Telugu Global
NEWS

అమలాపురంలో వాట్సప్ గ్రూపులన్నీ ఖాళీ.. హడలిపోతున్న అడ్మిన్లు

అమలాపురం అల్లర్ల వెనక ముఖ్యపాత్ర సోషల్ మీడియాదేనని గుర్తించారు పోలీసులు. వాట్సప్ లో మెసేజ్ లు ఫార్వర్డ్ చేసుకోవడం వల్లే అందరూ ఒకేసారి ఒకేచోటకు చేరుకున్నారని, ఆ తర్వాత విధ్వంసం సృష్టించారని చెప్పారు. ఒకచోట జరిగిన ఆందోళనలను చూసి ప్రేరేపితమై మరోచోట కొంతమంది అల్లర్లు చేశారని, దానికి కారణం కూడా సోషల్ మీడియా పోస్టింగ్ లేనని తేల్చారు. వాట్సప్ వీడియోలను ట్రాక్ చేస్తూ.. దుర్ఘటనలు జరిగిన సందర్భంలో ఎవరెవరు ఆ సీన్ లో ఉన్నారు, వాటికి కారకులు […]

అమలాపురంలో వాట్సప్ గ్రూపులన్నీ ఖాళీ.. హడలిపోతున్న అడ్మిన్లు
X

అమలాపురం అల్లర్ల వెనక ముఖ్యపాత్ర సోషల్ మీడియాదేనని గుర్తించారు పోలీసులు. వాట్సప్ లో మెసేజ్ లు ఫార్వర్డ్ చేసుకోవడం వల్లే అందరూ ఒకేసారి ఒకేచోటకు చేరుకున్నారని, ఆ తర్వాత విధ్వంసం సృష్టించారని చెప్పారు. ఒకచోట జరిగిన ఆందోళనలను చూసి ప్రేరేపితమై మరోచోట కొంతమంది అల్లర్లు చేశారని, దానికి కారణం కూడా సోషల్ మీడియా పోస్టింగ్ లేనని తేల్చారు. వాట్సప్ వీడియోలను ట్రాక్ చేస్తూ.. దుర్ఘటనలు జరిగిన సందర్భంలో ఎవరెవరు ఆ సీన్ లో ఉన్నారు, వాటికి కారకులు ఎవరనే విషయాన్ని పోలీసులు నిర్థారించారు. టెక్నాలజీ ఆధారంగా మొత్తం 71మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఎక్కువమంది విద్యార్థులు, చదువు పూర్తై ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నవారు ఉన్నారు.

వాట్సప్ గ్రూపులు ఖాళీ..
వాట్సప్ గ్రూపుల వారీగా అల్లర్లు చేసినవారిని పోలీసులు గుర్తిస్తున్నారనే సమాచారంతో చాలా వరకు కమ్యూనిటీ బేస్డ్ వాట్సప్ గ్రూపులు ఖాళీ అయ్యాయి. అడ్మిన్లు హడలిపోయి గ్రూపుల్ని డిలీట్ చేశారు. సున్నితమైన విషయాలు, ప్రజలను రెచ్చగొట్టే పోస్టింగ్‌ లు, ఒక వర్గాన్ని, ఒక నేతను కించపరిచేలా పోస్టింగ్‌ లు పెట్టేవారిపై కఠిన చర్యలు ఉంటాయని జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి హెచ్చరించారు. అలాంటి పోస్టులు పెట్టేవారిపైనే కాకుండా ఆ గ్రూపుల అడ్మిన్లపైనా కేసులు నమోదు చేస్తామన్నారాయన. ఎవరైనా అభ్యంతరకర పోస్ట్ లు పెడితే ఆ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకుని రావాలని సూచించారు.

అమలాపురం ఘటనలకు సంబంధించి మొత్తం 7 ఎఫ్‌ఐఆర్‌ లు నమోదు చేసినట్టు తెలిపారు ఎస్పీ సుబ్బారెడ్డి. అందులో 4 ఎఫ్‌ఐఆర్‌లకు సంబంధించి మొత్తం 71 మందిని అరెస్ట్‌ చేశామన్నారు. నిందితులను పూర్తి ఆధారాలతో గుర్తించే అరెస్ట్‌ చేశామని, వారంతా రిమాండ్ లో ఉన్నారని చెప్పారు. అమలాపురంలో 144 సెక్షన్, సెక్షన్‌ 30 ఇంకా అమలులోనే ఉన్నాయని స్పష్టం చేశారు.

ఉద్యోగాలు రావు జాగ్రత్త..
అల్లర్లు చేసి కేసుల్లో ఇరుక్కుంటే భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు రావు జాగ్రత్త అంటూ హెచ్చరించారు కోనసీమ ఎస్పీ. భవిష్యత్‌ లో ఈ కేసుల్లో ఉన్న నిందితులకు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు వస్తే పోలీసు వెరిఫికేషన్‌ లో అనర్హులవుతారని చెప్పారు. విదేశాలకు వెళ్లేందుకు పాస్‌ పోర్ట్‌ లు కూడా మంజూరు కావని స్పష్టం చేశారు.

ఇంటర్నెట్ పై కొనసాగుతున్న ఆంక్షలు..
సోషల్‌ మీడియాలో పుకార్లు వ్యాపించకుండా ఇంటర్నెట్‌ సేవలను మరో 24 గంటలు నిలిపివేస్తున్నట్టు తెలిపారు కోనసీమ ఎస్పీ సుబ్బారెడ్డి. ప్రస్తుతం జిల్లాలోని 16 మండలాలకు గాను 3 మండలాలకు మినహాయింపు ఇచ్చారు. సఖినేటిపల్లి, మలికిపురం, ఐ.పోలవరం మండలాల్లో ఇంటర్నెట్‌ సేవలు పునరుద్ధరించారు. మిగిలిన మండలాల్లో ఇంటర్నెట్ పై నిషేధం ఉంది.

First Published:  31 May 2022 9:34 PM GMT
Next Story