Telugu Global
MOVIE UPDATES

‘అందాల రాశి’ వచ్చేసింది

ద‌ర్శ‌కుడు మారుతి చేస్తున్న తాజా చిత్రం పక్కా కమర్షియల్. అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ క‌లిసి బ‌న్నీ వాసు నిర్మాత‌గా ఈ సినిమా వస్తోంది. గోపీచంద్ ఇందులో హీరో. ఇప్పటికే విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన టైటిల్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా […]

‘అందాల రాశి’ వచ్చేసింది
X

ద‌ర్శ‌కుడు మారుతి చేస్తున్న తాజా చిత్రం పక్కా కమర్షియల్. అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ క‌లిసి బ‌న్నీ వాసు నిర్మాత‌గా ఈ సినిమా వస్తోంది. గోపీచంద్ ఇందులో హీరో.

ఇప్పటికే విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన టైటిల్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. జులై 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

తాజాగా ఈ సినిమాలోని అందాల రాశీ పాట విడుదలైంది. దీనికి మంచి స్పందన వస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అందాల రాశి.. మేకప్ వేసి నా కోసం వచ్చావే అనే లిరిక్స్ తో సాగే ఈ పాటను కృష్ణకాంత్ రాయగా, జేక్స్ బిజాయ్ కంపోజ్ చేశాడు. సాయిచరణ్, రమ్య బెహర అందంగా ఆలపించారు. మధ్యమధ్యలో వచ్చిన సాంగ్ బిట్స్ కలర్ ఫుల్ గా ఉన్నాయి.

గోపీచంద్ క్యారెక్టర్‌ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఈ సినిమాపై గోపీచంద్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. తన కెరీర్ కు ఈ మూవీ టర్నింగ్ పాయింట్ అవుతుందని చెబుతున్నాడు.

మారుతి డైరక్ట్ చేసిన ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.-

ALSO READ : మరో సినిమాకు టికెట్ రేట్లు తగ్గాయి

First Published:  1 Jun 2022 8:00 AM GMT
Next Story