Telugu Global
National

కుక్కలా తిప్పించుకున్నారు.. ఫుట్ బాల్ ఆడుకున్నారు..

టీడీపీకి రాజీనామా చేస్తూ ప్రెస్ మీట్ పెట్టిన దివ్యవాణి ఆ పార్టీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీలో తనని తీవ్ర ఇబ్బందులు పెట్టారని, కష్టపడి పనిచేసినా గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రెస్ మీట్ లో ఆమె కన్నీటిపర్యంతం అయ్యారు. అధికారంలేని అధికార ప్రతినిధిగా కొనసాగానని, కనీసం చివరి నిముషంలో తనకు చంద్రబాబు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని అన్నారు. అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి పార్టీకి రిజైన్ చేస్తారన్నప్పుడు పెద్ద నాయకులంతా వెళ్లి మాట్లాడారని, […]

కుక్కలా తిప్పించుకున్నారు.. ఫుట్ బాల్ ఆడుకున్నారు..
X

టీడీపీకి రాజీనామా చేస్తూ ప్రెస్ మీట్ పెట్టిన దివ్యవాణి ఆ పార్టీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీలో తనని తీవ్ర ఇబ్బందులు పెట్టారని, కష్టపడి పనిచేసినా గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రెస్ మీట్ లో ఆమె కన్నీటిపర్యంతం అయ్యారు. అధికారంలేని అధికార ప్రతినిధిగా కొనసాగానని, కనీసం చివరి నిముషంలో తనకు చంద్రబాబు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని అన్నారు.

అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి పార్టీకి రిజైన్ చేస్తారన్నప్పుడు పెద్ద నాయకులంతా వెళ్లి మాట్లాడారని, కానీ తన దగ్గరకూ ఎవరూ రాలేదని అన్నారు దివ్యవాణి. చంద్రబాబు రూమ్ ముందు దాదాపు ఐదు గంటలు కూర్చోబెట్టారని, చివరకు ఆయన వద్దకు వెళ్లి తన బాధ చెప్పుకునే క్రమంలో ఆయన తనను విసుక్కున్నారని చెప్పారు. ఆయన తన తండ్రిలాంటి వారని, అందుకే ఆయన విసుక్కున్నా తనకు బాధ కలగలేదన్నారు.

తప్పంతా టీడీ జనార్దన్ దే..
పార్టీలో టీడీ జనార్దన్ అనే నాయకుడు తనను చాలా ఇబ్బంది పెట్టారని, తనను తొక్కేయాలని చూశారని అన్నారు. ప్రెస్ మీట్లలో తనకు అవకాశం లేకుండా చేశారని, ఒక పథకం ప్రకారం తనను పార్టీకి దూరం పెట్టారని అన్నారు. అయితే ఆ విషయాలన్నీ చంద్రబాబుకి చెప్పుకోవాలని తాను ఆశించానని, కానీ ఆ అవకాశం కూడా లేకుండా చేశారని అన్నారు.

మేకప్పులేసుకుని కూర్చోలేదు..
నారీ భేరీ సదస్సుల పేరుతో తాను ఏ నాయకుల దగ్గర డబ్బులు వసూలు చేయలేదని, సభలో మేకప్పులు వేసుకుని కూర్చోలేదని వంగలపూడి అనితపై సెటైర్లు వేశారు దివ్యవాణి. పార్టీలో తనని కుక్కలా తిప్పుకున్నారని, కనీసం గౌరవం కూడా ఇచ్చేవారు కాదన్నారు. పార్టీకోసం తన సొంత డబ్బుని ఖర్చు చేశానని, ఏరోజూ పార్టీ తరపున డబ్బులు తీసుకోలేదన్నారు. పార్టీకీ రాజీనామా చేస్తున్నట్టు ఆమె ఓ లేఖ విడుదల చేశారు. కొందరు ఇడియట్స్‌ జర్నలిజం పేరుతో తనపై తప్పుడు రాతలు రాశారని విమర్శించారు దివ్యవాణి.

First Published:  2 Jun 2022 1:09 AM GMT
Next Story