Telugu Global
MOVIE UPDATES

మేజర్ సినిమా చూసిన సందీప్ తల్లిదండ్రులు

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కింది మేజర్ సినిమా. అడివి శేష్ హీరోగా నటించిన ఈ సినిమాకు సంబంధించి ఆల్రెడీ ప్రీమియర్స్ పడ్డాయి. రేపు హైదరాబాద్ లో ప్రీమియర్ ఉంది. సినిమాపై బజ్ బాగానే ఉంది. ఇంతకీ ఈ సినిమాను సందీప్ తల్లిదండ్రులు చూశారా? వాళ్ల రియాక్షన్ ఏంటి? వీటిపై దర్శకుడు శశికిరణ్ తిక్క స్పందించాడు. “నిన్ననే బెంగుళూరులో సందీప్ తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు సినిమా చూశారు. మూడేళ్ళుగా మేం వారిని సంప్రదిస్తూనే ఉన్నాం. […]

sandeep-parents-watched-major
X

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కింది మేజర్ సినిమా. అడివి శేష్ హీరోగా నటించిన ఈ సినిమాకు సంబంధించి ఆల్రెడీ ప్రీమియర్స్ పడ్డాయి. రేపు హైదరాబాద్ లో ప్రీమియర్ ఉంది. సినిమాపై బజ్ బాగానే ఉంది. ఇంతకీ ఈ సినిమాను సందీప్ తల్లిదండ్రులు చూశారా? వాళ్ల రియాక్షన్ ఏంటి? వీటిపై దర్శకుడు శశికిరణ్ తిక్క స్పందించాడు.

“నిన్ననే బెంగుళూరులో సందీప్ తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు సినిమా చూశారు. మూడేళ్ళుగా మేం వారిని సంప్రదిస్తూనే ఉన్నాం. షూట్ లో మేజర్ రియాక్షన్ ఫలానా సన్నివేశంలో ఎలా వుంటుందో అని అడిగి మరి చేసేవాళ్ళం. వారి అమ్మగారు తగువిధంగా సూచనలు చేసేవారు. అందుకే ఇంత ఔట్ పుట్ తీసుకున్న వీరు ఎలా తీశారనే ఆసక్తి వారికీ వుంటుంది. వారు చూడగానే మెచ్చుకున్నారు.”

ఇలా సందీప్ తల్లిదండ్రుల రియాక్షన్ ను బయటపెట్టాడు శశికిరణ్ తిక్క. సినిమాను ముందుగానే ప్రీమియర్స్ వేయడం ద్వారా పైరసీ జరుగుతుందనే భయం తమకు కూడా ఉందని, అందుకే సెల్ ఫోన్లతో థియేటర్లలోకి ఎవ్వర్నీ అనుమతించలేదని తెలిపాడు. పైగా కేరళలో పైరసీ ఎక్కువ కాబట్టి, అక్కడ అసలు ప్రీమియర్ వేయలేదని కూడా తెలిపాడు.

3వ తేదీన మేజర్ సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమా కోసం నిర్మాతలు టికెట్ రేట్లు కూడా తగ్గించారు. రేపు హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీమియర్ ఉంది.

First Published:  1 Jun 2022 7:56 AM GMT
Next Story