Telugu Global
NEWS

దేశానికి మరో షాక్ ఇవ్వబోతున్న మోడీ

బీజేపీ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నది. డీమానిటైజేషన్ దగ్గర నుంచి ధరల పెరుగుదల వరకు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఇప్పుడు మరోసారి దేశ ప్రజలకు షాకిచ్చే నిర్ణయం మోడీ ప్రభుత్వం తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. త్వరలో జనాభా నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ హింట్ ఇచ్చారు. చత్తీస్‌గడ్ రాజధాని రాయ్‌పూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోటిక్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్‌‌లో జరిగిన ‘గరీబ్ కల్యాణ్ […]

modi-is-going-to-give-another-shock-to-the-country
X

బీజేపీ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నది. డీమానిటైజేషన్ దగ్గర నుంచి ధరల పెరుగుదల వరకు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఇప్పుడు మరోసారి దేశ ప్రజలకు షాకిచ్చే నిర్ణయం మోడీ ప్రభుత్వం తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. త్వరలో జనాభా నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ హింట్ ఇచ్చారు. చత్తీస్‌గడ్ రాజధాని రాయ్‌పూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోటిక్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్‌‌లో జరిగిన ‘గరీబ్ కల్యాణ్ సమ్మేళన్’లో ఆయన పాల్గొన్నారు.

దేశంలో పెరుగుతున్న జనాబాను నియంత్రించడానికి త్వరలోనే పాపులేషన్ కంట్రోల్ యాక్ట్‌ను తీసుకొని రానున్నట్లు ఆయన విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇలాంటి గొప్ప, పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి కొంత సమయం పడుతుంది. కానీ ఆ నిర్ణయం మాత్రం తప్పకుండా మిగతా వాటిలాగే వెలువడుతున్నదని చెప్పుకొచ్చారు.

జనాభా నియంత్రణ చట్టం తీసుకొని వస్తారని గతంలో వార్తలు వచ్చినప్పుడు పలు వర్గాలు వ్యతిరేకించాయి. ముఖ్యంగా జనాభా నియంత్రణ చేయడం తమ మత పద్దతి కాదని పేర్కొనే ఒక వర్గం ఈ బిల్లును వ్యతిరేకిస్తోంది. తమ వర్గమే లక్ష్యంగా బీజేపీ ఈ బిల్లును తీసుకొని వస్తోందని ఆరోపించడంతో అప్పట్లో పార్టీ వెనకడుగు వేసింది.

అయితే ఈ సారి తప్పనిసరిగా ఈ చట్టం తీసుకొని రావాలని మోడీ ప్రభుత్వం పట్టుదలతో ఉన్నట్లు మంత్రి వ్యాఖ్యల ద్వారా తెలుస్తున్నది. అయితే గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఇద్దరు పిల్లలు చాలు’ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్లింది. ఇప్పుడు దాన్ని కఠినంగా అమలు చేసేందుకే చట్టం చేయాలని బీజేపీ భావిస్తున్నది.

కాగా, ఇదే సమావేశంలో చత్తీస్‌గడ్‌లోని అధికార కాంగ్రెస్ పార్టీని మంత్రి ప్రహ్లాద్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను లక్ష్యం మేర పూర్తి చేయడం లేదని మండిపడ్డారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.

జల్ జీవన్ మిషన్‌కు సంబంధించి కేవలం 23 శాతమే పూర్తయ్యిందని.. జాతీయ సగటు 50 శాతంగా ఉండగా చత్తీస్‌గడ్‌లో మాత్రం 23 శాతమే ఉందని చెప్పారు. రాష్ట్రంలో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. కానీ నిర్వహణే సరిగా లేదని మంత్రి ఆరోపించారు.

ALSO READ : బీజేపీకి దూరమయ్యే ఆలోచనలో జనసేనాని?

First Published:  1 Jun 2022 6:13 AM GMT
Next Story