Telugu Global
National

“కాంగ్రెస్సా? అమ్మో వద్దు” చేతులు జోడించి చెప్పిన ప్రశాంత్ కిశోర్

అమ్మో కాంగ్రెస్ పార్టీతోనా …ఎన్నటికీ ఆ పార్టీతో వెళ్ళను అని చేతులెత్తి మొక్కి మరీ చెప్పాడు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. తన స్వంత రాష్ట్రమైన బీహార్ లో ప్రత్యామ్నాయ ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు గ్రామాల పర్యటనలో ఉన్నప్పుడు ఆయన ఈ ప్రకటన చేశారు. ‘‘2015లో బీహార్‌.. 2017లో పంజాబ్‌.. 2019లో ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ మోహన్‌రెడ్డి.. తమిళనాడు, బెంగాల్‌లలో గెలిచాం.. 11 ఏళ్లలో ఒకే ఒక్క ఎన్నికల్లో ఓడిపోయాం.. 2017 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో.. అందుకే కాంగ్రెస్‌తో […]

“కాంగ్రెస్సా? అమ్మో వద్దు” చేతులు జోడించి చెప్పిన ప్రశాంత్ కిశోర్
X

అమ్మో కాంగ్రెస్ పార్టీతోనా …ఎన్నటికీ ఆ పార్టీతో వెళ్ళను అని చేతులెత్తి మొక్కి మరీ చెప్పాడు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. తన స్వంత రాష్ట్రమైన బీహార్ లో ప్రత్యామ్నాయ ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు గ్రామాల పర్యటనలో ఉన్నప్పుడు ఆయన ఈ ప్రకటన చేశారు.

‘‘2015లో బీహార్‌.. 2017లో పంజాబ్‌.. 2019లో ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ మోహన్‌రెడ్డి.. తమిళనాడు, బెంగాల్‌లలో గెలిచాం.. 11 ఏళ్లలో ఒకే ఒక్క ఎన్నికల్లో ఓడిపోయాం.. 2017 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో.. అందుకే కాంగ్రెస్‌తో కలిసి పని చేయకూడదని నిర్ణయించుకున్నాను” అని ప్రశాంత్ కిషోర్ చెప్పారు.

కాంగ్రెస్ ఎప్పటికీ ఎవ్వరితోనూ కలిసిరాని పార్టీ అని అన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ బాస్ లు తాము వెళ్ళిపోవడమే కాదు అందరినీ తమతో తీసుకెళ్తారని.. ఆ పార్టీలోకి వెళ్తే నేనూ కూడా మునగడం ఖాయం’’ అంటూ వ్యాఖ్యానించారు పీకే.

కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్‌ ప్రసాద్‌సింగ్‌కు నివాళులర్పించేందుకు వైశాలిలో జరిగిన సభలో పీకే ఈ విధంగా మాట్లాడారు.

ఇటీవలి రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరిగిన కాంగ్రెస్ “చింతన్ శిబిరం” గురించి కూడా పీకే కామెంట్ చేశారు. సమావేశాన్నివ్యూహాత్మక “వైఫల్యం”గా ప్రకటించారు. ఈ ఏడాది చివర్లో జరిగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలలో పార్టీ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు.

First Published:  1 Jun 2022 12:00 AM GMT
Next Story