Telugu Global
NEWS

చంద్రబాబుపై కేసీఆర్‌ కుట్రలో నిజమెంత?

తెలంగాణ బీజేపీ నేత ఎ. చంద్రశేఖర్ సీఎం కేసీఆర్‌పై కొన్ని ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన.. చంద్రబాబును సీఎం పదవి నుంచి దించేందుకు కేసీఆర్‌ 2001కి ముందు కుట్ర చేశారని ఆరోపించారు. 1999 ఎన్నికల తర్వాత కేసీఆర్‌కు మంత్రి పదవి రాలేదని.. దాంతో ఎమ్మెల్యేల్లో చీలిక తెచ్చేందుకు ప్రయత్నించారని చెప్పారు. చిత్తూరు జిల్లాకు చెందిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మరికొందరితో కలిసి, ఎమ్మెల్యేలను చీల్చి చంద్రబాబు స్థానంలో కేసీఆర్‌ సీఎం కావాలనుకున్నారని వెల్లడించారు. […]

చంద్రబాబుపై కేసీఆర్‌ కుట్రలో నిజమెంత?
X

తెలంగాణ బీజేపీ నేత ఎ. చంద్రశేఖర్ సీఎం కేసీఆర్‌పై కొన్ని ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన.. చంద్రబాబును సీఎం పదవి నుంచి దించేందుకు కేసీఆర్‌ 2001కి ముందు కుట్ర చేశారని ఆరోపించారు.

1999 ఎన్నికల తర్వాత కేసీఆర్‌కు మంత్రి పదవి రాలేదని.. దాంతో ఎమ్మెల్యేల్లో చీలిక తెచ్చేందుకు ప్రయత్నించారని చెప్పారు. చిత్తూరు జిల్లాకు చెందిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మరికొందరితో కలిసి, ఎమ్మెల్యేలను చీల్చి చంద్రబాబు స్థానంలో కేసీఆర్‌ సీఎం కావాలనుకున్నారని వెల్లడించారు. బొజ్జలతో కలిసి 60 మంది ఎమ్మెల్యేలను ఒక్కటి చేశారని చంద్రశేఖర్ వివరించారు.

చంద్రబాబును దింపేందుకు 60 మంది ఎమ్మెల్యేలు చాలు.. ఇక 20 హెలికాప్టర్లు తెచ్చుకుని నేరుగా గవర్నర్‌ వద్దకు వెళ్ధామని కేసీఆర్‌ చెప్పారని.. అంతలోనే 61వ ఎమ్మెల్యేగా వచ్చిన జ్యోతులు నెహ్రు తిరిగి చంద్రబాబు వద్దకు వెళ్లి విషయం చెప్పడంతో వ్యవహారం బెడిసికొట్టిందని చంద్రశేఖర్ వివరించారు. కేసీఆర్ అధికార దాహానికి ఇదో ఉదాహరణ అన్నారు.

అయితే చంద్రశేఖర్ చెప్పిన మాటలను పరిశీలిస్తే.. ఇది ఎంత వరకు నిజం అన్న అనుమానం కలుగుతుంది. కేసీఆర్‌ పక్షాన ఎమ్మెల్యేలను కూడగట్టే పనిలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి భాగస్వామి అయి ఉంటే.. ఆయన చనిపోయే వరకు చంద్రబాబు అంత ప్రాధాన్యత ఇచ్చేవారా అన్న ప్రశ్న వస్తుంది. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చనిపోవడానికి కొద్దిరోజుల ముందు కూడా ఆయన నివాసానికి చంద్రబాబు వెళ్లి కలిసి వచ్చారు. ఇప్పటి వరకు మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్లనే కేసీఆర్‌ ప్రత్యేక పార్టీ పెట్టుకున్నారని టీడీపీతో సహా, మిగిలిన పార్టీలు విమర్శిస్తూ వచ్చాయి.

ఒకవేళ కేసీఆర్‌ 60 మంది ఎమ్మెల్యేలను చీల్చి ప్రయత్నం చేసి ఉంటే… కేసీఆర్‌పై అటాక్ చేయడానికి ఈ విషయాన్ని కూడా ఇప్పటికి అనేక మార్లు టీడీపీ నేతలు చెప్పి ఉండేవారు. కేసీఆర్‌ నమ్మకద్రోహి అంటూ ఈ వ్యవహారం ఆధారంగా దాడి చేసి ఉండేవారు.

ఒకవేళ చంద్రశేఖర్ చెప్పిందే నిజమైతే… చంద్రబాబుకు వ్యతిరేకంగా అప్పట్లోనే 60 మంది ఎమ్మెల్యేలు ఏకమయ్యారంటే .. చంద్రబాబు నాయకత్వంపై వారిలో ఎంత వ్యతిరేకత ఉండేదో అర్థం చేసుకోవచ్చు. 60 మంది ఎమ్మెల్యేలను ఏకం చేసి ఉంటే కేసీఆర్‌ శక్తిసామర్థ్యాలు అసాధారణమైనవే అని భావించాల్సి వస్తుంది.

ALSO READ: అమ్మఒడి రద్దు చేసినట్లు తప్పుడు పోస్టులు.. అచ్చెన్నాయుడి ముఖ్య అనుచరుడి అరెస్ట్

First Published:  2 Jun 2022 9:55 PM GMT
Next Story