Telugu Global
National

సిద్దూ హత్యతో పంజాబ్ ఆప్ సర్కార్ యూ టర్న్

పంజాబ్ లో గాయకుడు సిద్దూ మూసేవాలా హత్య నేపథ్యంలో పంజాబ్ ఆప్ సర్కార్ యూటర్న్ తీసుకుంది. 420 మంది వీవీఐపీల కు భద్రత పునరుద్ధరించబడుతుందని ప్రకటించింది. పంజాబ్ ప్రభుత్వం వీఐపీలకు భద్రత ఉపసంహరించిన మరుసటి రోజే సిద్దూ హత్యతో ఆప్ సర్కార్ ఆత్మరక్షణలో పడింది. దాంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. జూన్ 7వ తేదీ నుంచి 420 మంది వీవీఐపీలకు భద్రత పునరుద్ధరించబడుతుందని ప్రభుత్వం పంజాబ్,హర్యానా హైకోర్టుకు తెలియజేసింది. హైకోర్టులో ఇవ్వాళ్ళ మాజీ మంత్రి OP […]

సిద్దూ హత్యతో పంజాబ్ ఆప్ సర్కార్ యూ టర్న్
X

పంజాబ్ లో గాయకుడు సిద్దూ మూసేవాలా హత్య నేపథ్యంలో పంజాబ్ ఆప్ సర్కార్ యూటర్న్ తీసుకుంది. 420 మంది వీవీఐపీల కు భద్రత పునరుద్ధరించబడుతుందని ప్రకటించింది. పంజాబ్ ప్రభుత్వం వీఐపీలకు భద్రత ఉపసంహరించిన మరుసటి రోజే సిద్దూ హత్యతో ఆప్ సర్కార్ ఆత్మరక్షణలో పడింది. దాంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.

జూన్ 7వ తేదీ నుంచి 420 మంది వీవీఐపీలకు భద్రత పునరుద్ధరించబడుతుందని ప్రభుత్వం పంజాబ్,హర్యానా హైకోర్టుకు తెలియజేసింది. హైకోర్టులో ఇవ్వాళ్ళ మాజీ మంత్రి OP సోనీ వేసిన‌ పిటిషన్ విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది.

జూన్ 6న జరిగే ఆపరేషన్ బ్లూస్టార్ వార్షికోత్సవం సందర్భంగా తమకు ఎక్కువ మంది భద్రతా సిబ్బంది అవసరమని, అందువల్ల 7వ తేదీ నుంచి వీవీఐపీలకు భద్రత ఇస్తామని ప్రభుత్వం చెప్పింది.

దుండగులు సిద్ధూ మూసేవాలాను కాల్చి చంపినప్పటి నుంచి ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ నేతృత్వంలోని పంజాబ్‌ ప్రభుత్వం వీవీఐపీలకు భద్రతను తగ్గించడంపై అనేక విమర్శలను ఎదుర్కొంది.

“కేజ్రీవాల్-మాన్ ద్వయం మళ్లీ మట్టి కరిచింది. పంజాబ్‌లో VIP సంస్కృతిని తగ్గించాలనే వారి వాదనను హైకోర్టు తిప్పికొట్టింది. ఇది పంజాబ్ AAP యొక్క పనికిమాలిన‌ స్టంట్. దీనివల్ల‌ పంజాబీలు ఒక‌ విలువైన జీవితాన్ని కోల్పోయారు. ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని పంజాబ్ యువత ఎప్పటికీ క్షమించదు.” అని బీజేపీ నేత మంజీందర్ సింగ్ సిర్సా ట్వీట్ చేశారు.

First Published:  2 Jun 2022 6:17 AM GMT
Next Story