Telugu Global
National

బీజేపీలో చేరిన హార్దిక్ పటేల్ – మోదీపై పొగడ్తల వర్షం

కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన హార్దిక్ పటేల్ గుజరాత్ ఎన్నికలకు నెలరోజుల ముందు గాంధీనగర్‌లో ఇవ్వాళ్ళ బీజేపీలో చేరారు. గురువారం ఉదయం పార్టీ కార్యాలయం వెలుపల ఆయనను బీజేపీలోకి స్వాగతిస్తూ పోస్టర్లు వేశారు. గురువారం ఉదయం ఒక ట్వీట్‌లో, హార్దిక్ పటేల్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాన‌ని, ప్రధాని మోదీ నాయకత్వంలో ఒక మామూలు సైనికుడిగా పని చేస్తున్నట్లు ప్రకటించారు. ‘నేను ఎప్పుడూ ఏ పదవి కోసం ఎవరి ముందు డిమాండ్‌లు పెట్టలేదు.. […]

బీజేపీలో చేరిన హార్దిక్ పటేల్ – మోదీపై పొగడ్తల వర్షం
X

కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన హార్దిక్ పటేల్ గుజరాత్ ఎన్నికలకు నెలరోజుల ముందు గాంధీనగర్‌లో ఇవ్వాళ్ళ బీజేపీలో చేరారు. గురువారం ఉదయం పార్టీ కార్యాలయం వెలుపల ఆయనను బీజేపీలోకి స్వాగతిస్తూ పోస్టర్లు వేశారు. గురువారం ఉదయం ఒక ట్వీట్‌లో, హార్దిక్ పటేల్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాన‌ని, ప్రధాని మోదీ నాయకత్వంలో ఒక మామూలు సైనికుడిగా పని చేస్తున్నట్లు ప్రకటించారు.

‘నేను ఎప్పుడూ ఏ పదవి కోసం ఎవరి ముందు డిమాండ్‌లు పెట్టలేదు.. పని చేయడానికి బీజేపీలో చేరుతున్నాను.. కాంగ్రెస్‌ పార్టీ ఎలాంటి పని చేయదని నమ్ముతున్నాను.. ఇతర పార్టీల నేతలు కూడా వచ్చి బీజేపీలో చేరాలని కోరుతున్నాను. పీఎం మోదీ యావత్ ప్రపంచానికి గర్వకారణం’’ అని బీజేపీలో అధికారికంగా చేరే ముందు హార్దిక్ పటేల్ అన్నారు.

కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను బీజేపీలో చేరమని కోరేందుకు ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో జరుగుతున్న అభివృద్ధి పనులతో ప్రజలందరూ మింగిలైపోతున్నప్పుడు నేను మాత్రం దూరం ఎందుకు ఉండాలి ? అని ఆయన అన్నారు.

”దేశప్రయోజనం, రాష్ట్రప్రయోజనం, ప్రజాప్రయోజనాలు, సామాజిక ప్రయోజనాల కోసం నేటి నుంచి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నాను. విజయవంతమైన మోదీ నాయకత్వంలో జాతికి సేవ చేయాలనే ఉదాత్తమైన పనిలో చిరు సైనికుడిగా పనిచేస్తాను.’’ అని హార్దిక్ పటేల్ ట్వీట్ చేశారు.

రిజర్వేషన్‌ డిమాండ్‌తో పాటిదార్‌ కమ్యూనిటీ చేస్తున్న ఆందోళనకు నేతృత్వం వహించిన హార్దిక్‌ పటేల్‌ గతంలో బీజేపీని తీవ్రంగా విమర్శించే వ్యక్తిగా గుర్తింపు పొందారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు, ఆయన కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత పార్టీ రాష్ట్ర శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. పార్టీలో తనను పక్కన పెట్టారని, తనకు ఎలాంటి బాధ్యతలు కూడా ఇవ్వలేదని ఆరోపణలు చేస్తూ మే 19న కాంగ్రెస్ కు రాజీనామా చేశారు.

First Published:  2 Jun 2022 5:00 AM GMT
Next Story