Telugu Global
MOVIE UPDATES

బ్లాక్ బస్టర్ తీశామంటున్న నాని

తన కొత్త సినిమాపై హీరో నాని మరోసారి అతి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రదర్శించాడు. ఈసారి ఏకంగా బ్లాక్ బస్టర్ తీశామని ప్రకటించాడు. అదే ‘అంటే సుందరానికి’ సినిమా. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను తన కెరీర్ లో బ్లాక్ బస్టర్ మూవీగా ముందే లెక్కలోకి వేశాడు నాని. “వైజాగ్ మా అత్తగారి ఊరు. వైజాగ్ కి అల్లుడు వచ్చాడు. అల్లుడు వచ్చినపుడు విందుభోజనం పెడతారు. కానీ జూన్ 10న అల్లుడే విందు భోజనం పెడతాడు. […]

nani-covering-on-ante-sundaraniki
X

తన కొత్త సినిమాపై హీరో నాని మరోసారి అతి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రదర్శించాడు. ఈసారి ఏకంగా బ్లాక్ బస్టర్ తీశామని ప్రకటించాడు. అదే ‘అంటే సుందరానికి’ సినిమా. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను తన కెరీర్ లో బ్లాక్ బస్టర్ మూవీగా ముందే లెక్కలోకి వేశాడు నాని.

“వైజాగ్ మా అత్తగారి ఊరు. వైజాగ్ కి అల్లుడు వచ్చాడు. అల్లుడు వచ్చినపుడు విందుభోజనం పెడతారు. కానీ జూన్ 10న అల్లుడే విందు భోజనం పెడతాడు. బేసిగ్గా సినిమా విడుదలకు ముందు మంచి సినిమా తీశాం, బ్లాక్ బస్టర్ చేయాల్సింది మీరే అని చెప్తాం. కానీ ఈసారిలా అలా కాదు.. మేము బ్లాక్ బస్టర్ తీశాం. ఇంక దాన్ని ఎక్కడి తీసుకెళ్తారో మీ ఇష్టం. జూన్ 10నుండి ‘అంటే సుందరానికీ’ మీది. ఒక సినిమా విజయానికి యాక్షన్, హ్యుమర్, ఎమోషన్ కారణం. ఏడాది యాక్షన్ కావలసినంత దొరికింది. హ్యుమర్, ఎమోషన్ కోసం ప్రేక్షకులు ఆకలితో ఎదురుచూస్తున్నారు. జూన్ 10 ‘అంటే సుందరానికీ’ థియేటర్ లో కావాల్సినంత హ్యుమర్, ఎమోషన్ దొరుకుతుంది.”

ఇలా ‘అంటే సుందరానికి’ సినిమాపై చాలా నమ్మకం వ్యక్తం చేశాడు నాని. ఈ సినిమా ట్రయిలర్ తాజాగా రిలీజైంది. వైజాగ్ లో ఫంక్షన్ పెట్టారు. వైజాగ్ సముద్రంలాగ ఈ సినిమాలో హ్యుమర్, ఎమోషన్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయని చెబుతున్నాడు నాని.

ALSO READ: ఎఫ్3 మొదటి వారం వసూళ్లు

First Published:  3 Jun 2022 7:06 AM GMT
Next Story