Telugu Global
International

మాజీ భార్యపై కేసు గెలిచిన జానీ డెప్.. మధ్యలో ఎలాన్ మస్క్‌కు ఏం సంబంధం?

పైరేట్స్ ఆఫ్ కరేబియన్ ఫేమ్, హాలీవుడ్ నటుడు జానీ డెప్, అతని మాజీ భార్య అంబర్ హర్డ్ మధ్య ఓ పరువునష్టం దావా కేసులో తీర్పు వెలువడింది. ఇరుపక్షాలు ఈ కేసులో పరిహారం పొందేందుకు అర్హులే అని చెప్తూనే.. జానీకి అనుకూలంగా ఏడుగురు సభ్యులతో కూడిన జ్యూరీ తీర్పు చెప్పింది. ఆరు వారాల పాటు సాగిన విచారణలో జానీ డెప్‌కు మాజీ భార్య అంబర్ హర్డ్ 13.5 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని జ్యూరీ ఆదేశించింది. అసలు […]

మాజీ భార్యపై కేసు గెలిచిన జానీ డెప్.. మధ్యలో ఎలాన్ మస్క్‌కు ఏం సంబంధం?
X

పైరేట్స్ ఆఫ్ కరేబియన్ ఫేమ్, హాలీవుడ్ నటుడు జానీ డెప్, అతని మాజీ భార్య అంబర్ హర్డ్ మధ్య ఓ పరువునష్టం దావా కేసులో తీర్పు వెలువడింది. ఇరుపక్షాలు ఈ కేసులో పరిహారం పొందేందుకు అర్హులే అని చెప్తూనే.. జానీకి అనుకూలంగా ఏడుగురు సభ్యులతో కూడిన జ్యూరీ తీర్పు చెప్పింది. ఆరు వారాల పాటు సాగిన విచారణలో జానీ డెప్‌కు మాజీ భార్య అంబర్ హర్డ్ 13.5 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని జ్యూరీ ఆదేశించింది.

అసలు కేసేంటి?

ది వాషింగ్టన్ పోస్టులో 2018లో అంబర్ హర్డ్ ఒక కథనాన్ని రాసింది. జానీ డెప్ పేరు ప్రస్తావించకుండానే సెక్సువల్ వయలెన్స్ మీద ఆ ఆర్టికల్ ఉంటుంది. అందులో వైవాహిక జీవితం గురించి రాయడంతో నా పరువుకు భంగం కలిగించేలా ఆ కథనం ఉందని జానీ డెప్ కేసు వేశాడు. తన పరువుకు భంగం కలిగించేలా ఆ ఆర్టికల్ రాసినందుకు తన మాజీ భార్య పరువునష్టం చెల్లించాల్సిందేనని అతడు పట్టుబట్టాడు. తనకు 50 మిలియన్ డాలర్ల నష్టపరిహారం ఇవ్వాలని కోరాడు.

ఎలాన్ మస్క్‌తో ఏంటి సంబంధం?

అంబర్ హర్డ్‌కు ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో ఎఫైర్ ఉందని స్వయంగా జానీ డెప్ దావాలో ఆరోపించాడు. అతను ఎలాన్ మస్క్ అని అమెరికన్ మీడియా కోడై కూసింది. అతడితో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే జానీ డెప్‌ను వదిలేసిందనే వార్తలు కూడా వెలువడ్డాయి. మస్క్‌తో ఉన్న ఎఫైర్ కారణంగానే ఆమె ప్రభావితం అయ్యిందని, అందుకే తనపై అలాంటి ఆర్టికల్ రాసిందని స్వయంగా జానీ డెప్ దావాలో ఆరోపించడం గమనార్హం. కాగా, జానీ డెప్ పరువు నష్టం దావా వేసిన తర్వాత, కౌంటర్‌గా అంబర్ కూడా ఓ దావా వేసింది. తాను గృహ హింసను ఎదుర్కున్నానని, అతని లాయర్ ఎన్నో అసత్య ప్రచారాలు చేశాడని పేర్కొంటూ 100 మిలియన్ డాలర్ల దావా వేసింది.

కాగా, ఈ రెండు దావాలను ఒకేసారి విచారించిన జ్యూరీ.. చివరకు జానీ వాదన వైపే నిలబడింది. జానీ పరువుకు భంగం కలిగిందని పేర్కొంటూ 13.5 మిలియన్ డాలర్లు చెల్లించాలని అంబర్ హర్డ్ ‌ను ఆదేశించింది. తీర్పు అనంతరం అంబర్ కన్నీళ్లు పెట్టుకొని భోరున ఏడ్చేసింది. ఈ తీర్పు నాకు మాత్రమే కాదని.. మహిళా లోకానికే పెద్ద ఎదురు దెబ్బ అని వ్యాఖ్యానించింది. జానీ డెప్ మాత్రం తిరిగి నా జీవితం నాకు దక్కిందని భావోద్వేగానికి లోనయ్యాడు.

First Published:  2 Jun 2022 12:36 AM GMT
Next Story