Telugu Global
MOVIE UPDATES

ఎఫ్3 మొదటి వారం వసూళ్లు

ఫన్, ఫ్రస్ట్రేషన్ అండ్ ఫ్యామిలీ అంటూ వచ్చిన ఎఫ్3 సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. అయితే సినిమాకు హిట్ టాక్ వచ్చినప్పటికీ, వసూళ్లు మాత్రం ఇంకా ఊపందుకోలేదు. 63 కోట్ల రూపాయలకు సినిమా అమ్మితే, ఇప్పటివరకు వచ్చింది కేవలం 38 కోట్ల 77 లక్షల రూపాయలు మాత్రమే. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఇంకా ఈ 2 రోజులు మాత్రమే టైమ్ ఉంది. మళ్లీ సోమవారం మొదలైందంటే.. సినిమాకు ఆక్యుపెన్సీ తగ్గిపోతుంది. వరల్డ్ […]

ఎఫ్3 మొదటి వారం వసూళ్లు
X

ఫన్, ఫ్రస్ట్రేషన్ అండ్ ఫ్యామిలీ అంటూ వచ్చిన ఎఫ్3 సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. అయితే సినిమాకు హిట్ టాక్ వచ్చినప్పటికీ, వసూళ్లు మాత్రం ఇంకా ఊపందుకోలేదు. 63 కోట్ల రూపాయలకు సినిమా అమ్మితే, ఇప్పటివరకు వచ్చింది కేవలం 38 కోట్ల 77 లక్షల రూపాయలు మాత్రమే. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఇంకా ఈ 2 రోజులు మాత్రమే టైమ్ ఉంది. మళ్లీ సోమవారం మొదలైందంటే.. సినిమాకు ఆక్యుపెన్సీ తగ్గిపోతుంది.

వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 82 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చింది. అటు ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ మార్క్ కూడా అందుకుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే.. ఈ శని, ఆదివారాలు సినిమా గట్టిగా ఆడాల్సి ఉంటుంది. అదే ఇప్పుడు అనుమానంగా ఉంది.

ఎందుకంటే, మేజర్ సినిమా వచ్చింది. అడివి శేష్ హీరోగా నటించిన ఈ సినిమాకు యూనానిమస్ గా హిట్ టాక్ వచ్చింది. దీనికితోడు కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాకు కూడా హిట్ టాక్ రావడం మరో విశేషం. ఇప్పుడీ రెండు సినిమాలతో పాటు ఎఫ్3 కూడా ఆడియన్స్ ను షేర్ చేసుకోవాలి.

నిజానికి ఎఫ్3కి, పైన చెప్పుకున్న 2 సినిమాలకు జానర్ పరంగా చాలా పెద్ద తేడా ఉంది. అయినప్పటికీ కొత్త సినిమా చూడ్డానికే ఎక్కువమంది ఇష్టపడుతున్న ఈ రోజుల్లో, ఎఫ్3కి ఎంతమంది వస్తారు, ఎన్ని వసూళ్లు వస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది. నిన్నటితో వారం రోజుల రన్ పూర్తి చేసుకుంది ఈ సినిమా. ఈ 7 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి.

నైజాం : 16.40 కోట్లు
సీడెడ్ : 5.38 కోట్లు
ఉత్తరాంధ్రప : 5.18 కోట్లు
ఈస్ట : 2.86 కోట్లు
వెస్ట్ : 2.10 కోట్లు
గుంటూరు : 2.82 కోట్లు
కృష్ణా : 2.48 కోట్లు
నెల్లూరు : 1.55 కోట్లు

ALSO READ: మేజర్ మూవీ రివ్యూ

First Published:  3 Jun 2022 6:58 AM GMT
Next Story