Telugu Global
National

సోనియా, రాహుల్ లకు ఈడీ సమన్లు

నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీలకు సమన్లు ​​పంపింది. నేషనల్ హెరాల్డ్ కేసును 2015లో దర్యాప్తు సంస్థ మూసివేసిందని కాంగ్రెస్ పేర్కొంటున్న నేపథ్యంలో ఈడీ ఈ సమన్లు పంపడం గమనార్హం. “రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టేందుకు బీజేపీ కీలుబొమ్మలను ఉపయోగిస్తోంది. నేషనల్ హెరల్డ్ ది స్వాతంత్య్ర దినాల నాటి చరిత్ర’’ అని కాంగ్రెస్‌ నాయకుడు, సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ అన్నారు. మమతా […]

సోనియా, రాహుల్ లకు ఈడీ సమన్లు
X

నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీలకు సమన్లు ​​పంపింది. నేషనల్ హెరాల్డ్ కేసును 2015లో దర్యాప్తు సంస్థ మూసివేసిందని కాంగ్రెస్ పేర్కొంటున్న నేపథ్యంలో ఈడీ ఈ సమన్లు పంపడం గమనార్హం.

“రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టేందుకు బీజేపీ కీలుబొమ్మలను ఉపయోగిస్తోంది. నేషనల్ హెరల్డ్ ది స్వాతంత్య్ర దినాల నాటి చరిత్ర’’ అని కాంగ్రెస్‌ నాయకుడు, సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ అన్నారు. మమతా బెనర్జీ, ఫరూక్‌ అబ్దుల్లా సహా ప్రతిపక్ష నేతలంతా కేంద్ర సంస్థల దాడులకు గురవుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

“2015లో, నేషనల్ హెరాల్డ్ కేసును ED మూసివేసింది. కానీ ప్రభుత్వానికి అది నచ్చలేదు. అందుకే అది సంబంధిత ED అధికారులను తొలగించి, కొత్త అధికారులను తీసుకువచ్చి, కేసును మళ్లీ తెరిచింది. ఇది ద్రవ్యోల్బణం, ఇతర సమస్యల నుండి దృష్టిని మళ్లించడానికి ప్రభుత్వం చేస్తున్న కుట్ర‌.” అని సింఘ్వీ ఆరోపించారు.

ప్రభుత్వ చర్యలకు తామేమి భయపడబోము, తలవంచబోము అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా అన్నారు.

Next Story