Telugu Global
National

వానల కోసం పౌల్ట్రీ రంగం ఎదురుచూపులు..

సహజంగా వేసవి కాలంలో చికెన్ రేట్లు పెరుగుతాయి, ఆ తర్వాత మెల్లగా తగ్గుతాయి. ఈ దఫా ఉత్పత్తి భారీగా పడిపోయింది. రేట్లు పెరిగాయి, డిమాండ్ విపరీతంగా పెరిగింది. రుతుపవనాలు వస్తేనే చికెన్ రేట్లు దిగొస్తాయని చెబుతున్నారు వ్యాపారులు. వేసవి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడితేనే పౌల్ట్రీ రంగానికి ఊరట లభిస్తుందని అంటున్నారు. పెరిగిన ఉష్ణోగ్రతలతో తగ్గిన ఉత్పత్తి.. సహజంగా కోడి పిల్లలు పెరిగి పెద్దవయ్యేలోపు పౌల్ట్రీ యజమానులు కాస్త నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే కోళ్లు ఎక్కువగా […]

వానల కోసం పౌల్ట్రీ రంగం ఎదురుచూపులు..
X

సహజంగా వేసవి కాలంలో చికెన్ రేట్లు పెరుగుతాయి, ఆ తర్వాత మెల్లగా తగ్గుతాయి. ఈ దఫా ఉత్పత్తి భారీగా పడిపోయింది. రేట్లు పెరిగాయి, డిమాండ్ విపరీతంగా పెరిగింది. రుతుపవనాలు వస్తేనే చికెన్ రేట్లు దిగొస్తాయని చెబుతున్నారు వ్యాపారులు. వేసవి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడితేనే పౌల్ట్రీ రంగానికి ఊరట లభిస్తుందని అంటున్నారు.

పెరిగిన ఉష్ణోగ్రతలతో తగ్గిన ఉత్పత్తి..

సహజంగా కోడి పిల్లలు పెరిగి పెద్దవయ్యేలోపు పౌల్ట్రీ యజమానులు కాస్త నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే కోళ్లు ఎక్కువగా మృత్యువాత పడుతుంటాయి. మామూలు రోజుల్లో అయితే పౌల్ట్రీ ఫారంకు తెచ్చిన కోడి పిల్లల్లో పూర్తిగా పెరిగేలోపు 10శాతం మృతి చెందుతాయనే అంచనా ఉంటుంది. వేసవిలో ఈ నష్టం మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది భారీగా పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల ఏకంగా 30శాతం కోడి పిల్లలు మృత్యువాత పడుతున్నాయని చెబుతున్నారు పౌల్ట్రీ నిర్వాహకులు. దీంతో డిమాండ్ కి తగ్గ సప్లై లేదని అంటున్నారు. ప్రస్తుతం లైవ్ చికెన్ కోళ్ల ఫారం దగ్గర కేజీ 139 రూపాయలుగా ఉంటే, రిటైల్ మార్కెట్ లో లైవ్ చికెన్ కేజీ 160గా ఉంది.

డిమాండ్ పెరగడానికి కారణం..

సాధారణ రోజుల్లో ఏపీలో నెలకు సగటున 4.75 కోట్ల కోళ్లను మాంసం కోసం మార్కెట్ కి తరలిస్తుంటారు. రోజుకి 10లక్షల కేజీల చికెన్ ని ఏపీలో వినియోగిస్తుంటారు. వేసవి సెలవల కారణంగా హోటళ్లనుంచి కూడా చికెన్ కి డిమాండ్ పెరిగింది. మరోవైపు ఏపీలో ఏప్రిల్ 15నుంచి జూన్ 14 వరకు చేపల వేటపై నిషేధం ఉంది. దీంతో మార్కెట్ లో చేపలు, రొయ్యల లభ్యత కూడా తగ్గిపోయింది. దీంతో సహజంగా చికెన్ కి మరింత డిమాండ్ పెరిగింది. అయితే కోళ్ల ఉత్పత్తి తక్కువగా ఉండటంతో ఆ డిమాండ్ కి తగ్గ సప్లై లేదు. మరోవైపు కోళ్ల మేత రేటు కూడా భారీగా పెరిగిపోవడంతో ఆ ప్రభావం చికెన్ రేటుపై పడింది. రుతుపవనాలు వస్తే, వాతావరణ పరిస్థితులు కాస్త అనుకూలిస్తే పౌల్ట్రీ రంగం తిరిగి గాడిలో పడే అవకాశముంది. అప్పటి వరకూ కొండెక్కి కూర్చున్న కోడి రేటు దిగొచ్చేలా లేదు.

First Published:  3 Jun 2022 3:30 AM GMT
Next Story