Telugu Global
National

కొండపైకి ప్లాస్టిక్ వద్దు.. షాంపూలు అసలే వద్దు

తిరుమల కొండపై ప్లాస్టిక్ నిషేధం అనేది ఇదివరకే అమలులో ఉంది. ఇప్పటికే తిరుమలలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ దొరకట్లేదు. కూల్ డ్రింక్స్ కూడా ప్లాస్టిక్ బాటిల్స్ లో అందుబాటులో ఉండవు. నీళ్లయినా, శీతల పానీయాలయినా.. అన్నీ గాజు బాటిళ్లలోనే అమ్ముతుండేవారు. అడపాదడపా.. ప్లాస్టిక్ బాటిళ్లను అమ్ముతున్నా, అధికారుల కంటపడకుండా జాగ్రత్తపడేవారు వ్యాపారులు. కానీ, ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. తిరుమల కొండపై డిస్పోజబుల్ ప్లాస్టిక్ వస్తువు షాపులో కనపడ్డా, ప్లాస్టిక్ కవర్లు వాడినా ఆ షాపునే […]

కొండపైకి ప్లాస్టిక్ వద్దు.. షాంపూలు అసలే వద్దు
X

తిరుమల కొండపై ప్లాస్టిక్ నిషేధం అనేది ఇదివరకే అమలులో ఉంది. ఇప్పటికే తిరుమలలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ దొరకట్లేదు. కూల్ డ్రింక్స్ కూడా ప్లాస్టిక్ బాటిల్స్ లో అందుబాటులో ఉండవు. నీళ్లయినా, శీతల పానీయాలయినా.. అన్నీ గాజు బాటిళ్లలోనే అమ్ముతుండేవారు. అడపాదడపా.. ప్లాస్టిక్ బాటిళ్లను అమ్ముతున్నా, అధికారుల కంటపడకుండా జాగ్రత్తపడేవారు వ్యాపారులు. కానీ, ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. తిరుమల కొండపై డిస్పోజబుల్ ప్లాస్టిక్ వస్తువు షాపులో కనపడ్డా, ప్లాస్టిక్ కవర్లు వాడినా ఆ షాపునే సీజ్ చేస్తారు. ఈ నిర్ణయం ఈరోజునుంచే కఠినంగా అమలులోకి వచ్చింది.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా, తిరుమల పవిత్రతను కాపాడుకోవడంలో భాగంగా.. కొండపై ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధిస్తున్నట్టు తెలిపారు అధికారులు. కొండపైకి వెళ్లే భక్తులు కూడా ఎలాంటి ప్లాస్టిక్ వస్తువుల్ని పైకి తీసుకెళ్లేందుకు అనుమతి లేదు. క్యారీ బ్యాగ్స్ అయినా, వాటర్ బాటిళ్లు అయినా కిందపడేయాల్సిందే. అలిపిరి దగ్గరే అన్నీ చెక్ చేసి బయటపడేస్తారు. దీనికోసం ప్రత్యేక స్కానర్లు కూడా వినియోగంలోకి తెచ్చారు. నడకమార్గాల్లో కూడా స్కానర్లు పెట్టి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ప్లాస్టిక్ వస్తువులు ఉంటే వెంటనే ఆ స్కానర్లు గుర్తు పట్టేస్తాయి.

పిల్లల పాల సీసాల వంటి అత్యవసర వస్తువులకు మాత్రం మినహాయింపు ఉంటుందని తెలిపారు అధికారులు. చిన్న చిన్న వస్తువులపై కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు. ముఖ్యంగా కొండపై షాంపూ ప్యాకెట్ల వినియోగం కూడా నిషేధించారు. సహజంగా తలనీలాలు సమర్పించినవారు వెంటనే చిన్న షాంపూ ప్యాకెట్ తీసుకుని తల స్నానం చేస్తుంటారు. అయితే ఇకపై ప్యాకెట్ షాంపూలు తిరుమల కొండపై దుకాణాల్లో కనిపించవు. చిన్న చిన్న షాంపు ప్యాకెట్లు, ప్లాస్టిక్ కవర్ల వల్ల పర్యావరణం దారుణంగా దెబ్బతింటోందనే భావనతో వాటిపై నిషేధం విధించారు. మరి వీటికి ప్రత్యామ్నాయం ఏంటనేది, భక్తులనుంచి ఎలాంటి స్పందన ఉంటుందనేది ముందు ముందు తెలుస్తుంది.

First Published:  31 May 2022 9:11 PM GMT
Next Story