Telugu Global
International

మూడు రోజులుగా లండన్ ఎయిర్‌పోర్టులో భారతీయుల పడిగాపులు.. కారణం ఇదే.!

అమెరికా నుంచి ఇండియాకు రావడానికి 15 నుంచి 16 గంటలు పడుతుంది. అదే బ్రేక్ జర్నీ అయితే మరో రెండు గంటల సమయం అదనంగా పట్టవచ్చు. అయితే అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఒక విమానంలో ఇండియా వస్తున్న 260 మంది ప్రయాణికులు మూడు రోజులుగా లండన్‌లోని హీత్రూ ఎయిర్ పోర్టులో పడిగాపులు కాస్తున్నారు. అమెరికా నుంచి బయలుదేరిన తర్వాత ఒక ప్రయాణికులు అనారోగ్యానికి గురి కావడంతో విమానాన్ని దారి మళ్లించి అత్యవసరంగా లండన్ ఎయిర్‌పోర్టులో దించారు. వీరందరినీ […]

మూడు రోజులుగా లండన్ ఎయిర్‌పోర్టులో భారతీయుల పడిగాపులు.. కారణం ఇదే.!
X

అమెరికా నుంచి ఇండియాకు రావడానికి 15 నుంచి 16 గంటలు పడుతుంది. అదే బ్రేక్ జర్నీ అయితే మరో రెండు గంటల సమయం అదనంగా పట్టవచ్చు. అయితే అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఒక విమానంలో ఇండియా వస్తున్న 260 మంది ప్రయాణికులు మూడు రోజులుగా లండన్‌లోని హీత్రూ ఎయిర్ పోర్టులో పడిగాపులు కాస్తున్నారు. అమెరికా నుంచి బయలుదేరిన తర్వాత ఒక ప్రయాణికులు అనారోగ్యానికి గురి కావడంతో విమానాన్ని దారి మళ్లించి అత్యవసరంగా లండన్ ఎయిర్‌పోర్టులో దించారు.

వీరందరినీ లండన్ నుంచి ఢిల్లీకి పంపించాల్సిన బాధ్యత అమెరికన్ ఎయిర్‌లైన్స్ దే. అయితే లండన్ నుంచి ఢిల్లీకి అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం నడపడానికి అనుమతి లేదు. దీంతో ప్రయాణికులందరికీ రెండు రోజుల బ్రిటన్ వీసాలు ఇప్పించి హోటల్స్‌లో ఉంచింది. ప్రయాణికుల్లో వృద్దులతో పాటు గర్బిణిలు కూడా ఉన్నారు. మూడు రోజుల నుంచి అక్కడే ఉండటంతోవాళ్లందరూ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రయాణికులందరినీ న్యూ ఢిల్లీ తీసుకొని పోతామని సదరు ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. కానీ సాద్యపడలేదు. డీజీసీఏ అనుమతి ఇవ్వకపోవడంతోనే మంగళవారం సర్వీసు నడపలేదని తెలుస్తున్నది. కాగా, తాజాగా డీజీసీఏ అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం ఢిల్లీలో దిగడానికి ప్రత్యేక అనుమతి ఇచ్చింది. దీంతో వీళ్లందరూ బుధవారం న్యూఢిల్లీ చేరుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

First Published:  1 Jun 2022 1:15 AM GMT
Next Story