Telugu Global
NEWS

పారిశ్రామిక ప్ర‌గ‌తికి కేరాఫ్ అడ్ర‌స్‌ తెలంగాణ‌

తెలంగాణ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న పారిశ్రామిక స‌ర‌ళీకృత విధానాల‌తో ఇండ‌స్ట్రీ రంగం అభివృద్ధిప‌థంలో దూసుకుపోతోంది. టి ఎస్ ఐపాస్ విధానం దేశ‌, విదేశీ సంస్థ‌లను ఎంత‌గానో ఆక‌ర్షిస్తోంది. దీంతో రాష్ట్రంలోకి వెల్లువ‌లా ప‌రిశ్ర‌మ‌లు, దేశ‌, విదేశీ పెట్టుబ‌డులు త‌ర‌లివ‌స్తున్నాయి. 2018-19 నాటికే తెలంగాణ‌లో 74, 630 కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయి. 2022 నాటికి ఇది 2 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరుకుంటుంది. ఇప్ప‌టివ‌రకు టిఎస్ ఐపాస్ ద్వారా 12వేల‌కు పైగా ప‌రిశ్ర‌మ‌లు అనుమ‌తులు పొంద‌గా, వీటిలో 80 శాతం వ‌ర‌కు […]

telangana-state-carafe-address-for-industrial-development
X

తెలంగాణ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న పారిశ్రామిక స‌ర‌ళీకృత విధానాల‌తో ఇండ‌స్ట్రీ రంగం అభివృద్ధిప‌థంలో దూసుకుపోతోంది. టి ఎస్ ఐపాస్ విధానం దేశ‌, విదేశీ సంస్థ‌లను ఎంత‌గానో ఆక‌ర్షిస్తోంది. దీంతో రాష్ట్రంలోకి వెల్లువ‌లా ప‌రిశ్ర‌మ‌లు, దేశ‌, విదేశీ పెట్టుబ‌డులు త‌ర‌లివ‌స్తున్నాయి. 2018-19 నాటికే తెలంగాణ‌లో 74, 630 కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయి. 2022 నాటికి ఇది 2 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరుకుంటుంది. ఇప్ప‌టివ‌రకు టిఎస్ ఐపాస్ ద్వారా 12వేల‌కు పైగా ప‌రిశ్ర‌మ‌లు అనుమ‌తులు పొంద‌గా, వీటిలో 80 శాతం వ‌ర‌కు కార్య‌క‌లాపాలు ప్రారంభించాయి. కార్యాల‌య స్థ‌ల వినియోగంలో హైద‌రాబాద్ భార‌త‌దేశంలోనే మొద‌టి స్థానంలో ఉంది. జీవించ‌డానికి అత్యంత అనుకూల ప్రాంతాల్లో హైద‌రాబాద్ కూడా మొద‌టి ప్రాధాన్య‌త‌లో ఉంది. నీతి ఆయోగ్ అభివృద్ధి లక్ష్యాల సాధ‌నా ప‌ట్టిక‌లో కూడా హైద‌రాబాద్ అగ్ర‌స్థానంలో ఉంటోంది.

ఇక కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రాజన్నసిరిసిల్ల జిల్లా ఇండస్ట్రియల్‌ హబ్‌గా మారింది. టీఎస్‌ఐ పాస్‌తో సుమారు 752 కుటీర పరిశ్రమలు జిల్లాలో ఏర్పాటు చేసి, వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు క‌ల్పించారు. జిల్లాగా ఆవిర్భవించిన అనంతరం రెండువేల కోట్ల రూపాయల విలువైన వ‌స్త్రోత్ప‌త్తుల‌ ఆర్డర్లు ఇచ్చి ప్రభుత్వం అండగా నిలిచింది. మరమగ్గాలను ఆధునీకరించి బ్రాండెడ్ వ‌స్త్రాల‌ తయారీకి శ్రీకారం చుట్టింది.

ప్ర‌త్యేక తెలంగాణ ఏర్ప‌డ్డాక ఈ ఎనిమిదేళ్ల‌ కాలంలో పారిశ్రామిక రంగంలో తెలంగాణ దేశంలో ముందు వ‌రుస‌లో ఉంది. కేసీఆర్ దిశానిర్దేశంలో మంత్రి కే.తార‌క రామారావు తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపుపారిశ్రామికీకరణకు, ఐటీ రంగానికి ప్రాధాన్యం ఇస్తూనే ఉపాధి కల్పనకు పెద్దపీట వేశారు. పరిశ్రమల ఏర్పాటుకు టీఎస్ ఐపాస్ ద్వారా విప్లవాత్మకమైన విధానం తెచ్చిన ఘ‌న‌త కేసీఆర్ ప్ర‌భుత్వానిదే. దీనికోసం తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం ప్ర‌వేశ‌పెట్టారు. తెలంగాణలో పరిశ్రమ స్థాపించాలంటే ఆన్లైన్ ద్వారా టీఎస్ ఐపాస్ పోర్టల్ లో దరఖాస్తు చేసుకుంటే, 15 రోజుల్లో అనుమతులు ల‌భిస్తుంద‌ని కేటీఆర్ దావోస్ వేదిక‌గా కూడా గొప్ప‌గా ప్ర‌క‌టించారు.
టీఎస్ ఐపాస్ వచ్చినప్పటినుండి 15 లక్షల మందికిపైగా ఉద్యోగాలు కల్పించడం జరిగిందని మంత్రి కేటీఆర్ అన్నారు.

సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు కార్యరూపం ఇచ్చేందుకు పరిశ్రమలశాఖ మంత్రి కె.టి. రామారావు దేశ,విదేశాల్లో పర్యటించి అక్కడి పారిశ్రామికవేత్తలకు, ఎన్‌ఆర్‌ఐలకు టీఎస్‌-ఐపాస్‌ విశిష్టతలను వివరించి రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులను రాబడుతున్నారు. మంత్రి కేటీఆర్‌ చొరవ ఫలితంగానే రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు దిగ్గజ సంస్థలు, మేటి పరిశ్రమలు, బడా పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. ఐటీ, ఫార్మా, మెడికల్‌ డివైజెస్‌, ఎంఎస్‌ ఎంఈ, ఆగ్రో, ఫుడ్‌ ప్రాసెస్‌, ఏరో స్పేస్‌ రంగంలో ఇప్పటికే తెలంగాణ అగ్రగామిగా ఉంది. ఈ రంగంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు పోటీపడుతున్నారు. దీంతో పరిశ్రమల స్థాపనకు రాష్ట్రంలో భూములకు డిమాండ్‌ పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయానికి పనికిరాని భూములను పరిశ్రమల ఏర్పాటుకు వాడుకునేందుకు వీలుగా 1.45 లక్షల ఎకరాలను గుర్తించి టీఎస్‌ఐఐసీ రిజర్వు చేసింది.

తెలంగాణలో ఉన్న భౌగోళిక, వాతావరణ, శాంతిభద్రతల పరిస్థితుల అనుకూలతతో పాటు సీఎం కేసీఆర్‌ సమర్థ నాయకత్వం, మంత్రి కె.టి.ఆర్ కృషి, చొరవ కారణంగా అంతర్జాతీయంగా ప్రసిద్ధి గాంచిన గూగుల్‌, యాపిల్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, ఊబెర్‌, లాంటి ఐటీ సంస్థలు తమ కార్యాలయాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకున్నాయి. రాబోయే కాలంలో ఐటీ, ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌, మెడికల్‌ డివైజెస్‌ రంగంలో తెలంగాణ రాష్ట్రం హబ్‌గా మారనుంది.

దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని నీతిఆయోగ్‌ తేల్చింది. జీఎస్‌డీపీ పరంగా ఏడో పెద్ద రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. పారిశ్రామిక రంగం ఫార్మా, బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ భారీగా జీఎస్డీపీని అందిస్తున్నాయి. అదే సమయంలో టెక్స్‌టైల్స్, లెదర్, ఫుడ్‌ ప్రాసెసింగ్, మినరల్స్‌ వంటి సంప్రదాయ రంగాలు కూడా మంచి ప్రతిభను కనబరుస్తున్నాయని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. ఫార్మా రంగంలో తెలంగాణను లీడర్‌గా నీతి ఆయోగ్ అభివ‌ర్ణించింది. దేశం ఫార్మా ఎగుమతుల్లో హైదరాబాద్‌ వాటా 35 శాతంగా ఉంది.

హైదరాబాద్ ఐటీతో పాటు ఇతర వర్టికల్స్‌లో లైఫ్ సైన్సెస్, ఫైనాన్స్, ఏరోస్పేస్ & డిఫెన్స్ లో అభివృద్ధి సాధిస్తూ, తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించడంలో ముందు వ‌రుస‌లో నిలుస్తోంది.
తెలంగాణ ప్రభుత్వంలోని కేటీఆర్ నిరంతర కృషి, ప్రగతిశీల పథకాల అమలు వల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (EoDB) చార్టుల్లో తెలంగాణా మొదటి స్థానంలో నిలిచింది..!

దేశ ఎగుమతుల్లోనూ తెలంగాణ వాటా 10.61 శాతం నుంచి 11.58 శాతానికి పెరిగింది. రానున్న రోజుల్లో సుమారు రూ.45,848 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి భారీ ప్రాజెక్టుల రూపంలో రానున్నాయి. తద్వారా సుమారు 83 వేల మందికి కొత్త‌గా ఉద్యోగాలు లభిస్తాయి. రాష్ట్ర ఔషధ పరిశ్రమల విలువను 100 బిలియన్ డాలర్లకు పెంచడం, 4 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని మంత్రి కేటీఆర్ వివరించారు.

హైదరాబాద్ సమీపంలో ఉన్న జీనోమ్ వ్యాలీ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 200 కంపెనీలతో సుమారు 10 వేల మంది కార్మికులు ఉపాధి పొందుతుండగా.. కొత్తగా శాండజ్, సింజిన్, టీసీఐ కెమికల్స్, యాపన్ బయో, వల్లర్క్ ఫార్మా తదితర కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. మ‌రిన్ని ప‌రిశ్ర‌మ‌లు త్వ‌ర‌లో రానున్నాయి. హైదరాబాద్ ఔషధనగరికి ఇప్పటికే నిష్క్ హోదా రాగా వీలైనంత త్వరలోనే పనులు కూడా పూర్తి చేయాల‌నే ల‌క్ష్యంగా కేసీఆర్ ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకుంది.

