Telugu Global
NEWS

8 ఏండ్ల పసి కూన.. దేశంలోనే అగ్రభాగాన..

ఈ జూన్ 2వ తేదీకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్ళు పూర్తవుతుంది. ఈ ఎనిమిదేళ్ళలో తెలంగాణ సాధించిన అభివృద్ది ఏంటి ? తెలంగాణ రాష్ట్రం రాక ముందు తెలంగాణ వ్యతిరేకులు ప్రచారం చేసినట్టు. తెలంగాణ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందా ? కరెంట్ లేక చీకటి రాజ్యమై పోయిందా ? పెట్టుబడులు మొత్తం క్యూ కట్టి తెలంగాణ నుంచి వెళ్ళిపోయాయా ? అసలు తెలంగాణ వాళ్ళకు పరిపాలనే రాదన్న తెలంగాణ వ్యతిరేకుల మాటలు నిజమయ్యాయా ? లేక […]

8 ఏండ్ల పసి కూన.. దేశంలోనే అగ్రభాగాన..
X

ఈ జూన్ 2వ తేదీకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్ళు పూర్తవుతుంది. ఈ ఎనిమిదేళ్ళలో తెలంగాణ సాధించిన అభివృద్ది ఏంటి ? తెలంగాణ రాష్ట్రం రాక ముందు తెలంగాణ వ్యతిరేకులు ప్రచారం చేసినట్టు. తెలంగాణ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందా ? కరెంట్ లేక చీకటి రాజ్యమై పోయిందా ? పెట్టుబడులు మొత్తం క్యూ కట్టి తెలంగాణ నుంచి వెళ్ళిపోయాయా ? అసలు తెలంగాణ వాళ్ళకు పరిపాలనే రాదన్న తెలంగాణ వ్యతిరేకుల మాటలు నిజమయ్యాయా ? లేక తెలంగాణ ఏర్పడితే రాష్ట్ర పునర్నిర్మాణం ఎవరూ ఊహించని స్థాయిలో జరుగుతుందని,తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుకుంటామని, నీటి పారుదల, ఉద్యోగ కల్పనలో అద్భుత ప్రగతి సాధిస్తామని ఆనాడే చెప్పిన కేసీఆర్ మాటలు నిజమయ్యాయా ?

ఈ ప్రశ్నలన్నింటికి నేటి తెలంగాణ రాష్ట్రంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరూ జవాబు చెప్పగలరు. ఎవ్వరూ ఊహించని కాళేశ్వరం ప్రాజెక్టు, వ్యతిరేకుల కన్నుకుట్టే విధంగా కనీస కోతలు లేని 24 గంటలు కరెంటు. ఉద్యోగ కల్పన, పోటెత్తుతున్న పెట్టుబడులు…. వ్యవసాయం, విద్యుత్తు, పరిశ్రమలు, ఐటీ, విద్యా, వైద్యం…ఇలా అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రభాగాన నిల్చిన 8 ఏళ్ళ తెలంగాణ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అన్నింటికన్నా ముఖ్యమైన, నాశనమై పోతుందని వ్యతిరేకులు శాపనార్ధాలు పెట్టిన ఆర్థిక రంగం గురించి ఒక్కసారి చూద్దాం….

2014 జూన్ 2 న తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అనేక అడ్డంకులను అధిగమిస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టింది. ఒక కొత్త రాష్ట్రం, 8 ఏళ్ళ పసి కూన దేశంలోనే అగ్రభాగాన నిలిచింది. ప్రతి రాష్ట్రం తెలంగాణతో పోటీపడే విధంగా ముందుకు సాగుతోంది.

2021-22లో రాష్ట్రం 11,54,860 కోట్ల రూపాయల స్థూల దేశీయోత్పత్తి (GSDP) నమోదు చేసింది, ఫిబ్రవరి, 2022 నాటికి ప్రస్తుత ధరల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 19.1 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ ప్రక్రియలో రాష్ట్ర తలసరి ఆదాయం ఫిబ్రవరి, 2022 చివరి నాటికి గత ఆర్థిక సంవత్సరం కంటే 18.78 శాతం అధికంగా రూ. 2,78,833గా నిర్ధారించబడింది.

