Telugu Global
MOVIE UPDATES

‘ఒక పథకం ప్రకారం’ రిలీజ్ చేసిన టీజర్

సాయిరామ్ శంకర్, అశీమా నర్వాల్ జంటగా వినోద్ విజయన్ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘ఒక పథకం ప్రకారం‘. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు విన్నింగ్ దర్శకుడు వినోద్ విజయన్ తెరకెక్కిస్తున్నాడు. ఈయనతో పాటు మరో ఐదుగురు నేషనల్ అవార్డ్ విన్నర్స్ ‘ఒక పథకం ప్రకారం’ సినిమా కోసం పని చేస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా వస్తుంది. ఇందులో రామ రావణ తరహా పాత్రలో నటిస్తున్నాడు హీరో సాయిరామ్ శంకర్. తాజాగా […]

‘ఒక పథకం ప్రకారం’ రిలీజ్ చేసిన టీజర్
X

సాయిరామ్ శంకర్, అశీమా నర్వాల్ జంటగా వినోద్ విజయన్ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘ఒక పథకం ప్రకారం‘. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు విన్నింగ్ దర్శకుడు వినోద్ విజయన్ తెరకెక్కిస్తున్నాడు. ఈయనతో పాటు మరో ఐదుగురు నేషనల్ అవార్డ్ విన్నర్స్ ‘ఒక పథకం ప్రకారం’ సినిమా కోసం పని చేస్తున్నారు.

విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా వస్తుంది. ఇందులో రామ రావణ తరహా పాత్రలో నటిస్తున్నాడు హీరో సాయిరామ్ శంకర్. తాజాగా ఈ సినిమా టీజర్ ను మాస్ రాజా రవితేజ చేతుల మీదుగా విడుదల చేశారు. టీజర్ చూస్తే, సాయిరాం శంకర్ లో షేడ్స్ స్పష్టంగా కనిపిస్తాయి.

సినిమా కాన్సెప్టును టీజర్ లోనే చూపించారు మేకర్స్. ఇందులో కొత్తగా కనిపిస్తున్నాడు సాయిరామ్ శంకర్. పూర్తిగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గానే ఈ సినిమా వస్తుంది. ఈ చిత్రం కోసం ఆరుగురు నేషనల్ అవార్డ్ విన్నర్స్ వర్క్ చేస్తున్నారు. దర్శకుడు వినోద్ విజయన్, ఎడిటిర్, మేకప్ ఆర్టిస్ట్, ప్రొడక్షన్ డిజైనర్ సహా మరో ఇద్దరు జాతీయ అవార్డు గ్రహీతలు ‘ఒక పథకం ప్రకారం’ సినిమా టీమ్ లో ఉన్నారు.

ఈ సినిమా జూన్ 24న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. చాన్నాళ్లుగా సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు సాయిరాం శంకర్. ప్రస్తుతం చేతిలో 3 సినిమాలున్నప్పటికీ, ‘ఒక పథకం ప్రకారం’ సినిమాతో ఈ ఏడాదిని గ్రాండ్ గా మొదలుపెట్టాలని అనుకుంటున్నాడు. ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందంటున్నాడు ఈ హీరో.

First Published:  2 Jun 2022 3:50 AM GMT
Next Story