Telugu Global
National

బండి సంజయ్ కి షాకిచ్చిన ఆరెస్సెస్ ఛీఫ్ మోహన్ భగవత్

‘మసీదులన్నీ తవ్వేద్దాం శవమొస్తే మీకు శివమొస్తే మాకు’ అని వివాదాస్పద వ్యాఖలు చేసిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి తిరుగులేని సమాధానం దొరికింది. అది కూడా వాళ్ళకు అత్యంత గౌరవప్రదుడైన ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడి నుండే. నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) అధ్యక్షుడు మోహన్ భగవత్ మాట్లాడుతూ ప్రతి మసీదులో శివలింగాన్ని చూడటమేంటి ? అది ఎంత వరకు సమంజసం అని వ్యాఖ్యానించారు. జ్ఞానవాపి మసీదు వివాదంపై పరస్పర […]

బండి సంజయ్ కి షాకిచ్చిన ఆరెస్సెస్ ఛీఫ్ మోహన్ భగవత్
X

‘మసీదులన్నీ తవ్వేద్దాం శవమొస్తే మీకు శివమొస్తే మాకు’ అని వివాదాస్పద వ్యాఖలు చేసిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి తిరుగులేని సమాధానం దొరికింది. అది కూడా వాళ్ళకు అత్యంత గౌరవప్రదుడైన ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడి నుండే.

నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) అధ్యక్షుడు మోహన్ భగవత్ మాట్లాడుతూ ప్రతి మసీదులో శివలింగాన్ని చూడటమేంటి ? అది ఎంత వరకు సమంజసం అని వ్యాఖ్యానించారు.

జ్ఞానవాపి మసీదు వివాదంపై పరస్పర అంగీకారంతో వివాదాన్ని పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. కొన్ని ప్రాంతాలపై మనకు ప్రత్యేక భక్తి ఉంటుంది. మన‌ము వాటి గురించి మాట్లాడుతాము. అయితే రోజుకో కొత్త వివాదాన్ని ఎందుకు తెరపైకి తెస్తున్నారు? ప్రతీ దాన్నీ ఎందుకు వివాదం చేస్తున్నారు ? మన‌ము వివాదాలను ఎందుకు పెంచాలి? మనకు జ్ఞానవాపిపై భక్తి ఉంది.. దాని ప్రకారమే ఏదైనా చేస్తున్నాం.. అది సరే.. అయినా ప్రతి మసీదులోనూ శివలింగాన్ని ఎందుకు చూస్తాం? ” అని భగవత్ ప్రశ్నించారు.

“జ్ఞానవాపి వ్యవహారం నడుస్తోంది. మనం చరిత్రను మార్చలేము. ఇది నేటి హిందువులు లేదా నేటి ముస్లింలు సృష్టించలేదు. అది అప్పుడెప్పుడో జరిగింది. బైటి నుంచి మన దేశం మీద దాడి చేసినవాళ్ళ పని అది. హిందువులకు ప్రత్యేక భక్తి ఉన్న ప్రదేశాలలో సమస్యలు తలెత్తుతాయి. హిందువులు ముస్లింలకు వ్యతిరేకంగా ఆలోచించరు. నేటి ముస్లిం పూర్వీకులు కూడా హిందువులే.” అని అన్నారాయన‌

“మనసులో సమస్యలుంటే అవి పెరుగుతాయి. ఇది ఎవరికీ వ్యతిరేకం కాదు. పరస్పర ఒప్పందం ద్వారా పరిష్కారాన్ని కనుగొనండి. పరిష్కారం రాకపోతే, ప్రజలు కోర్టుకు వెళతారు. అదే జరిగితే కోర్టు ఏం తీర్పు ఇచ్చినా అంగీకరించక తప్పదు. మన న్యాయవ్యవస్థ పవిత్రమైంది. మనం దాని నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి. దాని నిర్ణయాలను మనం ప్రశ్నించకూడదు” అని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ వ్యాఖ్యానించారు.

ఆర్‌ఎస్‌ఎస్ ఏ విధమైన పూజలకు వ్యతిరేకం కాదని, వాటన్నింటినీ పవిత్రంగా భావిస్తామని భగవత్ స్పష్టం చేశారు. “ఏ విధమైన పూజల పట్ల మాకు అభ్యంతరం లేదు. వాటన్నింటినీ అంగీకరిస్తాం. వాటన్నింటినీ పవిత్రంగా భావిస్తాం. వారు తమకు ఇష్టమైన పూజను అంగీకరించి ఉండవచ్చు. కానీ వారు మన రుషులు, పూర్వీకులు, క్షత్రియుల వారసులు. మనమందరం ఒకే పూర్వీకుల వారసులం. ”

ఈ మాటల్ని భగవత్, బండి సంజయ్ ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని అనకపోవచ్చు కానీ సంజయ్ లాంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని అన్న మాటలుగానే ఉన్నాయి.

ALSO READ: అమిత్ షాను క్రీడాశాఖ మంత్రిని చేయండి

First Published:  3 Jun 2022 2:45 AM GMT
Next Story