Telugu Global
NEWS

సౌరవ్ గంగూలీ ట్విట్ తో కలకలం! బీసీసీఐకి రాజీనామా చేయలేదంటూ వివరణ

భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రాజకీయాలలో చేరటం కోసం బీసీసీఐ చైర్మన్ పదవికి రాజీనామా చేయబోతున్నట్లుగా వచ్చిన వార్త నిజం కాదని, కేవలం మీడియావర్గాల ఊహాగానమేనని తేలిపోయింది. కేవలం క్రికెట్ తోనే తన జీవితంలో మూడుదశాబ్లాల కాలం ముగిసిపోయిందంటూ దాదా ఓ చిత్రమైన ట్విట్ చేయడం గందరగోళానికి దారితీసింది. 1992 నుంచి 2022 వరకూ… 1992లో తన క్రికెట్ జీవితం ప్రారంభించిన సౌరవ్ గంగూలీ ప్రస్తుత 2022తో మూడుదశాబ్దాల కెరియర్ ను పూర్తి చేసుకొన్నాడు. బెంగాల్ […]

Sourav Ganguly
X

భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రాజకీయాలలో చేరటం కోసం బీసీసీఐ చైర్మన్ పదవికి రాజీనామా చేయబోతున్నట్లుగా వచ్చిన వార్త నిజం కాదని, కేవలం మీడియావర్గాల ఊహాగానమేనని తేలిపోయింది.
కేవలం క్రికెట్ తోనే తన జీవితంలో మూడుదశాబ్లాల కాలం ముగిసిపోయిందంటూ దాదా ఓ చిత్రమైన ట్విట్ చేయడం గందరగోళానికి దారితీసింది.

1992 నుంచి 2022 వరకూ…

1992లో తన క్రికెట్ జీవితం ప్రారంభించిన సౌరవ్ గంగూలీ ప్రస్తుత 2022తో మూడుదశాబ్దాల కెరియర్ ను పూర్తి చేసుకొన్నాడు. బెంగాల్ రంజీజట్టులో సభ్యుడిగా మొదలుపెట్టిన సౌరవ్ ఆ తర్వాత భారత క్రికెట్ సారధిగా, అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా పలు అసాధారణ రికార్డులు నెలకొల్పాడు.

స్పెషలిస్ట్ బ్యాట్స్ మన్ గా, మీడియం పేస్ ఆల్ రౌండర్ గా సౌరవ్ 113 టెస్టులు, 311 వన్డేలలో భారత్ కు ప్రాతినిథ్యం వహించడమే కాదు…18000 పరుగులు సాధించాడు.

క్రికెట్ ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సౌరవ్ బెంగాల్ క్రికెట్ సంఘం కార్యదర్శిగా బాధ్యతలు అత్యంత సమర్థవంతంగా నిర్వర్తించడం ద్వారా..బీసీసీఐ అధ్యక్షుడిగా 2019లో ఎంపికయ్యాడు.

సౌరవ్ గంగూలీ బోర్డు అధ్యక్షుడిగా, కేంద్రహోంమంత్రి కుమారుడు జే షా కార్యదర్శిగా భారత క్రికెట్ బోర్డు ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన, అత్యంత బలమైన క్రికెట్ వ్యవస్థగా రూపుదిద్దుకొంది.

క్రికెటర్ గా, క్రికెట్ పాలకమండలి సభ్యుడిగా మూడుదశాబ్దాలుపాటు తాను విజయవంతం కావడంలో సహకరించిన అందరికీ రుణపడి ఉంటానని ట్విట్టర్ సందేశం ద్వారా తెలిపాడు. అంతేకాదు..తాను సరికొత్త ప్రణాళికతో భావిజీవితానికి సిద్ధమవుతున్నట్లు పేర్కొనడంతో,,,రాజకీయ అరంగేట్రానికి సిద్ధమమవుతున్నట్లు ఊహాగానాలు చేలరేగాయి.

రాజకీయాలవైపు దాదా చూపు?

సౌరవ్ గంగూలీ కమలం తీర్థం పుచ్చుకోడం ద్వారా రాజకీయ అరంగేట్రానికి సిద్ధమవుతున్నట్లుగా 2021 ఎన్నికల సమయంలోనే వార్తలు బయటకు వచ్చాయి.

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఎదుర్కొనటానికి సౌరవ్ గంగూలీనే ప్రధాన అస్త్రంగా ప్రయోగించాలని బీజేపీ వర్గాలు భావిస్తున్నట్లు కథనాలు వచ్చాయి.

దీనికితోడు బీసీసీఐ కార్యదర్శి జే షా తండ్రి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు, బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్షనాయకుడు సువేందు అధికారి లకు సౌరవ్ విందు ఇవ్వటం కూడా ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది. అయితే దాదా మాత్రం 2021 ఎన్నికలకు దూరంగా ఉండిపోయాడు.

రాజీనామా చేయలేదు- జే షా..

బీసీసీఐ చైర్మన్ పదవికి సౌరవ్ గంగూలీ రాజీనామా చేసి రాజకీయాలలో చేరుతున్నారంటూ వచ్చిన వార్తలను బోర్డు కార్యదర్శి జే షా, కోశాధికారి అరుణ్ దుమాల్ ఖండించారు.
మరోవైపు దాదా సైతం తన ట్విట్టర్ సందేశాన్ని వక్రీకరించి కథనాలు అల్లారంటూ వివరణ ఇచ్చాడు. దేశంలోని కోట్లాదిమందికి తాను ఉపయోగపడటం కోసం విద్యసంబంధమైన విషయాల యాప్ ను రూపొందిస్తున్నట్లు తెలిపాడు.

బోర్డు చైర్మన్ పదవిని తాను వీడలేదని, భారత క్రికెట్ ప్రయోజనాలు, బాగు కోసం తాను ఇకముందు కూడా తన సహసభ్యులతో కలసి పాటుపడతానని వివరించాడు.

తనకు బెంగాల్ ముఖ్యమంత్రితోనూ చక్కటి సంబంధాలు ఉన్నాయని, రాజకీయాలలో చేరే ఆలోచనలేదంటూ పరోక్షంగా వివరణ ఇచ్చాడు.

First Published:  2 Jun 2022 6:49 AM GMT
Next Story