Telugu Global
MOVIE UPDATES

50శాతం బ్రేక్ ఈవెన్ సాధించిన ఎఫ్3

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఎఫ్3 సినిమా నిన్నటితో 5 రోజుల రన్ పూర్తి చేసుకుంది. ఈ 5 రోజుల్లో సినిమా 50శాతం బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ వీకెండ్ కూడా భారీ వసూళ్లు వస్తే సినిమా లాభాల్లోకి ఎంటర్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 5 రోజుల్లో 80 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, 5వ రోజైన నిన్న ఈ సినిమాకు ఏపీ, నైజాంలో 3 […]

50శాతం బ్రేక్ ఈవెన్ సాధించిన ఎఫ్3
X

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఎఫ్3 సినిమా నిన్నటితో 5 రోజుల రన్ పూర్తి చేసుకుంది. ఈ 5 రోజుల్లో సినిమా 50శాతం బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ వీకెండ్ కూడా భారీ వసూళ్లు వస్తే సినిమా లాభాల్లోకి ఎంటర్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 5 రోజుల్లో 80 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, 5వ రోజైన నిన్న ఈ సినిమాకు ఏపీ, నైజాంలో 3 కోట్ల 17 లక్షల రూపాయల షేర్ వచ్చింది. దీంతో ఈ 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 35 కోట్ల 28 లక్షల రూపాయల షేర్ వచ్చినట్టయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 5 రోజుల్లో వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 15.20 కోట్లు
సీడెడ్ – రూ. 4.80 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 4.53 కోట్లు
ఈస్ట్ – రూ. 2.43 కోట్లు
వెస్ట్ – రూ. 1.90 కోట్లు
గుంటూరు – రూ. 2.56 కోట్లు
నెల్లూరు – రూ. 1.39 కోట్లు
కృష్ణా – రూ. 2.26 కోట్లు

ALSO READ : 9 రోజుల్లో రూ.100 కోట్లు

First Published:  1 Jun 2022 8:02 AM GMT
Next Story