Telugu Global
NEWS

యూటర్న్ కే యూటర్న్.. టీడీపీకి దివ్యవాణి మళ్లీ రాజీనామా

టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ట్వీట్ చేసి వెంటనే డిలీట్ చేసి పెద్ద కలకలం రేపిన దివ్యవాణి.. తాజాగా మరోసారి సెల్ఫీ వీడియో ద్వారా టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబుతో ఆమె భేటీ అయిన తర్వాత ఈ వీడియో విడుదల చేయడం గమనార్హం. బాబుతో భేటీలో ఏం జరిగిందనేది మీడియా సమావేశంలో సంపూర్ణంగా వివరిస్తానని చెప్పారు దివ్యవాణి. వారి మర్యాదలు తట్టుకోలేకపోయాను.. మహానాడులో తనకు అవమానం జరిగిందన్న స్టేట్ మెంట్లు, ఆ తర్వాత రాజీనామా వార్తలతో […]

యూటర్న్ కే యూటర్న్.. టీడీపీకి దివ్యవాణి మళ్లీ రాజీనామా
X

టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ట్వీట్ చేసి వెంటనే డిలీట్ చేసి పెద్ద కలకలం రేపిన దివ్యవాణి.. తాజాగా మరోసారి సెల్ఫీ వీడియో ద్వారా టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబుతో ఆమె భేటీ అయిన తర్వాత ఈ వీడియో విడుదల చేయడం గమనార్హం. బాబుతో భేటీలో ఏం జరిగిందనేది మీడియా సమావేశంలో సంపూర్ణంగా వివరిస్తానని చెప్పారు దివ్యవాణి.

వారి మర్యాదలు తట్టుకోలేకపోయాను..
మహానాడులో తనకు అవమానం జరిగిందన్న స్టేట్ మెంట్లు, ఆ తర్వాత రాజీనామా వార్తలతో దివ్యవాణి ఇటీవల కలకరం రేపిన సంగతి తెలిసిందే. అయితే వెంటనే తాను చేసిన ట్వీట్ ని డిలీట్ చేసి, తాను పార్టీలోనే ఉంటున్నట్టు ఆమె ప్రకటించారు. ఈ వ్యవహారంపై ఆమె పార్టీ అధినేత చంద్రబాబుతో తాజాగా భేటీ అయ్యారు. అంతకు ముందు మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి హాజరైన ఆమె, ఆ తర్వాత బాబుతో మంతనాలు జరిపారు. బయటకొచ్చిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడలేకపోయానంటూ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. లోపల మర్యాదలు తట్టుకోలేకపోయానని, అక్కడ యదార్థ స్థితిని భరించలేకపోయానంటూ సెటైర్లు వేశారు దివ్యవాణి.

లోపల ఏం జరిగింది..?
టీడీపీ అనుకూల మీడియా కథనాలు మాత్రం దివ్యవాణి రాజకీయ భవిష్యత్తుపై చంద్రబాబు భరోసా ఇచ్చారని, బుజ్జగించారని, ఆమె అందుకు అంగీకరించారని చెబుతున్నాయి. అయితే దానికి పూర్తి విరుద్ధంగా ఆమె సెల్ఫీ వీడియోలో తనకు జరిగిన మర్యాదల గురించి ప్రస్తావించారు. టీడీపీకి తాను రాజీనామా చేస్తున్నానని, తనను ఇంతకాలం ఆదరించిన పార్టీకి దేవుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారామె. ఇంతకీ లోపల ఎం జరిగింది..? చంద్రబాబు హామీ ఇచ్చారా, అవసరం లేదు పొమ్మన్నారా అనేది మాత్రం ఈరోజు దివ్యవాణి ప్రెస్ మీట్ లో బయటపెట్టే అవకాశాలున్నాయి.

First Published:  1 Jun 2022 9:02 PM GMT
Next Story