Telugu Global
National

త్వరలో మాతృభాషలో సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్.. ఎన్ఈపీ విధానంలో ప్రయోగం

దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు నవోదయ విద్య, కేంద్రీయ విద్యాలయ పేరుతోనే కేంద్ర ప్రభుత్వం నేరుగా పాఠశాలలు నడిపిస్తోంది. వీటిలో సీట్లు దొరకాలంటే కాస్త కష్టపడాల్సిందే. అంతే కాకుండా విద్యా బోధన అంతా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. కానీ ఇకపై మాతృభాషలో ప్రీప్రైమరీ నుంచి హైస్కూల్ వరకు విద్యను భోధించే సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ రానున్నాయి. ‘పీఎం శ్రీ స్కూల్స్’ పేరుతో దేశవ్యాప్తంగా వీటిని ప్రారంభించనున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. నేషనల్ ఎడ్యుకేషన్ […]

త్వరలో మాతృభాషలో సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్.. ఎన్ఈపీ విధానంలో ప్రయోగం
X

దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు నవోదయ విద్య, కేంద్రీయ విద్యాలయ పేరుతోనే కేంద్ర ప్రభుత్వం నేరుగా పాఠశాలలు నడిపిస్తోంది. వీటిలో సీట్లు దొరకాలంటే కాస్త కష్టపడాల్సిందే. అంతే కాకుండా విద్యా బోధన అంతా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. కానీ ఇకపై మాతృభాషలో ప్రీప్రైమరీ నుంచి హైస్కూల్ వరకు విద్యను భోధించే సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ రానున్నాయి. ‘పీఎం శ్రీ స్కూల్స్’ పేరుతో దేశవ్యాప్తంగా వీటిని ప్రారంభించనున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.

నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ)ని ఈ ఏడాది నుంచి కేంద్రం తమ పాఠశాలల్లో అమలు చేస్తోంది. అయితే పూర్తి స్థాయిలో ఈ పాలసీని అమలు చేసే విధంగా పీఎం శ్రీ స్కూల్స్‌లో ప్రయోగం చేయనున్నారు. అంతే కాకుండా ఎవరి మాతృభాషలో వాళ్లు చదువుకునేలా ఈ పాఠశాలలు ఉండబోతున్నాయి. రాబోయే తరాలకు ఆధునిక విద్యను తమ మాతృభాషలోనే అందించాలని భావిస్తున్నట్లు గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఏర్పాటు చేసిన విద్యా శాఖ మంత్రుల జాతీయ సదస్సులో ఆయన పేర్కొన్నారు.

దేశంలోని అన్ని భాషలు జాతీయ భాషలే.. హిందీ, ఇంగ్లీషు కన్నా మిగిలిన భాషలు తక్కువ ఏమీ కాదని ఆయన చెప్పారు. అందుకే ప్రతీ భాషకు ప్రాధాన్యం ఇచ్చేలా నూతన విద్యా విధానంలో మార్పులు చేశామన్నారు. స్థానిక భాషలకు కూడా ఇందులో చోటు దక్కిందని.. పీఎం శ్రీ స్కూల్స్‌లో అందుకే మాతృభాష బోధనను ప్రారంభిస్తున్నామని మంత్రి తెలిపారు.

First Published:  2 Jun 2022 10:42 PM GMT
Next Story