Telugu Global
NEWS

దేశంలోనే తెలంగాణ నెంబర్‌ వన్‌- కేసీఆర్

దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్తోందన్నారు సీఎం కేసీఆర్‌. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ప్రసంగించిన కేసీఆర్.. తమ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. సమైక్యరాష్ట్రంలో ఆనాటి పాలకుల వివక్ష పూరిత ఆలోచనల వల్ల సాగునీటి విషయంలో తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందన్నారు. కరెంట్‌ కూడా ఉండేది కాదన్నారు. ఉద్యమ సమయంలో తాను పర్యటనలు చేసినప్పుడు రైతుల పరిస్థితి చూసి చలించిపోయానని.. అందుకే సొంత రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలకు శ్రీకారం చుట్టామన్నారు. 24 గంటల […]

దేశంలోనే తెలంగాణ నెంబర్‌ వన్‌- కేసీఆర్
X

దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్తోందన్నారు సీఎం కేసీఆర్‌. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ప్రసంగించిన కేసీఆర్.. తమ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. సమైక్యరాష్ట్రంలో ఆనాటి పాలకుల వివక్ష పూరిత ఆలోచనల వల్ల సాగునీటి విషయంలో తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందన్నారు. కరెంట్‌ కూడా ఉండేది కాదన్నారు. ఉద్యమ సమయంలో తాను పర్యటనలు చేసినప్పుడు రైతుల పరిస్థితి చూసి చలించిపోయానని.. అందుకే సొంత రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలకు శ్రీకారం చుట్టామన్నారు.

24 గంటల ఉచిత విద్యుత్, మిషన్ కాకతీయ, రుణమాఫి,రైతు వేదికలు, రైతు బంధు, రైతు బీమా, నీటితీరువ బకాయిలు రద్దు, ప్రాజెక్టుల ద్వారా సాగునీటి సరఫరా వంటి కార్యక్రమాలతో వ్యవసాయాన్ని నేడు పండుగ చేశామన్నారు. 50వేల కోట్ల రూపాయలను రైతులకు పెట్టుబడిగా అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. గొలుసుకట్టు చెరువులు సమైక్యాంధ్ర పాలనలో ధ్వంసమయ్యాయన్నారు. నేడు వేసవిలో కూడా చెరువులు నీటితో కళకళలాడుతున్నాయన్నారు. విద్యుత్ రంగంలో స్వయం సంవృద్ధి సాధించామన్నారు.

నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యను అధిగమించామన్నారు. ప్రస్తుతం జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం అధికంగా ఉందన్నారు. కోటి ఎకరాలకు సాగునీటిని అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. దళిత బంధు పథకాన్ని సామాజిక విప్లవంగా చేపట్టామన్నారు. ఈ పథకం కింద ప్రతి దళిత కుటుంబానికి 10లక్షల రూపాయలు అందజేస్తోందన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన‌ 2616 మద్యం షాపుల్లో 261 షాపులను దళితులకు కేటాయించామని గుర్తు చేశారు. ఈ ఏడాది దళిత బంధు కోసం బడ్జెట్‌లో 17,700 కోట్లు కేటాయించామన్నారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఆస్పత్రుల్లో రోగుల సహాయకులకు 5 రూపాయలకే భోజనం అందజేస్తున్నామన్నారు. హైదరాబాద్‌ బస్తీల్లోని ప్రజలకు వైద్యాన్ని చేరువ చేసేందుకు 350 బస్తీ దవాఖానాలను మంజూరు చేశామన్నారు. గ్రామాల్లోనూ ఇలాంటి సేవల కోసం పల్లె దవాఖానాలను ప్రభుత్వం నిర్మిస్తోందన్నారు. ప్రభుత్వ చర్యల వల్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని… రాష్ట్రంలో మాతాశిశుమరణాల సంఖ్య తగ్గిందన్నారు. కేసీఆర్‌ కిట్‌ ద్వారా ఇప్పటి వరకు 13 లక్షల మందికి లబ్ది చేకూరిందన్నారు.

అల్వాల్, ఎల్‌బీనగర్‌, సనత్‌ నగర్‌, గచ్చిబౌలిలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తున్నామన్నారు. ఒక్కో ఆస్పత్రిలో వెయ్యి పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు. నిమ్స్‌ ఆస్పత్రిలో మరో రెండువేల పడకలు పెంచాలని నిర్ణయించామన్నారు. వరంగల్‌లో హెల్త్ సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. వరంగల్ నగరంలో అధునాతన వసతులతో 2వేల పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు మొదలైందన్నారు. తెలంగాణలో గతంలో మూడు మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉండేవని..ఇకపై జిల్లాకు ఒకటి ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. రెండేళ్లలో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు.

975 గురుకుల విద్యాలయాలు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. గడిచిన ఎనిమిదేళ్లలో లక్షా 33వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ప్రస్తుతం ఒకేసారి 91వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామన్నారు. 11వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 2లక్షల 24వేల ఉద్యోగాల భర్తీతో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రభుత్వ ప్రతి నిర్ణయంలోనూ మానవీయ కోణమే కనిపిస్తుందన్నారు.

రాష్ట్రంలో అవకాశం ఉన్న ప్రతి చోట చేపల పంపకం చేపట్టామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో చేపల పెంపకానికి అవకాశాలు పెరిగాయన్నారు. వివిధ జలాశయాల్లో ప్రభుత్వమే చేప పిల్లలను ఉచితంగా వదులుతోందన్నారు. గొర్రెల పెంపకంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. మద్యం దుకాణాల కేటాయింపులో గౌడ కులస్తులకు 15 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తున్నామని చెప్పారు. నీరాను సాప్ట్‌ డ్రింక్‌గా పంపిణీ చేసే విధానం తెచ్చామన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలను సమంగా ఆదరిస్తోందన్నారు. గతంలో తెలంగాణలో 12 మాత్రమే మైనార్టీ గురుకులాలు ఉండగా… కొత్తగా 192 మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు.

అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్శించడంలో తెలంగాణ నెంబర్‌ వన్ స్థానంలో ఉందన్నారు. 15వందలకుపైగా ఐటీ పరిశ్రమలు తెలంగాణలో ఏర్పాటయ్యాయన్నారు. తెలంగాణ ఐటీ రంగం ఎగుమతుల విలువ లక్షా 83వేల కోట్లుగా ఉందన్నారు.ఈ ఎనిమిదేళ్లలో నూతనంగా ఐటీ రంగంలో 7 లక్షల 78 వేల ఉద్యోగాల కల్పన జరిగిందన్నారు. పారిశ్రామిక, ఐటీ రంగాల్లో కలిపి 24 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయన్నారు.

తెలంగాణ సజల, సుజల,సస్యశ్యామల రాష్ట్రంగా మారిందన్నారు. 7లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఏడు అంతస్తులతో రాష్ట్ర సచివాలయం పూర్తవుతోందన్నారు. దేశంలో అత్యధిక స్థాయిలో జీతాలు పొందుతున్న ఉద్యోగులు తెలంగాణ వారేనన్నారు కేసీఆర్.

First Published:  2 Jun 2022 2:18 AM GMT
Next Story