్ ఆ రూట్ లో వచ్చినప్పుడు ఆ తీవ్రతకు డిటొనేటర్లు పేలుతాయి. అయితే ఆ పేలుడు వల్ల రైలుకి ప్రమాదం వాటిల్లదు. కేవలం పెద్దగా శబ్దం మాత్రమే వస్తుంది. పొగ కూడా అలముకుంటుంది. అందే దగ్గర్లో ఏదో ప్రమాదం ఉంది అని తెలుకున్న లోకో పైలట్ దాన్ని వెంటనే ఆపేస్తాడు. ఇలా ప్రమాదాలు నివారించేందుకు అత్యవసర వినియోగానికి డిటోనేటర్లను ప్రతి రోజూ డ్యూటీలో తమ వెంట తీసుకెళ్తుంటారు లోకోపైలట్లు.

ఆధునిక కాలంలో ఈ పద్ధతి ఎందుకు..?

కాలం మారింది, ఎక్కడికక్కడ వాకీ టాకీలతో సమర్థంగా ఒకచోటనుంచి మరొకచోటకి కమ్యూనికేషన్ వెళ్తుంది. దీంతో డిటొనేటర్ల వాడకం పెద్దగా ఉండట్లేదు. అయితే ఎలాంటి సమాచార మార్పిడి లేని సమయాల్లో వాటివల్ల ఉపయోగం ఉంటుంది.

కానీ ఇటీవల కాలంలో అంత అత్యవసర పరిస్థితి ఎక్కడా రాలేదు. యాంటీ కొలిషన్ డివైజ్ లు, ట్రైన్ ప్రొటెక్షన్ వార్నింగ్ సిస్టమ్స్, షార్ట్ సర్క్యూట్ క్లిప్స్, ఆగ్జిలరీ వార్నింగ్ సిస్టమ్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయినా కూడా ప్రొటోకాల్ ప్రకారం బరువైన డిటొనేటర్లను మోసుకెళ్లాల్సిన బాధ్యత లోకో పైలట్లపై ఉంది. దీనికి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు రైల్వే అధికారులకు తమ అభ్యంతరాలు తెలుపుతున్నారు.

డ్యూటీ దిగే సమయంలో పొరపాటున డిటొనేటర్లతో బయటకు వెళ్లినా తమకు ఇబ్బందికలుగుతుందని చెబుతున్నారు. చాన్నాళ్లుగా ఉన్న ఈ అభ్యర్థనను ఎట్టకేలకు రైల్వే ఉన్నతాధికారులు పరిగణలోకి తీసుకున్నారు. త్వరలో రైల్వే లోకోపైలట్లకు డిటొనేటర్ల మోతబరువు, ఇతర ఇబ్బందుల నుంచి విముక్తి కలగబోతోంది.

First Published:  3 Jun 2022 1:24 AM GMT
Next Story