తెలంగాణ తలసరి ఆదాయం గడిచిన ఏడేళ్లలో 125 శాతం పెరిగింది 2014-15లో రూ. 1,24,104 ఉన్న ఆదాయం 2021-22 నాటికి రూ. 2,78,833కి చేరింది. ఇక‌ స్థూల దేశీయోత్పత్తి (GSDP) 130 శాతం వృద్ధిని సాధించింది. 2014-15లో రూ. 5 లక్షల కోట్ల నుంచి 2021-22 నాటికి రూ. 11.54 లక్షల కోట్లకు చేరింది.
కేంద్ర స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ అందించిన 2021-22 జాతీయ ఆదాయం యొక్క రెండవ ముందస్తు అంచనాలు, 2021-22 స్థూల దేశీయోత్పత్తి యొక్క త్రైమాసిక అంచనాల ప్రకారం….

తలసరి ఆదాయంలో ప్రధాన రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణ తలసరి ఆదాయం 2,78,833 రూపాయలు కాగా తమిళనాడు2,56,935 రూపాయలు , కేరళ 2,12,059 రూపాయలు, మధ్యప్రదేశ్ 1,24,685 రూపాయలు, ఉత్తరప్రదేశ్ 71,472 రూపాయలుగా ఉన్నాయి.
గత ఏడాది కంటే స్థూల దేశీయోత్పత్తి(GSDP) వృద్ధి పరంగా, చిన్న తేడాతో తెలంగాణ అగ్ర‌ స్థానం కోల్పోయింది. గత ఏడాది కంటే మధ్యప్రదేశ్ జిఎస్‌డిపి వృద్ధి రేటు 19.74 శాతం నమోదు చేయగా, తెలంగాణ 19.1 శాతం వృద్ధిని సాధించింది. ఈ ఏడాది తెలంగాణ స్థూల దేశీయోత్పత్తి GSDP 11.54 లక్షల కోట్ల రూపాయలుగా నమోదు చేసుకుంది.

మచ్చుకు కొన్ని రంగాల అభివృద్ది చూస్తే….ఉత్పత్తి రంగం గత ఏడేండ్లలో ఏకంగా 72 శాతం వృద్ధి కనబరిచింది. నిర్మాణ రంగం సైతం జీఎస్డీపీలో మూడేండ్లుగా ఏటా రూ.37 వేల కోట్ల వాటాను నమోదు చేస్తున్నది. మైనింగ్‌, క్వారీయింగ్‌ రంగం వాటా రెట్టింపయ్యింది.

జీఎస్డీపీలో వ్యవసాయ రంగ ఉత్పత్తుల విలువ ఏడేండ్లలో 142 శాతం పెరిగింది. తెలంగాణలో పంటలు దాదాపు రెట్టింపయ్యాయి. ముఖ్యంగా వరి పంట ఐదు రెట్లు, పత్తి మూడు రెట్లు పెరిగింది. పత్తి సాగు విస్తీర్ణంలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నది.

ఐటీ ఎగుమతుల్లో 120% శాతం వృద్ధి నమోదైంది. కొవిడ్‌ సమయంలోనూ రాష్ట్ర ఐటీ ఎగుమతుల్లో అనూహ్య వృద్ది కనిపించడం విశేషం. ఐటీ రంగం సగటున ఏటా 14% వృద్ధిని నమోదు చేసింది.

ఇలా ఒకటేమిటి అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ది పథాన దూసుకపోతున్నది. అందులోనూ కేంద్రంలో పరిపాలన చేస్తున్న బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచీ తెలంగాణ రాష్ట్రానికి కనీసం కూడా సహాయం చేయడం లేదు. వివక్ష చూపిస్తున్నది. బీజేపీ పాలిత రాష్ట్రాలను ఒకరకంగా తెలంగాణను మరో రకంగా చూస్తూ సవితి తల్లి ప్రేమ చూపిస్తున్నది. అయినప్పటికీ తన స్వంత కాళ్ళ మీద నిలబడ్డ తెలంగాణ ఎవ్వరి మీద ఆధారపడకుండా ముందుకు సాగుతున్నది. ఈ మధ్య అన్ని రాష్ట్రాలు విద్యుత్తు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉంటే తెలంగాణ మాత్రం 24 గంటలు కరెంట్ ఇచ్చి తన సత్తా చాటింది. ఈ ఎనిమిదేళ్ళ బాలుడు బంగారు తెలంగాణను సాధించే దిశగా ముందుకు సాగుతున్న ఆజానుబావహుడు…అనంత బలసంపన్నుడు.

First Published:  1 Jun 2022 5:45 AM GMT
Next Story