• జాతీయ ఫార్మా ఉత్పత్తుల్లో రాష్ట్ర వాటా 35 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 50 బిలియన్ డాలర్ల విలువైన సుమారు 800 ఔషధ, బయోటెక్, వైద్య సాంకేతిక సంస్థలున్నాయి. నోవార్టిస్ తన డిజిటల్ ఆవిష్కరణ కేంద్రం హైదరాబాద్లో ప్రారంభించింది.

• వైమానిక రంగంలో ఉత్తమ రాష్ట్రంగా జాతీయ పౌర విమానయాన సంస్థ నుంచి పురస్కారం పొందింది. హైదరాబాద్ జిఎంఆర్ విమానాశ్రయం ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న వాటిల్లో మూడో స్థానం పొందింది. నోవా ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ లిమిటెడ్ ఐదు కొత్త ప్రాజెక్టుల ద్వారా హైదరాబాద్ లో 600 మందికి ఉపాధి కల్పించింది.

• ఆహారశుద్ధి, జౌళి రంగాలు : ఆహారశుద్ధి రంగంలో రూ.300 కోట్లతో ఏడు సమీకృత శీతల గిడ్డంగులు. ఒక భారీ ఆహార పార్కు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. మరో రూ.3 వేల కోట్ల పెట్టుబడులతో కొత్త ప్రాజెక్టులు రానున్నాయి.

• గచ్చిబౌలిలో 20 వేల చదరపు అడుగులతో అతి పెద్ద పంపిణీ కేంద్రాన్ని అమెజాన్ సంస్థ ప్రారంభించింది. రాష్ట్రంలో వాల్మార్ట్ తన 5వ స్టోర్ను వరంగల్లో ప్రారంభించింది.

• తెలంగాణలో రైల్‌ కోచ్‌ల తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు స్విట్జర్లాండ్‌ సంస్థ ‘స్టాడ్లర్‌ రైల్‌’ ముందుకొచ్చింది. రూ.1,000 కోట్ల పెట్టుబడితో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకొన్నది.

• వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు తొలిరోజు పలు సంస్థలు తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చాయి. యూఏఈ కి చెందిన లులూ గ్రూపు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో రూ.500 కోట్ల భారీగా పెట్టుబడి పెట్టనున్నట్లు లూలు గ్రూపు అధిపతి యూసుఫ్‌ అలీ ప్రకటించారు. ఫార్మా కంపెనీ కీమో, స్విట్జర్లాండ్‌ బీమా సంస్థ స్వీస్‌రీ, ఈ-కామర్స్‌ సంస్థ మీషో తమ కార్యాలయాల ఏర్పాటుకు నిర్ణయించాయి.

• తెలంగాణను బొమ్మల తయారీ కేంద్రం (టాయ్స్‌ హబ్‌)గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని దండుమల్కాపూర్‌లో అత్యాధునిక బొమ్మల తయారీ పరిశ్రమలు కొలువుదీరేలా ప్రత్యేక క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

• డీఫ్ఈ ఫార్మా తెలంగాణ కు రాబోతుంది, కేటీఆర్ గారి చొరవతో తన పెట్టుబడులు రాష్ట్రం లో పెట్టబోతోంది, యువతకు నూతన అవకాశాలు మరియు ఉపాధి అవకాశాలు మెండుగా పెరుగుతాయి.
స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ బ్యాంకింగ్‌, ఫైనా న్స్‌, బీమా రంగ సంస్థ స్విస్‌రీ తెలంగాణలో మొట్ట మొదటిగా తన కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది.

• టెక్నాలజీ దిగ్గజం గూగుల్ సొంత క్యాంపస్ హైదరాబాద్లో ఏర్పాటవుతోంది. 33 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రానున్న ఈ కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు ఏప్రిల్ 28న శంకుస్థాపన చేశారు. గూగుల్‌కు ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద క్యాంపస్ కానుంది. గచ్చిబౌలిలో 7.3 ఎకరాల స్థలంలో ఈ క్యాంపస్ ఏర్పాటవుతోంది.

• దేశంలో మిగతా 16 రాష్ట్రాలతో పోలిస్తే ,ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఈ మండే వేస‌విలో కూడా వెలుగులు నింపిన ఘ‌న‌త సీఎం కేసీఆర్‌కు ద‌క్కుతుంది.

• అటు ఐటీ ఉత్పత్తుల్లో గణనీయమైన వృద్ధి సాధించడం, ఫార్మా రంగంలోనూ బెస్ట్ కావడం, విద్య, వైద్య, రక్షణ, పరిశోధన రంగాలకు కేంద్ర బిందువుగా మారడంతో పారిశ్రామిక రంగానికి తెలంగాణ కేరాఫ్ అడ్ర‌స్‌గా మారింది.

Next Story