Telugu Global
National

తీహార్ జైలు.. ఇచ్చట అన్ని సౌకర్యాలు లభించును..

జైలులో ఉండే ఖైదీలు కులాసాగా మర్డర్ స్కెచ్ లు వేసే సన్నివేశాల్ని ఇప్పటి వరకూ సినిమాల్లోనే చూశాం. కానీ అది నిజ జీవితం నుంచి తీసుకున్న స్ఫూర్తి అనడానికి తీహార్ జైలు పెద్ద ఉదాహరణ. జైలు అధికారులకు డబ్బులిస్తే తీహార్ కారాగారంలో ఖైదీల దగ్గరకు రాని సౌకర్యమంటూ ఏదీ ఉండదు. తాజాగా ప్రముఖ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకు కూడా తీహార్ జైలునుంచే ప్రణాళిక రచించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఉన్న లారెన్స్ […]

తీహార్ జైలు.. ఇచ్చట అన్ని సౌకర్యాలు లభించును..
X

జైలులో ఉండే ఖైదీలు కులాసాగా మర్డర్ స్కెచ్ లు వేసే సన్నివేశాల్ని ఇప్పటి వరకూ సినిమాల్లోనే చూశాం. కానీ అది నిజ జీవితం నుంచి తీసుకున్న స్ఫూర్తి అనడానికి తీహార్ జైలు పెద్ద ఉదాహరణ. జైలు అధికారులకు డబ్బులిస్తే తీహార్ కారాగారంలో ఖైదీల దగ్గరకు రాని సౌకర్యమంటూ ఏదీ ఉండదు. తాజాగా ప్రముఖ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకు కూడా తీహార్ జైలునుంచే ప్రణాళిక రచించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఉన్న లారెన్స్ బిష్ణోయ్.. సిద్ధూ హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా అనుమానాలున్నాయి.

సిద్ధూ మూసేవాలా హత్యతో మరోసారి తీహార్ జైలు వ్యవహారం వార్తల్లోకెక్కింది. ఈ హత్యతో ప్రమేయం ఉందని అనుమానాలున్న లారెన్స్ తోపాటు, మరో కీలక గ్యాంగ్ స్టర్ జతేడి కూడా తీహార్ జైలులోనే ఉన్నారు. వీరిద్దరూ జైలులో ఉన్నా వీరి ఫేస్ బుక్ పేజీలు ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటాయి. వాటిలో పోస్టింగ్స్ పెడుతూనే ఉంటారు. జైలులో వారికి స్మార్ట్ ఫోన్లు కూడా ఇస్తున్నారనేందుకు ఈదే పెద్ద రుజువు. అయితే తమ అభిమానులు ఆ ఫేస్ బుక్ పేజీలు నిర్వహిస్తుంటారని చెప్పి తప్పించుకుంటారు ఈ గ్యాంగ్ స్టర్స్.

నేరగాళ్లకు తీహార్ జైలు సురక్షిత స్థావరం అనే పేరుంది. రోహిణి కోర్టులో జితేంద్ర గోగీని హతమార్చడం, మండోలి జైలులో ఉన్న కుల్దీప్ పరారీకి ప్లాన్ చేయడం కూడా ఈ జైలునుంచే జరిగిందని అంటారు. సుకేష్ చంద్రశేఖర్ అనే బిజినెస్ మెన్ ఏకంగా జైలు నుంచే తన బిజినెస్ వ్యవహారాలు పర్యవేక్షించేవారు. ఆయనకు ల్యాప్ టాప్ కూడా అందుబాటులో ఉంచుతారని సిబ్బందిపై ఆరోపణలున్నాయి.

తీహార్ జైలులో ఉన్న గ్యాంగ్ స్టర్స్ ను ఖలిస్తానీ గ్రూపులు తమ లక్ష్యాలకోసం వాడుకుంటున్నట్టు కూడా ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం ఉంది. జైలు నుంచే బ్లాక్ మెయిలింగ్, మర్డర్ ప్లాన్స్ అన్నీ జరిగిపోతుంటాయి. ఇక సిద్ధూ మూసేవాలా హత్య తర్వాత మరో గాయకుడు మన్ కీర్త్ ఔలఖ్.. తనకు భద్రత కల్పించాలని పంజాబ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తీహార్ జైలులో ఉన్న గ్యాంగ్ స్టర్స్ లో ఎక్కువమంది ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్ కి చెందినవారు. వీరందరూ ముఠాలుగా ఏర్పడి జైలు నుంచి నేర సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ఇప్పుడు వీరందర్నీ వేర్వేరు జైళ్లకు తరలించాలని భావిస్తున్నారట.

First Published:  1 Jun 2022 8:48 PM GMT
Next Story