Telugu Global
MOVIE UPDATES

రామ్, బోయపాటి సినిమా మొదలైంది

టాలీవుడ్ లో ఇదొక ఇంట్రెస్టింగ్ కాంబినేషన్. వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుందో చూడాలని చాలామంది ప్రేక్షకులకు ఉంది. ఇప్పుడా టైమ్ రానే వచ్చింది. రామ్-బోయపాటి సినిమా లాంఛ్ అయింది. ఈరోజు పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా.. రామ్ కు కెరీర్ లో 20వ చిత్రం. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్‌లో పాన్ ఇండియా సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ‘అఖండ’ […]

ram-boyapati-movie-launch
X

టాలీవుడ్ లో ఇదొక ఇంట్రెస్టింగ్ కాంబినేషన్. వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుందో చూడాలని చాలామంది ప్రేక్షకులకు ఉంది. ఇప్పుడా టైమ్ రానే వచ్చింది. రామ్-బోయపాటి సినిమా లాంఛ్ అయింది. ఈరోజు పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా.. రామ్ కు కెరీర్ లో 20వ చిత్రం.

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్‌లో పాన్ ఇండియా సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ‘అఖండ’ తర్వాత బోయపాటి చేస్తున్న చిత్రమిది. దర్శకుడిగా ఆయన 10వ సినిమా. హీరో రామ్ 20వ సినిమా ఇది. ‘ది వారియర్’ తర్వాత రామ్ నటిస్తున్న చిత్రం కూడా ఇదే.

హీరో రామ్ మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ క్లాప్ ఇచ్చారు. చిత్ర దర్శకులు బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో దర్శకులు లింగుస్వామి, వెంకట్ ప్రభు స్క్రిప్ట్ అందజేశారు.

భారీ బడ్జెట్ తో, హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమా రాబోతోందట. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున సినిమా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. సంగీత దర్శకుడు, హీరోయిన్ వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తారు.

ALSO READ : మేజర్ సినిమా మహేష్ బాబు చేసుంటే..?

First Published:  1 Jun 2022 8:05 AM GMT
Next Story