Telugu Global
NEWS

నేటి నుంచి మరోసారి వ్యాక్సిన్ డ్రైవ్.. ఇంటికి వచ్చి లబ్దిదారులను గుర్తించనున్న హెల్త్ వర్కర్స్

కరోనా వైరస్ వేరియంట్లు మరోసారి వేగంగా వ్యాపిస్తుండటం, తెలంగాణ రాష్ట్రంలో కేసుల సంఖ్య కూడా పెరుగుతుండటంతో ప్రభుత్వం మరోసారి వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికీ రెండు డోసులు పూర్తి కాని వారి కోసం ఇయ్యాల్టి నుంచి జులై చివరి వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సారి వ్యాక్సిన్ వేసుకోనివారిని హెల్త్ వర్కర్లే ఇంటింటికీ తిరిగి గుర్తించి వారికి టీకాలు వేయనున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ జరగలేదు. దీంతో ప్రతీ గ్రామానికి రెండు […]

నేటి నుంచి మరోసారి వ్యాక్సిన్ డ్రైవ్.. ఇంటికి వచ్చి లబ్దిదారులను గుర్తించనున్న హెల్త్ వర్కర్స్
X

కరోనా వైరస్ వేరియంట్లు మరోసారి వేగంగా వ్యాపిస్తుండటం, తెలంగాణ రాష్ట్రంలో కేసుల సంఖ్య కూడా పెరుగుతుండటంతో ప్రభుత్వం మరోసారి వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికీ రెండు డోసులు పూర్తి కాని వారి కోసం ఇయ్యాల్టి నుంచి జులై చివరి వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సారి వ్యాక్సిన్ వేసుకోనివారిని హెల్త్ వర్కర్లే ఇంటింటికీ తిరిగి గుర్తించి వారికి టీకాలు వేయనున్నారు.

ముఖ్యంగా గ్రామాల్లో పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ జరగలేదు. దీంతో ప్రతీ గ్రామానికి రెండు బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఒక టీమ్ ఇంటింటికీ తిరిగి వ్యాక్సిన్ వేసుకోని వారిని గుర్తించి, గ్రామంలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ క్యాంపునకు తరలిస్తుంది. అక్కడ మరో టీమ్ వారికి టీకాలు వేయనున్నది.

తెలంగాణలో ఇంకా 16.36 లక్షల మంది సెకెండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉన్నది. అలాగే 29.51 లక్షల మంది బూస్టర్ డోసుకు అర్హత పొంది ఉన్నారు. మరోవైపు 12 నుంచి 18 ఏళ్ల వారిలో 70,827 మంది ఇప్పటి వరకు కనీసం ఒక్క డోసు కూడా తీసుకోలేదు. వీరందరికీ నేటి నుంచి ప్రారంభం కాబోయే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌లో టీకాలు వేయడానికి రంగం సిద్దం చేస్తున్నారు.

First Published:  2 Jun 2022 8:28 PM GMT
Next Story